Thursday, September 27, 2018

బ్రహ్మశ్రీ చాగంటి సద్గురువులకు, వారి శ్రీమద్రామాయణ ప్రవచనామృత శ్రోత గా హనుమద్ దర్శనం...! నమ్మిన వారికి సప్త చిరంజీవుల్లో ఒకరైన, సుందరకాండ లోని ఆ సుందరుడే.....! ( ఆ...ఉ... అంటు నసిగే నాస్తికులకు పెద్దగా చెప్పేది ఏముంటుంది..చెప్పినా దండగే కదా... )

Vinay Kumar Aitha shared a photo.

5 July 2015
ఈ కలికాలం లో కాసులకోసం ప్రవచనాలు చెప్పే ఎందరినో చూసే ఉంటాం.
కాని, కేవలం భగవద్ అనుగ్రహం కొరకు మాత్రమే ప్రవచనాలు చెప్పే వారు,
వారి ప్రవచనం మనసారా విన్నంతమాత్రం చేత భగవద్ అనుగ్రహం లభించడం అనేది, కేవలం అసాధారన గురువులకు మాత్రమే సాధ్యం !
శ్రీ చాగంటి గురువుగారు ఈ తెలుగు నేలపై ప్రభవించిన అపర పుంభావ సరస్వతీ స్వరూపులు. సమస్త ఐశ్వర్యములను వర్షించగల శక్తి వారి పాదధూళి సొంతం.
శంకర భగవద్పాదులు , రామకృష్ణ పరమహంస, కంచి పరమాచార్యులవారు, స్వామి వివేకానంద, తాళ్ళపాక అన్నమాచార్యులు, సద్గురు త్యాగరాయ, షిరిడి సాయిబాబ , అరుణాచల రమణ మహర్షి, భక్త రామదాసు , బమ్మెర పోతనామాత్యులు , సంత్ కబీర్ దాస్, తులసిదాస్ , మీరాబాయి...
ఇటువంటి వారి కోవకు చెందిన అపర భాగవతులు శ్రీ చాగంటి వారు...!
"చూసినవారందరికి, విన్న వారందరికి భగవద్ అనుభవాలు, ఎందుకు కలగడం లేదయ్యా..?" అని తర్కించే వారికి సమాధానం ఒక్కటే ::
చెరువులోని పద్మంలో [తామరపువ్వులో] మకరందం ఉన్నప్పటికి అందులోనే ఉండే కప్పలకు అది అలభ్యం.
ఎక్కడో ఉన్నా, నిత్యం మధువు కోసం అన్వేషించే తుమ్మెదకు అది సొంతం !!
శ్రీ రామ చరిత మానస్ is with Venkat Bvh and 24 others.
ఒక భక్తుడి అనుభవం
ఏంతో మంది ప్రవచనాలు ఇస్తున్నారు...కాని చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలకి మాత్రమే ప్రజలు మంత్రముగ్దులు అవ్వడాని కి కారణం ఏంటి? దానికి ఒక్కటే కారణం... ఆయన భగవదనుగ్రహాన్ని పొందారు.... దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి.... కాని అన్ని ఒకేసారి చెప్పడం సాధ్యం కాదు... కాని ఒక ఉదాహరణ మాత్రం మీతో పంచుకుంటాను... నేను చెప్పేది యదార్ధం... నమ్మడం, నమ్మకపోవడం మీ ఇష్టం... ఒకసారి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చిత్తూరు లో సుందరాకాండ మీద ప్రవచనం చెప్తున్నారు... అక్కడ ఒక యాగం కూడ జరుగుతోంది.. యాగం కోసం వినియోగించే సామగ్రి ఒక గది లో పెట్టారు.. ఆ గది లోకి ఏ ప్రాణి కూడా లోపలకి వెళ్లలేదు.. ఇంతలో ఆ గది లో ఉన్న ఒక వస్తువుని పట్టుకొని రమ్మని యాగం నిర్వహించే నిర్వహకులు ఒక వ్యక్తి ని ఆదేశించారు.. ఆ వ్యక్తి ఆ గది తాళాలు తెరచి లోపలకి వెళ్లలేక ఆ గది ముందు చాలా ఆశ్చర్యం తో నిలబడి పోయారు.... ఏందుకంటే ఆ వ్యక్తి ఆ గది లో ఒక అద్భుతాన్ని చూసారు...... ఆ గది లో ఒక పెద్ద కోతి (సుమారు ఒక స్థంభం ఎత్తు)... పెద్ద తిలకం బొట్టు పెట్టుకొని సుందరాకాండ ప్రవచనం వింటోంది... ఆయన తలుపు తీసినప్పటికీ అది అలానే వింటోంది..... ఆ కోతి గంభీరంగా శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం చెప్తున్న వేదిక మీద కి వచ్చింది..... చాగంటి కోటేశ్వరరావు గారు అక్కడ కి వచ్చిన కోతి ని చూసారు... వచ్చింది ఎవరో ఆయన కి అర్ధమయింది.... అయినప్పటికి ఆయన ఆపకుండా ప్రవచనం చెప్తున్నారు.... ఆ కోతి గంభీరంగా అక్కడే నిల్చొని కాసేపు సుందరాకాండ.... ప్రవచనం విని ఆ తర్వాత జనాలు మధ్య నుండి గంభీరంగా వెళ్లిపొయింది..... ... ఇప్పుడు చెప్పండి....వచ్చింది ఎవరై ఉంటారు.... నేను చెప్పకపోయినా మీ ఆందరి కి అర్ధమయింది అని అనుకుంటున్నాను.... వచ్చింది ఖచ్ఛితం గా ఆంజనేయస్వామియే... ఇందులో సందేహం లేదు..... ఇప్పుడు చెప్పండి... శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి కి భగవంతుని అనుగ్రహం కలిగిందా? లేదా?.... ఖచ్ఛితం గా కలిగిందనే చెప్పాలి.... శ్లోకాలు కంఠస్తం చేసి ఎవరైనా ప్రవచనం చెప్పవచ్చునేమో? కాని ఆయన లో మనం చూడవలసింది పరమేశ్వరుని పై ఉన్న భక్తి ని మాత్రమే....... ఆయన ప్రవచనాలు వినడాని కి భగవంతుడే దిగి వచ్చాడు.. ఇక మానవులు ఒక లెక్క?.......నేను ఇప్పుడు చెప్పంది యదార్ధం..... మీకు నచ్చితే షేర్ చేయండి....

No comments:

Post a Comment