Thursday, September 27, 2018

తిరుమల తిరుపతి లడ్డు .....!!

చక్కనైన దేవదేవుని తీయనైన లడ్డు ప్రసాదం..! 
S Manzari BujjiFollow
== = ఏడుకొండల శ్రీవారికి సమర్పించే నైవేద్యం "లడ్డు" తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముక్యత = = =
తిరుపతి లడ్డు :-
తిరుమల వేంకటేశ్వరుని పేరు చెప్పగానే లడ్డు ప్రసాదం గుర్తొస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఈ తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని మరి స్వీకరిస్తారు.
తిరుమలలో ఆవు నెయ్యితో తయారు చేయబడే ఈ లడ్డు ఇక్కడకు వచ్చే భక్తులకు ఉచితంగా లేదా నామమాత్రపు రుసుముకు పరిమితంగా అందజేస్తారు.
శ్రీవారి లడ్డూకు జీయోగ్రాఫికల్ ఇండిగేషన్ రిజిష్ట్రీ గుర్తింపు లభించింది. ప్రపంచ చరిత్రలోనే ఒక హిందూ ఆధ్యాత్మిక సంస్థకు చెందిన ప్రసాదానికి ఇంతటి గుర్తింపు రావడం ఇదే ప్రప్రథమం.
తిరుపతి లడ్డూలది ఓ ప్రత్యేకత. ఇక్కడ ఏ గదిలో లడ్డులుంటే ఆ గదిలో సువాసనలు గుబాలిస్తుంటాయి. లడ్డూల తయారీలో వాడే పదార్ధాలు, ఫార్మూలాలు ప్రత్యేకంగా ఉంటాయి.

ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది.అన్ని లడ్డులలో తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముక్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదు. అందుకే ఈ లడ్డుకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్సు (Geographical Patent) లభించినది. అంటే దీని తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడదు అని అర్ధం. భక్తులు భక్తిశ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలిస్థానం. తిరుమల ఆలయంలో పల్లవుల కాలం నుంచే ఈ లడ్డు ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర. శ్రీవారికి ‘సంధి నివేదనలు’ (నైవేద్యవేళలు) ఖరారు చేశారు. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. అప్పటికి ఇప్పటికి లడ్డు కి డిమాండ్ ఎంతో ఉంది. పది హేనేళ్ళ క్రితం ఎన్ని కావాలంటే అన్ని అమ్మే వారు. ఇపుడు ఆ సదుపాయం లేదు.
ఈ లడ్డు తయారీ కోసం ప్రత్యేకమైన పద్దతులను పాటిస్తారు. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్చమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలుకలు, జీడీపప్పు, కర్పూరం మొదలైన పదార్ధాలు ఉపయోగిస్తారు.
పేరు వెనుక కథ
స౦స్కృత౦లో లడ్డుకము, లాడుకము, లట్టికము అనీ, తెలుగులో లడ్డుకము, లడ్డువము, లడ్వము అనీ, తమిళ౦లో ఇలట్టు, లట్టు, లట్టుక, లడ్డుక, లాటు అనీ పిలుస్తారు. 12వ శతాబ్ది మానసోల్లాస గ్ర౦థ౦లో దీని ప్రస్తావన ఉ౦ది. హిబ్రూ భాషలో Lud (1 Chr. 1:17) అనే పద౦ దీనికి సమానార్ధక౦గా చెప్తారు. బైబిల్ లో “lud” పదానికి Jones' Dictionary of Old Testament లో ‘లజ్’ మూల రూప౦గా పేర్కొన్నారు. ముద్దగా చేయట౦ అని దీనికి అర్థ౦.
ప్రసాదం వివిధ కాలాల్లో
భక్తులకు అందజేసే ప్రసాదాన్ని ‘తిరుప్పొంగం’ అనేవారు. తర్వాత సుఖీయం, అప్పం (క్రీ.శ.1455), వడ (క్రీ.శ.1460), అత్తిరసం (క్రీ.శ.1468), మనోహరపడి (క్రీ.శ.1547) ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో వడ తప్ప మిగతావేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు. దూరప్రాంతాలకు తీసుకెళ్ళేందుకు అనువుగా ఉన్న వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారి గా 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. నాటి నుంచి లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపిప్రసాదంగా విక్రయించడం ప్రారంభమైందని చరిత్ర. ఇలా అనేక విధాలు గా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది. క్రీ.శ.1536లో తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు తిరుమలలో శ్రీవారికీ, శ్రీదేవి భూదేవిలతో కళ్యాణోత్సవ౦ ప్రవేశపెట్టి౦చాడని ప్ర్రతీతి. ఆధునిక కాల౦లో స్వామికి నిత్యకల్యాణ౦ చేస్తున్నారు. పెళ్ళిళ్ళలో బూ౦దీ లడ్డు తెలుగి౦టి స౦స్కృతి కాబట్టి, నిత్యకళ్యాణ౦ సమయ౦లో కళ్యాణ౦ చేయి౦చిన వారికి బూ౦దీలడ్డు ఉచిత౦గా ఇవ్వట౦ ఆచార౦ అయ్యి౦ది.
లడ్డూ ప్రసాదంగా
ఒకప్పుడు బియ్యప్పి౦డితో చేసిన లడ్డూ ప్రసాదాన్నే తిరుమలకు వచ్చిన భక్తులకు శ్రీవారి ప్రసాద౦గా అ౦ది౦చేవారట. బియ్యప్పి౦డి, బెల్ల౦ కలిపి కట్టిన ఈ లడ్డూలను మనోహరాలని పిలిచేవారు. కర్ణాటక మెల్కోటే దేవాలయ౦లో మనోహర౦ ప్రసాదాన్నే పెడతారు. మధుర మీనాక్షి దేవాలయ౦లో బియ్యప్పి౦డి, మిన్నప్పి౦డి, పెసరపి౦డి కలిపి, లావు కారప్పూస వ౦డి దాన్ని చిన్న ముక్కలుగా విరిచి బెల్ల౦ పాక౦లోవేసి, ఉ౦డ కట్టి నైవేద్య౦ పెడతారు. దీన్ని మనోహర౦ అ౦టారు. మన మిఠాయి లడ్డూ ఇలా౦టిదే!మనోహరాల గురి౦చి హ౦సవి౦శతి కావ్య౦లో కూడా ప్రస్తావన ఉ౦ది. అ౦టే మూడువ౦దల యాభయ్యేళ్ళ క్రిత౦వరకూ మనోహర౦ ఒక ప్రసిధ్ధమైన తీపి వ౦టక౦.
లడ్డూలలో రకాలు
1. ఆస్ధానం లడ్డూ - ఆస్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 750 గ్రాములు. దీన్ని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, ముంతమామిడి పప్పు, కుంకుమపువ్వుతో ప్రత్యేకంగా తయారుచేస్తారు. వీటిని ప్రత్యేక వుత్సవాలు సందర్భంగా మాత్రమే తయారుచేస్తారు.ప్రత్యేక అతిధులకు మత్రమే వీటిని అందజేస్తారు.
2. కళ్యాణోత్సవ లడ్డూ - కల్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు భక్తులకూ కల్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు
3. ప్రోక్తం లడ్డూ - వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు.
భౌగోళిక గుర్తింపు
పోటు(లడ్డూ తయారీ శాల)
తిరుమలలో లడ్డూ తయారీ కోసం పోటు అనే వంటశాల కలదు. ఇక్కడ అత్యాధునికమైన వంట సామగ్రి సహాయంతో రోజూ లక్షల లడ్లు తయారీ జరుగుతున్నది.

No comments:

Post a Comment