నిన్న జరిగిన "నీవుగలిగిన చాలు" , అనే అన్నమాచార్య 607 జయంతి ఉత్సవ సభలో, అన్నమయ్య సాహిత్య విశ్లేషకులు , Tadepalli Patanjali "శ్రీ తాడేపల్లి పతంజలి " గారి పాద పద్మాలకు నమస్కరించే భాగ్యము కలిగింది.
అన్నమాచార్యులు స్వామివారి పై రచించిన కృతులను పాడుకొని ఆనందించడం ఒకెత్తు. ఆ కృతులలోని నిగూఢమైన అర్ధాలను తెలుసుకొని ఆ రచనా శైలిని ఆనందించడం మరోఎత్తు.
సరళమైన తెలుగు భాషలో దాగి ఉన్న శక్తిని అన్నమయ్య ఎంత రసరమ్యంగా ఆనాడు ప్రయోగించారో, ఈనాడు మరో తెలుగు పుంభావ సరస్వతి స్వరూపులు, అన్నమయ్య సాహిత్య సౌరభాలను ఒడిసిపట్టుకొనే భాగ్యం కలిగిస్తున్నారు. వీరి సరళమైన విశ్లేషణాత్మక శైలిలో , అద్వైత - విశిష్టాద్వైత సిద్ధాంత సర్వస్వమును "సోహం - దాసోహం "అనే పదాలతో ఎంత చక్కగా వివరించారో చూడండి.
No comments:
Post a Comment