Thursday, September 27, 2018

ఈ విశ్వంలో కనివినిఎరుగని ఆశ్చర్యాలు, అద్భుతాలు తిరుమల అడవుల్లో ఎన్నెన్నో...!

Vinay Kumar Aitha shared a post.
5 July 2015
ఈ విశ్వంలో కనివినిఎరుగని ఆశ్చర్యాలు, అద్భుతాలు తిరుమల అడవుల్లో ఎన్నెన్నో...!
స్వామి అనుగ్రహం ఉంటే తప్ప వాటిని దర్శించే భాగ్యం లభించదు..!!
సాక్షాత్ దేవాధిదేవుడే వైకుంఠం వీడి ఆనందనిలయం లోకి సమస్త లోకరక్షణ కోసం వచ్చినప్పుడు , స్వామి వెంటే అనుక్షణం ఉండే నిత్యసూరులు ఎందరో , వివిధ తీర్ధాలు, గిరులు మొదలగు రూపాలతో శేషాచలం అడవుల్లో కొలువు తీరిఉన్నారు...
Neelayapalem Vijay KumarFollow
తిరుపతి అంటే...వేంకటేశ్వరుడు ...కష్టపడి క్యూ లో నిలుచొని..(కొంత మంది వీఐపీ లు వుంటారు అనుకోండి...) దర్శనం చేసుకొన్నామా..పరిగెత్తి కొండ దిగేసి ట్రెయిన్ లేదా బస్సు పట్టుకొని..మళ్ళీ వాళ్ళ ఊర్లకి వెళ్ళిపొయ్యామా ...!!
తిరుపతి అంటే..ఇదే కాదు ..!!.
ఒక్కసారి మా శేషాచలం అడవులకి రండి ...అక్కడ ఎర్ర చందనమే కాదు .. మనందరికీ తెలిసిన 'తలకోన జలపాతమే ' కాదు... బాలపల్లె అడవుల్లో ఉన్న "గుంజన నది జలపాతం" నయగరా జలపాతాన్ని గుర్తుకు తెస్తుందంటే అతియోశక్తి కాదేమో! అంత అందంగా కనిపిస్తుందది. బండల మీదుగా సుమారు 500 అడుగుల లోతుకు ప్రవహించే జలధార అద్భుతం. ఈ జలపాతం గురించి చాలామందికి తెలియకపోవటం దురదృష్టం. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. రహదారి సౌకర్యం ఉంటే దీనికి ఎంతో గుర్తింపు వచ్చేది.
రేణిగుంట విమానాశ్రయం ఈ శేషాచల అడవులకు దగ్గరలో ఉన్నది. ఇక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రైల్వేకోడూరు నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్తే... 'కొట్రాల గుండాలు', 'చెంచమ్మకోన', 'వాననీళ్ళగుట్టలు', 'కమ్మపెంట', 'కుందేలుపెంట', ' ఏనుగలబావి', 'స్వామి వారి పాదాలు', 'సలీంద్రకోన'.. మొదలైన ప్రాంతాలు ప్రకృతి అందాలకు చిరునామాగా వెలుగొందుతుంటాయి. ఎర్రచందనానికి ప్రసిద్ధిగాంచిన శేషాచలం కొండల్లోకి ట్రెక్కింగ్ వెళ్ళాలంటే ముందుగా... రేణిగుంట-కడప జాతీయ రహదారి మీదుగా కుక్కల దొడ్డి గ్రామంవద్ద ఉన్న "బాలపల్లె బంగ్లా క్యాంప్" నుంచి బయలుదేరాలి.
గుండాలకోన సెలయేరు పైభాగాన 'పసుపుగుండం', 'గిన్నిగుండం', 'అక్కదేవతల గుండం'... ఇలా 'ఏడు గుండాలు' కనిపిస్తాయి. సాధారణ గుండాల కంటే ఎక్కువ లోతుగా ఉండటం వీటి ప్రత్యేకత. గుండాల కోన నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న 'సలీంద్ర కోన' చాల బాగుంటుంది.
నీలకంఠేశ్వరస్వామి ఆలయం విశ్వామిత్రుడు ప్రతిష్ఠించిన గుండాలేశ్వరస్వామి ఆలయ ప్రాంతమే 'గుండాలకోనగా' ప్రసిద్ధి చెందింది. శతాబ్దాలుగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయక్కడ. భక్తుల రద్దీ పెరిగాక ఆర్టీసీ అధికారులు ఆ ఒక్క రోజు మాత్రం రైల్వేకోడూరు నుంచి వై.కోట మీదుగా గుండాలకోనకు బస్సులు నడుపుతున్నారు. కాని దట్టమైన అడవుల్లో దారి తప్పిన సంఘనటలు కొన్ని జరిగాయి. అందుకే అటవీ అధికారుల అనుమతి, సహాయంతో ప్రయాణం సాగించటం మంచిదంటారు.
ఇక్కడ మాత్రమే కనిపించే అరుదైన బ్రహ్మజెముడు పుష్పం ఎంత విశేషమో, రాతిబండలపై 'ఆదిమానవుడు గీశాడని భావించే పశువుల బొమ్మలు' కూడా అంతే విశేషం.
అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రొటెక్షన్ వాచర్స్ చూస్తూ ముందుకు పోతుంటే అక్కడక్కడ గిరిజనులు పశువుల కోసం వేసుకున్న పాకలు కనిపిస్తాయి. 'ఊటీని తలపించే లోయల్ని చూడటం', ఏపుగా పెరిగిన 'ఎర్రచందనం చెట్ల మధ్య నుంచి నడవటం' ఒక గొప్ప అనుభూతినిస్తుంది.
అంతేనా...మా తిరుమల కొండ మీద వున్నన్ని తీర్దాలు ఎక్కడా లేవేమో...తుంబురు కోన నుంచి ఎన్ని తీర్దాలో..!! ఒక్కసారి పాపవినాశనం, ఆకాశ గంగ దాటి వెళ్ళండి.....మీ కంటికి నయనానందకరం ...
గలగల శబ్దాలతో ఒక అందమైన జలపాతం. దాని పక్కనే ఒక గుహ. అడవి మధ్యలోనున్న ఆ గుహలో కొలువుదీరిన తుంబుర స్వామి. చూడముచ్చటగా కనిపించే ఆ ప్రదేశమే తుంబురకోన క్షేత్రం. ఇక్కడ కూడా మహాశివరాత్రి రోజు పెద్దఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. తిరుమలకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. ఇలా ఎన్నెన్నో...వెబ్ సైట్లో దొరికిన కొన్ని ఫోటోలు పెట్టడం జరిగింది...
టూరిజం గా అభివృద్ధి చేయాలి అంటారు కదా....అందరమూ చెప్పేది అదే...కానీ కావటం లేదే...దేవుని దాటి మనం పోవడం లేదే...!! చూద్దాం కొత్త రాష్ట్రం లో అయినా మా తిరుపతి అడవుల అందాలు...చూసే భాగ్యం అందరికీ లభిస్తుందేమో...!!

No comments:

Post a Comment