Thursday, September 27, 2018

🌺కౌసల్యా సుప్రజా రామా 🌺...!

Suryendu Bhouma Budha Vaakpathi Kavya Souri..
Swarbhaanu Kethu Divshat Parishat Pradanaaha...
Twad Daasa Daasa Charamaa Vadhi Daasa Daasaha... 
Santosh Kumar to తెలుగుభక్తి పుటలు
🌺కౌసల్యా సుప్రజా రామా 🌺... తిరుమల శయనమంటపంలోని భోగశ్రీనివాసుని ఈ సుప్రభాతం ద్వారా మేల్కొలుపుతారు. బంగారు వాకిలిలో పదహారు స్తంభాల తిరుమామణి మంటపంలో ఈ సుప్రభాతాన్ని పఠిస్తారు. సుప్రభాత పఠనానంతరం భోగశ్రీనివాసుని గర్భగుడిలోనికి తీసికొని వెళతారు. 1430 సంవత్సరంలో శ్రీవీరప్రతాపరాయల హయాంలో వేదపఠవంతోపాటు సుప్రభాత పఠనం కూడా ఆరంభమైంది. అప్పటినుండి అవిచ్ఛిన్నంగా (అంటే 580 సంవత్సరాలుగా) ఈ సంప్రదాయం కొనసాగుతున్నది. సుప్రభాతాన్ని బంగారువాకిలి ఎదురుగా "తిరుమామణి మంటపం"లో పఠిస్తారు. ఈ సుప్రభాతం కీర్తనలో నాలుగు భాగాలున్నాయి.
వెంకటేశ్వర సుప్రభాతం - దేవునికి మేలుకొలుపు : 29 శ్లోకాలు - ఇది ప్రతివాద భయంకర అణ్ణన్ రచించిన భాగం. శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాలను ధరించిన శ్రీమహావిష్ణువు కలియుగంలో శ్రీవెంకటేశ్వరునిగా అవతరించి భక్తులను బ్రోచుచున్నాడని, ఆ దేవదేవుని కొలిస్తే సకలార్ధ సిద్ధి కలుగుతుందని సుప్రభాత కీర్తనలో సూచింపబడుతున్నది.
వెంకటేశ్వర స్తోత్రం - భగవంతుని కీర్తన : 11 శ్లోకాలు
వెంకటేశ్వర ప్రపత్తి - భగవంతునికి శరణాగతి: 16 శ్లోకాలు - శ్రీవైష్ణవ సంప్రదాయంలో ప్రపత్తి అనేది చాలా ముఖ్యమైన అంశం. గురువులకు, భగవంతునికి సంపూర్ణంగా శరణాగతులవడం ప్రపత్తి లక్షణం.
వెంకటేశ్వర మంగళాశాసనము - పూజానంతరము జరిపే మంగళము : 14 శ్లోకాలు - ఈ భాగాన్ని మణవాళ మహాముని రచించాడట.....
శుభోదయం...శుభదినం

No comments:

Post a Comment