Thursday, September 27, 2018

సామవేద సారం.

ఆహా.. ఎంత హాయిగ ఉందో సామవేదం గురించిన విషయవివరణ..!
అందుకే కాబోలు, సద్గురు త్యాగరాయుల వారు, సామవేద సారమే ఆ సర్వేశ్వరుడు అని తమ కృతిలో , ఎంతో రసరమ్యంగా , మనో చిత్తములు రంజిల్లు విధంగా , మనలోనే పంచకోశముల ఆవల కొలువై ఉన్న ఆ పరమేశ్వరుని తెలుపుతూ, "చిత్తరంజని" రాగంలో సమకూర్చారు !!
Paritala Gopi Krishna
సామవేద సారం.
1. ఋగ్వేదయజుర్వేదాలు జ్ఞాన కర్మకాండలు. సామవేదం ఉపాసనాకాండ. ఉపాసన అంటే పరెమేశ్వరుని (ఉప) సమీపంగా ఉండడం.
2. యజ్ఞంలో ఉద్గాత (మంత్రం స్వరగాన యుక్తంగా పలికే గాయకుడు) స్వరబద్ధంగా, ఉచ్ఛ స్వరంతో గానంచేసే మంత్రాల సమూహమే సామవేదం.
3. ఋక్కుల స్వరప్రదానగానం సామం (ఇది మురళీగానం వంటిదేనా! పరమాత్మ మురళి పలికిందేనేమో!)
4. సామవేదానికి గాంధర్వం ఉపవేదం.
5. గానరసానికి సోమరసం చేయూత.
6. ఏది సాధువో - శుభాహమో అది సామం (యత్ ఖలుసాధు తత్ సామ)
7. సామవాదం పూర్వార్చికలో 640 మంత్రాలున్నాయి. (6 ప్రపాఠకాలు) ఉత్తరార్చికలో 1225 మంత్రాలున్నాయి (9 ప్రపాఠకాలు).
8. ఇంద్ర, వరుణ, అశ్వినా, మారుత, ఆదిత్య, విశ్వేదేవ, సోమ, ఏవమాన, అగ్ని, సవిత, మిత్రాది దివ్యుల స్తోత్రాలు సామవేదంలో ఉన్నాయి.
9. వశిష్ఠ, వామదేవ, భరద్వాజ, మేధాతిథి, కణ్వ, విశ్వామిత్ర, గౌతమ, శునశ్శేప, మొ.గు 17 మంది మంత్రద్రష్టలు (ఋషులు) ఉన్నారు.
10. సర్వేశ్వరుడైన పరమాత్మను మాత్రమే సామవేదం కీర్తిస్తుంది.
11. సామగానం వల్ల రోగాలు నయమవుతాయి. వాతావణంలో మంచి మార్పులు వస్తాయి. మనశ్శాంతి కలుగుతుంది.
12. నేను వేదాల్లో సామవేదాన్ని అన్నాడు కృష్ణ పరమాత్మ (వేదనం సామవేదోస్మి)
-- తుకారం -- శివినానంద భారతి, ఫిబ్రవరి 2015.

No comments:

Post a Comment