Wednesday, September 26, 2018

పావన గంగా రహస్యాలు - Secrets of Sacred River Ganga..!

ప్రపంచ పటం లో ఎన్నో దేశాలు ఉన్న , భారత దేశానికి సమున్నత స్థానం కలిగించేవి 5 :
1. గంగ - River Ganga
2. గోవు - The Holy Indian Cow
3. గీత - The Bhagawadgeeta
4. గోవిందుడు - Lord Govinda
5. గురువు [ లేదా గురుపరంపర ] - The Guru Parampara
ఈ ఐదింటి ప్రాశస్త్యాన్ని తమ శక్తి మేర పరిరక్షించడం ప్రతి భారతీయుని యొక్క నైతిక బాధ్యత !
పావన గంగా రహస్యాలు - Secrets of Sacred River Ganga
గంగా జలం గురించి సైన్సు చెబుతున్నదేంటి? ఆ నది నీటిలో రహస్యాలేంటి?
ఒక్క మునకతోనే సమస్తపాపాలు తొలగించే శక్తి పరమ పవిత్రమైన గంగకు ఉందని ధార్మిక గ్రందాహాలు చెబుతున్నాయి. గంగ మీద ఆధునిక కాలంలో జరిగిన పరిశోధనలు చాలా ఆశ్చర్యపరిచే విషయాలు వెల్లడయ్యాయి.
యాంటి - బ్యాక్టీరియల్ శక్తి :
1896 లో ' ఈ హంబురె హంకిన్ (E. Hanbury Hankin) ' అనే బ్రిటిష్ వైద్యుడు ( British physician) గంగా జలం మీద పరీక్షలు జరిపి, ప్రెంచి పత్రిక అన్నాలెస్ డి ఇన్స్టుట్ పాశ్చర్ (Annales de IInstitut Pasteur) లో ఒక పరీశొధనా వ్యాసం రాశారు. దాని సారాంశం
ప్రాణంతకమైన కలరా వ్యాధిని కలిగించే bacterium Vibrio Cholerae ని గంగా నీటిలో వెసినప్పుడు అది కేవలం 3 గంటల్లోనే పూర్తిగా నశించింది. అదే బ్యాక్టీరియా శుద్ధి చేయబడిన జలాల్లో (distilled water ) 48 గంటల తరువాత కూడా జీవనం కొనసాగించింది. ఇది మన గంగమ్మ తల్లి శక్తి.
సి. ఈ. నీల్సన్ అనే బ్రిటిష్ వైద్యుడు భారత్ నుండి తిరిగివెళ్తూ, గంగా నది ప్రవాహంలో అత్యంత కాలుష్యమైన ప్రదేశమైన హూగ్లీ నుండి గంగా నీటిని నౌకలో ఇంగ్లాండు తీసుకువెళ్ళాడు. అంత కలుషితమైనా కూడా గంగ నీరు ఆయన సుదీర్ఘ ప్రయాణంలోనూ, ఆయన ఇంగ్లాండుకు చేరిన తరువాత కూడా ఆ నీరు పరిశుద్ధంగానే ఉంది. మాములు నీటిని గాలి చొరబడని సీసాలో పెడితే ప్రాణవాయువు లేని కారణంగా ఆ నీటిలో వాయురహిత బ్యాక్టీరియా (anaerobic bacteria) వృద్ధి చెంది నీరు వాసన వస్తాయి. ఆ వాసన దాదాపు కుళ్ళు వాసనలాగే ఉంటుంది. కాని గంగ నీరు మాత్రం పరిశుద్ధంగానే ఉంది. ఇది గంగకున్న శక్తి.
ఇది మనం కూడా గమనించవచ్చు. కాశీ యాత్రకు వెళ్ళినవారు గంగాజలాన్ని ఇంటికి తీసుకువస్తే అది ఎన్ని సంవత్సరములు గడిచినా చెడిపోదు, కుళ్ళువాసన రాదు. ఇది మన హిందువులు పూజించే గంగమ్మ తల్లి శక్తి.
1927 లో Flix dHerelle అనే ఫ్రెంచి microbiologist గంగ నీటిలో కొద్ది అడుగుల క్రింద విరేచనాలు (dysentery), కలరా వంటి జబ్బులతో మరణించిన వ్యక్తుల శవాలు తేలుతుండటం చూసి, ఆ ప్రదేశంలో ఉన్న నీటిలో కొన్ని కోట్ల క్రిములుంటాయని భావించారు. కానీ ఆ నీటిని సేకరించి, పరిక్షిస్తే, అసలు అక్కడ క్రిములే లేవు.
అందుకే కొన్ని వేల సంవత్సరాలుగా హిందువులు గంగ మృతదేహాలను పవిత్రం చేస్తుందని అంటారు. దాని అర్ధం ఇదే. భయంకరమైన రోగాలతో చనిపోయిన వారి మృతదేహాలను కూడా పరిశుద్ధం చేస్తుంది. అటువంటి శక్తి గంగకుంది.
డి. యస్. భార్గవ అనే భారతీయ environmental engineer/professor of hydrology తన జీవితకాలాన్ని మొత్తం గంగ యొక్క అద్భుతమైన శక్తిని గురించి పరిశోధించడానికే అంకితం చేశారు. గంగకు తనను తాను ప్రక్షాళణ చేసుకునే శక్తి మిగితా నదులతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందని తన 3 ఏళ్ళ పరిశోధనలో తేల్చారు. మిగితా నదులతో పోలిస్తే గంగ తన బయోకెమికల్ ఆక్సిజెన్ డిమాండ్ స్థాయిని అత్యంత వేగంగా తగ్గించగలదని, ఇతర నదులకంటే 15 నుంచి 20 రెట్ల వేగంగా తనలో కలిసిన వ్యర్ధాలను తొలగించుకోగలదని ఆయన పరిశోధనలో తేలింది.
న్యూడిల్లీ మలేరియా పరిశోధన కేంద్రం వారు ఇతర నది జలాలు దోమల పునరుత్పత్తికి దోహదపడతాయి. కాని గంగానది ఎగువజలాలు మాత్రం దోమల పునరుత్పత్తి ఉండదు. అక్కడ దోమలు పునరుత్పత్తి కాకుండా నిరోదిస్తుంది గంగమ్మ తల్లి జలం. అంతేకాదు! ఇతర జలాల్లో గంగా జలాలను కలిపితే ఆ నీరు కూడా దోమల పునరుత్పత్తిని నిరోదిస్తుంది.
ప్రధానంగా 2 చెబుతున్నారు పరిశోధకులు.
1) గంగలో బ్యాక్టీరియోఫేజ్ (Bacteriophage) ఉండడం వలన అది సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది.
2) శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టని కారణం/ శక్తి గంగానదిలో ఉండడం వలన, అది వాతావరణంలో ఉన్న ఆక్సిజెన్ ను తీసుకునేందుకు అసాధారణమైన సామర్ధ్యాన్ని ఇస్తోంది. దీనినే Mystery Factor/Mystery X Factor అని పిలుస్తున్నారు.
బ్యాక్టీరియోఫేజ్ అంటే బ్యాక్టీరియను చంపే వైరసులు. ఏ విధంగానైతే పిల్లి ఎలుకను తింటుందో, అదే విధంగా ఈ వైరస్లు బ్యాక్టీరియాలని నాశనం చేస్తాయి. నిజానికి హాంకిన్, 1896 లో గంగ యొక్క యాంటి-బ్యాక్టీరియల్ లక్షణం గురించి ఒక నివేదిక ఇచ్చారు. అదే ఆధునికకాలంలో బ్యాక్టీరియోఫేజ్ గురించి చెప్పిన తొలి డాక్యుమెంటేషన్. హెరెల్ల్ గంగ యొక్క ఈ విశిష్టవంతమైన లక్షణాన్ని గమనించి, గంగలో ఉన్న ఈ వైరస్ బ్యాక్టీరియోఫేజే అని చెప్పారు.
గంగాజలంలో ఆక్సిజేన్ స్థాయులు అధికంగా ఉండడమే చేతనే గంగ నీరు సుదీర్ఘకాలం పాటు తాజాగా ఉంటాయి. గంగ నీటిని ఇతర జలాలకు తగినంత మోతాదులో కలిపినప్పుడు, ఇతర జలాల్లోకి ఈ బ్యాక్టీరియోఫేజ్ వ్యాపించి,ఆ నీటిని కూడా శుద్ధి చేస్తుంది. దానిలో ఉన్న క్రిములను సమూలంగా నాశనం చేస్తుంది. అందుకే పురాతన హిందువులు, గంగాజలాన్ని తమతో పాటు తమ స్వస్థలాలకు తీసుకువెళ్ళి, అక్కడ ఉన్న జలవనరులలో కలిపేవారు. అదే ఈరోజు కూడా ఆచరిస్తున్నాం కాని మనకు కారణం తెలియదు, అవి కలపడం వలన కలిగే ప్రయోజనం కూడా తెలియదు.
ఇంకా చెప్పాలంటే, బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులకు యాంటి-బ్యాక్టీరియల్ ఔషధం గంగాజలం. ఈ నీటిని వాడేవారు కనుకే పురాతన హిందువులు ఎటువంటి యాంటి-బయోటిక్ మందులు వాడకున్నా, ఏ రోగం లేకుండా జీవితాంతం సుఖంగా గడిపేవారు. అతి తక్కువ పరిశోధనలు జరుగునప్పటికి, ఈ నీటిని బ్యాక్టీరియోఫేజ్ థెరపికి ఉపయోగించవచ్చని పరిశోధకుల అంటున్నారు. ఇటువంటి పరిశోధనలు సోవియట్ యూనియన్ లో చాలా ఎక్కువగా జరిగాయి. ఎందుకంటే హెరెల్ల్ గంగానది యొక్క బ్యాక్టీరియోఫేజ్ నే ప్రపంచానికి పరిచయం చేశాక, రష్యాలో ఆయన పేరు మీద ఒక పరిశోధన సంస్థ కూడా ఏర్పడింది.
నేడు అనేక హానికారక బ్యాక్టీరియ యాంటి-బయోటిక్స్ ను తట్టుకుని నిలబడే సామర్ధ్యం పొందాయి. ప్రపంచంలో చాలా యాంటి-బయోటిక్స్ విఫలమవుతున్నాయి. అందువల్ల ప్రజలలో రోగనిరోధకత క్షీణించి, వారి చికిత్స చేయడం కూడా వైద్యులకు చాలా సంక్లిష్టంగా మారుతోంది. మానవజాతి యాంటి-బయోటిక్స్ కి పూర్వం ఉన్న శకంలోనికి వెళ్ళిపోతోందనే ఆందోళన మొదలైంది. అత్యవసరంగా ప్రత్యామ్నాయ పద్ధతులను అభివృద్ధి చేయడమే అతి ముఖ్యమైన అంశాలుగా ఆధునిక వైద్యము, బయోటెక్నాలజి రంగాలు కృషి చేస్తున్నాయి.
ఇటువంటి సంక్లిష్ట పరిస్థితులలో గంగ నీటితో యాంటి-బయోటిక్ ను తయారుచేసి ఔషధంగా కనుక ఇస్తే కనుక ప్రజలు ఏ రోగం లేకుండా, మందులు వాడకుండా హాయిగా బ్రతకవచ్చని గంగ నది మీద పరిశోధనలు చేసిన అనేక మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు తెగేసిచెప్తున్నారు.
ఇంత గొప్పది మన గంగమ్మ. ఇన్ని విశిష్టవంతమైన లక్షణాలు మన గంగమ్మ తల్లికే సొంతం. ఇది హిందువులకు, భారతదేశానికి గర్వకారణం.
మన గంగమ్మ గురించి ఆధునికకాలంలో జరిగిన పరిశోధనలు ఏమి చెబుతున్నాయి?
గత 50 సంవత్సరాల క్రితం నమోదైన పరిశోధనా వివరాల ప్రకారం, కలుషిత జలాల్లో కేవలం కొన్ని చుక్కల గంగాజలం చేరిస్తే కలుషిత జలాలు పరిశుభ్రమై, రోగకారక క్రిములను నాశనం చేసేవి. అందుకే మన హిందువులు గంగాతీరంలో ఉన్న తీర్ధయాత్రలకు వెళ్ళినప్పుడు తప్పకుండా, గంగాజలం తీసుకువచ్చి నలుగురికి పంచుతారు. పురాణాల్లో కూడా మన అనేక కధలు కనిపిస్తాయి. ఎందరో రాజు ఎంతో ధనం ఖర్చు పెట్టి పట్టాభీషేకాలకు, ఇతర పూజా కార్యక్రమాలలో వాడడం కోసం గంగా జలం తెప్పించుకునేవారు. ఈరోజుకి కూడా అనేకమంది హిందువులు పవిత్రకార్యక్రమాల్లో వాడేందుకు గంగాజలం తెప్పించుకుంటున్నారు.మనవేవి మూడనమ్మకాలు కావు. మనకు తెలియనంత మాత్రాన మన ఆచారసంప్రదాయాలను కించపరచకండి.
గంగకు ప్రత్యేకతకు కారణం దానిలో ఉన్న బ్యాక్టీరియోఫేజ్. అది ఎంతో శక్తివంతమైనది. గంగోత్రిలో మొదలై, గంగాసాగరం వరకు ఇది గంగలో చేరిన మొత్తం క్రిములను సమూలంగా నాశనం చేసి, గంగను శుద్ధి చేస్తుంది. అది కూడా కేవలం 24 గంటల్లోనే 2525 కిలోమీటర్ల గంగ పరిశుద్ధమవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అలా శుద్ధి చేశాక ఈ బ్యాక్టీరియోఫేజ్ ఆనవాళ్ళు కూడా గంగలో కనిపించవు. కాని ఇదంతా 50 ఏళ్ళ క్రితం మాట అంటారు గంగ మీద పరిశోధన చేసిన రమేష్ చంద్ర గారు.
అందుకంటే గంగా ప్రవాహాన్ని అడ్డుకునే డ్యాములు వంటి వాటి వలన ఈ బ్యాక్టీరియోఫేజ్ క్రింది ప్రాంతానికి అంత వేగం వ్యాపించటంలేదు. ఈ ప్రైక్రియా కాస్త నెమ్మదించింది.
మరి ఇన్ని కోట్లమంది గంగలో స్నానం చేస్తుంటే గంగ కలుషితం కాదా? గంగలో స్నానం చేయడం వలన అంటువ్యాధులు రావా?
ఈ పవిత్ర కుంభమేళా సమయంలో 10 కోట్ల మంది భక్తజనం త్రివేణిసంగమంలో పవిత్రస్నానం చేస్తారని అంచనా. ఇన్ని కోట్ల మంది త్రివేణి సంగమమనే ఒక చిన్న ప్రదేశంలో స్నానం చేస్తే కొత్త రోగాలు వ్యాపించవా?
మనం గతభాగాలలో చెప్పుకున్నాం. గంగలో బ్యాక్టీరియోఫేజ్ ఉందని. దాని ప్రభావాల గురించి విపులంగా తెలుసుకున్నాం. బ్యాక్టీరియోఫేజ్ మానవ వ్యర్ధాలు, వారి శరీరం నుండి వచ్చే క్రిముల మీద ఆధారపడి జీవిస్తాయి. మానవులు నదిలో స్నానం చేసినప్పుడు వారి శరీరం నుండి నదిలో కలిసే క్రిములు వీటికి ఆహరం. ఎంత ఎక్కువమంది స్నానం చేస్తే అంత ఎక్కువగా ఈ బ్యాక్టీరియోఫేజ్ ఉద్భవిస్తాయి. అందుకే కుంభమేళా, పవిత్ర దినాలు, పండుగ రోజుల్లో కోట్లాది మంది గంగలో స్నానం చేసినా ఒక్క అంటువ్యాధి కూడా వ్యాపించదు. ఆ నీరు కూడా కలుషితం కాదు. వినడానికి వింతగానే ఉన్నా ఎంత ఎక్కువమంది స్నానం చేస్తే గంగ అంత పరిశుద్ధమవుతోంది అని గంగ మీద పరిశోధనలు జరిపిన వారు చెప్పే మాట.
అంతేకాదండోయ్! మరొక ఆసక్తికరమైన అంశం, ఈ మధ్యే బ్రిటిష్ వారి పరిశోధనలలో తెలింది. ఈ పవిత్ర కుంభమేళా సమయంలో పవిత్రస్నానం చేసినవారికి మానసికరోగాలనుండి విముక్తి లభించిందట. చాలా శారీరిక రోగాలు తగ్గిపోతున్నాయట.. ఎంత గొప్పది మన గంగమ్మ తల్లి. నదిలో మునిగితే ఏం వస్తుంది అనేవారికి ఇది సమాధానం కూడా.
2003 లో పవిత్ర గోదావరి నదికి నాసిక్ లో జరిగిన అర్ధ కుంభమేళ లో 6 కోట్లమంది స్నానం చేశారని అంచనా. అప్పుడు అక్కడి నీటిని పరిక్షిస్తే అందులో కూడా 8, 9 రకాల బ్యాక్టీరియోఫేజులను పరిశోధకులు గుర్తించారు. అటువంటి శక్తి గోదావరికి కూడా ఉంది. అందుకే పంచ గంగలో గోదావరి నది ఒకటైంది.
గంగకే పరిమితమైన జీవరసాయనిక ప్రకృతి(special chemical and biological properties), అత్యధిక స్థాయి re-oxygenation ప్రక్రియ దాని ప్రత్యేకతలు. వాటి కారణంగానే, గంగ సహజవ్యర్ధాలను అతిత్వరగా తనలో కలిపేసుకుంటుంది. జంతువులు వ్యర్ధాలను గంగనీటితో నింపిన ఒక ట్యాంకులో వేస్తే అవి కేవలం 3 రోజుల్లోనే కరిగిపోయాయి.
ఇంత గొప్ప గంగ కలుషితమవుతోంది. భారతీయులకే గర్వకారణమైన గంగ కలుషితమైతే జరిగే నష్టాలేమిటి? కలుషితమైన గంగ తన శక్తిని కోల్పోతోందా?
గంగ కలుషితమవుతోంది.
అవును హిందువులు పరమపవిత్రంగా పూజించే గంగ, ఎన్నో విశిష్టతలు కలిగిన గంగ, భారతదేశంలో 40% జనాభాకు జీవానాధారమైన గంగ అత్యంత ఘోరంగా కలుషితమవుతోంది. ప్రతి రోజు గంగలో 2.9 బిల్లియన్ లీటర్ల మానవ్యర్ధాలు గంగలో కలుస్తున్నాయి. కేవలం వారణాశి(కాశీ) నుంచే 200 మిల్లియన్ లీటర్ల మానవవ్యర్ధాలు గంగలో కలుస్తున్నాయి.దానికి తోడు గంగలోకి అనేక కర్మాగారాలు హానికర వ్యర్ధాలను విడుదల చేస్తున్నాయి.
కాలుష్యం కారణంగా గంగలో కోలిఫొర్మ్ స్థాయి పెరుగుతోందని UECPCB అధ్యయనం చెబుతోంది. త్రాగునీరైతే కోలిఫోర్మ్ స్థాయి 50 కంటే తక్కువ ఉండాలని, 500 కంటే తక్కువ ఉంటేనే ఆ నెరు స్నాననికి పనికోస్తాయని, 5000 కంటే తక్కువ స్థాయిలో కోలిఫోర్మ్ ఉంటేనే వ్యయసాయానికి నీరు పనికొస్తాయని చెప్తారు. అటువంటిది గంగలో కోలిఫోర్మ్ స్థాయి హరిద్వార్ లోనే 5500 కంటే ఎక్కువ స్థాయిలో ఉందిట. దీనికి ప్రధాన కారణం గంగలో మానవుల మలమూత్ర విసర్జితాలను ఎటువంటు శుద్ధి చేయకుండ కలపడమే.
ఈ రోజుగంగానది ఎంత కలుషితమైందంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ సిపార్సు చేసిన స్థాయి కంటే గంగలో 3000 రెట్ల అధికంగా విషపదార్ధాలు, రసాయానాలు, క్రిములు చేరాయని చెప్తున్నారు.
దీనికి విరుద్ధంగా, గంగ మీద పరిశోధనలు జరిపిన భారతీయులు మాత్రం గంగకు ఇంకా ఔషధ గుణాలున్నాయని, కాని మరింత కలుషితమైతే మాత్రం ఇక పరిస్థితి చెయ్యి దాటిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంగకు అనేక ఔషధ గుణాలున్నా, భారతదేశం మీద అసూయతో ఇతర దేశస్థులు గంగానది మీద పరిశోధనలలో వెల్లడైన నిజాలను దాచి ఉంచుతున్నారని వాపోతున్నారు.
ఏది ఏమైనా, గంగ ప్రపంచంలో ప్రమాదం పొంచి ఉన్న పది నదులలో ఒకటిగా ప్రకటించారు ఐక్యరాజ్య సమితి వారు. మన గంగను మనమే కాపాడుకోవాలి.
గంగ ఇంత కలుషితమైనా గంగలో ఇంకా ఔషధ గుణలున్నాయా?
కలుషిత గంగ ఇప్పటికి ఔషధ గుణాలను కలిగివుంది - సంజయ్ పాండే, లక్నో,DH News Service
గంగానది కాలుష్యం వలన త్రాగునీటికి, సాగునీటికి పనికిరాదంటూ వచ్చిన అనేక నివేదికలను బుట్టదాఖలు చేస్తూ, గంగానదికి ఔషధ గుణాలు ఇంకా ఉన్నాయని, గంగానది మీద పరిశోధనలు జరిపిన సీనియర్ శాస్త్రవేత్త Dr Chandrashekhar Nautiyal, National Botanical Research Institute (NBRI) , ప్రతిష్టాత్మక CSIR laboratory పరిశోధలను ఋజువు చేశాయి.
ఈ పరిశోధన యొక్క లక్ష్యం గంగకి యాంటి- బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయన్న పురాతన విజ్ఞానాన్ని ధృవీకరించడానికి, గంగ నీటిలో ఉన్న క్రిమిసంహారక ఔషధ లక్షణాలు మరింత విశ్లేషించడానికి, కలుషితమైనా,గంగ తనను తాను శుద్ధిచేసుకునే సామర్ధ్యాన్ని కలిగి ఉండటం, గంగ సూక్ష్మక్రిములను ముఖ్యంగా E.coli O157:H7 ఎదుర్కునే శక్తిని గురించి ఋజువు చేయడానికి గంగాజలం మీద పరిశోధనలు జరిపారు Dr Chandrashekhar Nautiyal. ఆయన పరిశోధనా పత్రం ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘Current Microbiology’ లో ప్రచురితమైంది.
E.coli ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మానవులు, జంతువులు ఎదుర్కునే సమస్య. అతిసారము, మూత్రకోశసంబంధిత వ్యాధులకు కారణం E.coli O157:H7 అనే క్రిమి. Ernest Hankin అనే బ్రిటీష్ bacteriologist 1896లో గంగ నీటి మీద జరిపిన పరిశోధనలను ఆధారంగా చేసుకుని పరిశోధన చేశారు. Nautiyal పరిశోధనలో E.coli 3 రోజుల క్రితం గంగా నీటిలో 3 రోజులు మాత్రమే జీవించింది. 8 ఏళ్ళ క్రితం తీసుకున్న గంగా నీటి sampleలో 7 రోజులు, 16 రోజుల క్రితం గంగాజలం sampleలో 15 రోజులు మాత్రమే జీవించగలిగింది.
అదే E.coli కాచిన(వేడి) చేసిన నీటిలో మరింత ఎక్కువకాలం జీవనం కొనసాగించింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే గంగలో ప్రతిరోజు కొన్ని బిల్లియన్ లీటర్ల మలమూత్రాలను గంగలో కలుస్తున్నా, గంగాజలం ఇంకా ఔషధశక్తులను కోల్పోలేదు. అది అనేక క్రిములకు వ్యతిరేకంగా పోరాడుతోంది.
అందుకే గంగ మీద మరింత పరిశోధనలు చేస్తే, క్రిమిసంహారకమైన ఒక ఔషధాన్ని ఈ ప్రపంచానికి అందించవచ్చని Dr. Nautiyal తన పరిశోధన చివరలో పేర్కొన్నారు.
-కలుషిత గంగ ఇప్పటికి ఔషధ గుణాలను కలిగివుంది - సంజయ్ పాండే, లక్నో,DH News Service
అంతేకాదు, అనేకమంది గంగలో పవిత్రస్నానం చేస్తారు. గంగలో అనేక హానికరమైన రసాయనాలు కలుస్తున్నా, గంగలో స్నానం చేసినవారికి ఏ విధమైన జబ్బులు, దురదలు, ఇతర చర్మ సంబంధిత వ్యాధులు మచ్చుకైనా రావట్లేదు. గంగలో స్నానం చేసి కొందరు, అక్కడే పారుతున్న నీటినే తీర్ధంగా తాగేస్తారు. అయినా వారిలో ఎటువంటి అనారోగ్యసమస్యలు ఉత్పన్నం కావట్లేదు. ఇంకా వివరంగా చెప్పాలంటే అక్కడ స్నానం చేసినవారు ఆరోగ్యవంతులవుతున్నారని పరిశోధనలే చెబుతున్నాయి. అదే గంగలో ఉన్న శక్తి. హిందువులు పవిత్రంగా భావించే గంగమ్మకు ఉన్న శక్తి. కేవలం పాపాలనే కాదు తనలో కలిసిన మలినాలను కూడా గంగమ్మ పరిశుభ్రం చేస్తోంది.
ఈ శక్తిని ఎలా వివరించాలో అర్ధంకాకే, గంగ మీద పరిశోధనలు జరిపిన డి. ఎస్. భార్గవ, గంగలో ఉన్న ఆ దివ్యశక్తిని Mysterious Factor X గా చెప్తున్నారు.
కాని అందరూ చెప్పే మాట, గంగ మరింత కలుషితమైతే, తన విశిష్టవంతమైన లక్షణాలను, ఔషధ గునాలను పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రజలు, ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. గంగలో వ్యర్ధాలను కలపడాన్ని అడ్డుకోవాలి. మన గంగను మనమే కాపాడుకోవాలి.
గంగానదికి ఉన్న మరిన్ని ప్రత్యేకతలు ఏమిటి?
గంగా తనలో కలిసిన మానవులు, జంతువుల వ్యర్ధాలను, సహజ వ్యర్ధాలను, 30 నుంచి 45 నిమిషాలలో 60% తొలి వరకు శుద్ధిచేస్తుంది. ఇదే ఇతర నదులకు కొన్ని రోజుల సమయం పడుతుంది. గంగానది హానికరక్రిములను ఇతరనదులంటే 25 రెట్ల వేగంగా నాశనం చేస్తుంది. మిగితా నదులతో పోల్చినప్పుడు గంగ అనేక రెట్లు వేగంగా క్రిములను నాశనం చేయగలదు. అందుకే గంగకు అంత ప్రత్యేకత.
సాధారణంగా వేడి చేసిన నీటిలో క్రిములు చేరవు. పరిశుద్ధంగా ఉంటాయి. కాని గంగాజలం వేడి చేస్తే, తన ఔషధ గుణాలను కోల్పోతుంది. 1980 లో భార్గవ అనే పరిశోధకులు గంగా నీటిని 2 వేర్వేరు పాత్రలలో తీసుకుని, ఒక పాత్రను వేడి చేసి, ఆ నీరు చల్లబడ్డాక అందులో క్రిములను చేర్చగా, ఆ నీటిలో క్రిములు జీవించాయి, గంగ నీరు చెడిపోయాయి. వేరే పాత్రలో ఉన్న జలంలో క్రిములను చేర్చగానే అవి మరణించాయి. ఉష్ణోగ్రత పెరగడం వలన గంగలో ఉండే బ్యాక్టీరియోఫేజ్ మరణించడమే ఇందుకు ఒక కారణం.
గంగకే కాదు అన్ని నదులు తమను తాము శుద్ధిచేసుకునే శక్తిని కలిగి ఉంటాయి. అవి ఆక్సిజెన్ గ్రహించడం మొదలుకొని, తమలో కలిగిన సహజ వ్యర్ధాలను శుద్ధిచేసుకునే శక్తి కలిగి ఉంటాయి. 1896లో హానికిన్ జరిపిన పరిశోధనలో గంగతో పాటు యమున కూడా ఇటువంటి శక్తులను కలిగిఉందని తేలింది. కాని యమునతో పోల్చినప్పుడు గంగ 10 నుంచి 20 రెట్ల వేగంగా క్రిములను నాశనం చేయగలదు.
గంగకున్న అనేక ప్రత్యేకతలను గుర్తించాడు కనుకే అక్బర్ చక్రవర్తి నిత్యం గంగాజలాన్ని మాత్రమే తెప్పించుకుని త్రాగేవాడు. గంగా జలాన్ని "అమరత్వం ప్రసాదించే జలం " అని సంబోధించాడు.
బ్రిటిషర్లు భారత్ నుంచి ఓడలో ఇంగ్లాండు ప్రయాణించే సమయంలో గంగా జలాన్నే తీసుకెళ్ళేవారు. గంగా నీరు చెడిపోవు. అందువల్ల వారి ఇంగ్లాండు వెళ్ళీ భారత్ తిరిగివచ్చేవరకు మన గంగ నీటినే త్రాగేవారు.
హిందువులు నదులను, చెట్లను, రాళ్ళను పూజిస్తారంటూ అనేక మంది విమర్శిస్తుంటారు. వారందరికి గంగ విశిష్టత తెలియజేసి వాళ్ళ కళ్ళు తెరిపించాలి. మనవి మూఢనమ్మకాలు కావు. కారణం లేకుండా మన పూర్వీకులు దేనిని పూజించమని చెప్పలేదు. మనకు తెలియనంత మాత్రాన వాటిని కొట్టిపారేయకండి

No comments:

Post a Comment