Wednesday, September 26, 2018

పవిత్ర త్రివేణి సంగమం ప్రయాగ

సనాతన ధర్మం/హిందుత్వం is with Sunny Yogi.
పవిత్ర త్రివేణి సంగమం ప్రయాగ:-
నదీ నగరికతకు పెట్టింది పేరు భారతదేశం."నది" అంటేనే భారతీయుల్లో ఒక గొప్ప భక్తిభావం ఉంది. అలాంటిది మూడు నదులు సంగమించే త్రివేణి సంగమానికి ఉండే పవిత్రత గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా వేల సంవత్సరాల చరిత్ర కలిగిన నగరాలు, అధ్యాత్మిక క్షేత్రాలలో అలాంటి విశిష్ట వేడుకలు వచ్చినప్పుడు ఇంక లక్షలాది మంది ఆనందానికి అవధులు ఉండవు. పరమ పవిత్రమైన ప్రయాగ పేరు చెబితే తనువు, మనసు పులకించిపో తాయి. ఉత్తమోత్తమ నదీమతల్లులైన గంగ, యమున, సరస్వతిలు కలిసే అక్కడి సంగమ ప్రదేశం భూతల స్వర్గం అనవచ్చు. సాధారణంగా "కుంభమేళ"అంటేనే 12 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. ఆ సమయంలో వారణాశి వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలలోని నదీతీర స్నానాల కోసం అశేషంగా జనం తరలి వెళుతుంటారు. ప్రతిరోజూ వేళ సంఖ్యలో దేశ,విదేశాల నుండి యాత్రికులు పుణ్యస్నానాలకు వస్తుంటారు. వారిలో మామూలు పర్యాటకుల నుండి మొదలుకొని యోగులు, సాధువులు వంటి వారంతా ఉన్నారు. దాని మధ్యలోనే ఆరేళ్ళ కాలానికి వచ్చే సమయాన్ని "అర్థకుంభమేళ"గా పిలుస్తున్నారు.
వేల సంవత్సరాల చరిత్ర గల అలహాబాద్ నగరాన్నే"ప్రయాగ"గా పిలుస్తున్నారు. దేశంలోని ప్రధాన నదులైన గంగ, యమునలు ఇక్కడ ఒకటిగా కలుస్తాయి. ఇక్కడే అంతర్లీనంగా సరస్వతీ నది కూడా వచ్చి కలుస్తునదని వేలాది సంవత్సరాలుగా ప్రజలు నమ్ముతున్నారు. కనుకే ప్రతి పన్నేండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ త్రివేణి సంగమంలో "కుంభమేళ" ఉత్సవాలను జరపడం ఆనవాయితీగా మారింది. ఈ త్రివేణి సంగమంలో స్నానం చేయడం ద్వారా మానవులకు అంత్యంలో పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయన్న ప్రగాఢ నమ్మకం హిందువులలో ఉంది.

అటు ఆధ్యాత్మిక స్ఫూర్తి - ఇటు చారిత్రక సంపద
ప్రయాగలో ఆధ్యాత్మిక స్ఫూర్తితోపాటు వేల సంవత్సరాల విశేష చరిత్ర సంపద కూడా ఉంది. సంవత్సరం పొడుగునా యాత్రికులు ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. ,రామాయణ కాలం నాటి భరద్వాజ మహర్షికి చెందిన ఆశ్రమంగా చెప్పే చోటనే "అలహాబాద్ విశ్వ విధ్యాలయం" నెలకొంది.

No comments:

Post a Comment