Thursday, September 27, 2018

అణురేణు పరిపూర్ణమైన రూపము ...!

ఒక మిత్రుని ప్రశ్న ::: ఎందుకు ఆ తిరుగిరులపై తిరుగాడే శ్రీనివాసుడంటే కొందరికి వర్ణించనలవి కాని వ్యామోహం..? ఇంతకి ఎమిటా గహనమైన భక్త సులభుడి "గోవింద" తత్వ రహస్యం ?
ఒక చిరు సమాధాన ప్రయత్నం :::
1. శ్రీవేంకట నగము పై తిరుగాడే ఆ తోయజాక్షుని తత్వం , నిత్యం పరితపించే తాపసులకు సైతం అందని మహోన్నతత్వమా ? అంటే
--> మధురభక్తికి కరతలామలకమైన కమనీయ కృష్ణకరకలిత నవనీతం...!
2. శైవమా ? వైష్ణవమా ? శాక్తేయమా ? గాణాపత్యమా ? కౌమారమా ? సౌరమా ? అంటే
--> వీటన్నిటికి మూలభూతమైన, మూలాధారమైన ఆదిమూలం ఈ గోవిందం...!
3. అద్వైత - సోహమా ? ద్వైత - దాసోహమా ? ఏది దరిచేర్చు దారి అంటే
--> విశిష్ఠాద్వైత దాసదాసోహం..!
4. జపమా ? తపమా ? ధ్యానమా? యోగమా ? ఏది ఉపకరణం అంటే
--> సామవేద సారం...గోవింద నామసంకీర్తనం...!
5. పృథివి ? ఆపహ ? తేజహ ? వాయు ? ఆకాశ ? ఏది తత్వం అంటే
--> వీటన్నిటిని సృజించి స్థిరీకరించి లయించే పరతత్వం ...!
6. ఏమా రూపం అంటే ?
--> నిగమాలకు అందని, ఆగమాలాకు చెందని విశాల వక్షస్థల వరదకటిహస్త శోభితం..శ్రీవత్స చిహ్న భూషితం...!
7. ఏది తరుణోపాయం ?
--> భవరుద్రశుకశౌనకవ్యాసాంబరీషనారదసమీరజసనకసనందనాదుల హృత్పంకజార్చితం ,
దేవ దానవ గరుడ రాక్షస యక్ష కిన్నెర కింపురుష విద్యాధర గంధర్వాది గణములు సదా సేవించెడి శ్రీతులసీ పూరిత శ్రీనివాస శ్రీపాదద్వయం...!! 
YOUTUBE.COM

No comments:

Post a Comment