బ్రహ్మశ్రీ చాగంటి సద్గురువుగారి
' శ్రీమద్రామాయణం - మానవీయ సంబంధాలు ' అనే లఘు ప్రవచనా కార్యక్రమం, శాక్తేయ ప్రాధాన్యతగల ఈ ఆశ్వీయుజ మాసంలో ( కృష్ణపక్ష దశమి / అటు ద్రావిడసాంప్రదాయపరంగా పరమపవిత్ర పెరటాసి మాసపు ఆఖరి శనివారం కూడాను.... ) భాగ్యనగర చుట్టుప్రక్కల ప్రాంతాలన్నిటికి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహదాయకంగా వర్ధిల్లి, పురమునకు హితములు వర్షించే మహాపురుషులరాక హర్షదాయకంగా వర్షాలు కూడా కురిపిస్తుందన్నట్టు....

గురువుగారి దర్శనానంతరం ఇంటికి తిరుగుముఖం పట్టిన నేను జడివాన ధారల్లో తడిసిపోయి....
గురువాగ్ధారలకు మనసంతా చల్లగా...హాయిగా....ఆనందంగా... వర్షపునీటిధారలకు బాహ్యవాతావరణమంతా అలాగే చల్లగా...హాయిగా....ఆనందంగా... అయిన వేళావిశేషాలు....
గురువాగ్ధారలకు మనసంతా చల్లగా...హాయిగా....ఆనందంగా... వర్షపునీటిధారలకు బాహ్యవాతావరణమంతా అలాగే చల్లగా...హాయిగా....ఆనందంగా... అయిన వేళావిశేషాలు....
"ఏం బాబు నీకేం పనీపాటా ఉండదా...ఉ అంటే శ్రీ చాగంటి గురువుగారి ప్రవచనాల వైభవం గురించి, ఆ అంటే గోవిందుని గొప్పదనం గురించి ఏదో నీ మట్టిబుర్రకు తోచిందల్లా అలా రాస్తూంటావు....ఏదో సైడ్ బిసినెస్ లా ముఖపుస్తక ఆధ్యాత్మిక యాడ్ ఏజెన్సి పెట్టుకున్నట్టుగా ఉంది నీవాలకం... " అని అనుకునే వారుండొచ్చు... 
కాని, ఒక 7 / 8 సంవత్సరాల క్రితం ' మామూలుగా ' దారివెంట పోతున్న నాకు అలాంటి ఒక అడ్వర్టయిస్మెంట్ / ఫ్లెక్సి / ఎవరో పుణ్యాత్ముని వ్రాత వల్ల, శ్రీ చాగంటి గురువుగారు అనేవారు ఒకరు ఉన్నారని, రోజు మనం దండం పెట్టుకునే దేవుడిగురించి కొన్ని మంచి విషయాలు ఫ్రీ గా చెప్తుంటారని, విన్న వారి జీవితాల్లో ఎంతెంతో మంచి జరుగుతుందని.... అది చూసి / చదివి , అలా వారి ప్రవచాలను ' టైంపాస్ ' కోసమని వినడం మొదలైన నా జీవితంలో... క్రమక్రమంగా అవి కలిగించిన దురితదూరాన్ని / శుభసంచయాన్ని....
తీవ్రకష్టాలను అవతలకు ఈడ్చివేసి రక్షణకలిగించిన వైనం,
ఎన్నో విచిత్ర వేదనలమధ్య 21 మిసిమి ప్రాయంలో ఉద్యోగపు జీవితాన్నారంభించినపర్యంతం, అన్నిసమయాల్లో వీలైనంత సమ్యమనం పాటించి నా జీవితపుబండిని ఆటుపోట్ల మధ్యన సరిగ్గా నడిపించుకోగలిగే శక్తి యుక్తులను అనుగ్రహించిన భగవద్ ప్రసాదములై, ఇప్పటి నేను గా ఉన్న నన్ను నిలిపిన విధంగా, మరెవరికైనా అవి అలా ఉపకరించి / సహకరించి తోడుగా అవుతాయి అని తప్ప, మరేదో కాదు...

మనకు ఏదైనా విషయంవల్ల మంచి జరిగితే అది నలుగురితో పంచుకొని, ఇతరులకు కూడా మంచి జరిగేలా చేయడం కూడా ఒక మంచి పనే అన్నట్టు....ఈ నా వ్రాతలు...కూతలు.....కూడా అంతే....
ఏవరి పిచ్చి వారిది...ఏవరి ఆనందం వారిది.....ఏవరి గోల వారిది...ఏవరి ఆకలి వారిది...ఏవరి మోక్షం వారిది.....! 
గురువుగారి అమూల్య ప్రవచనా తోటలో ( www.srichaganti.net ) లభ్యమయ్యే , 'SriVenkateswaraVaibhavam.pdf' లోని వేంకటాచల స్తుతితో , గురువుగారు ప్రసాదించిన సంకల్ప పఠన సహాయంతో , మొన్న స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వామిపుష్కరిణి లో 3 మునకలు వేసి మూడు కోరికలు అడిగా స్వామిని.... 
1. మళ్ళీ వచ్చే ఆషాఢం వరకు వేచిఉండకుండా ఎక్కడైనా ఒకసారి గురువుగారి సందర్శనాభాగ్యం...
( తొందరగానే తీర్చాడు తుంటరి గోపాలుడు ...! )
( తొందరగానే తీర్చాడు తుంటరి గోపాలుడు ...! )
2. నేను గత కొంత కాలంగా, స్వామి అనుగ్రహంగా నా జీవితంలోకి వచ్చిన ఒకరి నుండి ఎదురు చూస్తున్న హార్దిక ఆర్ధిక సహాయం...
( ధనమగ్నిర్ధనంవాయుర్ధనంసూర్యోధనం వసుః
ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే
ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే
ఈ కలియుగంలో ధనమూలం ఇదం జగత్ కదా... తప్పదు మరి...
)
3. అమ్మ, నాన్న, తమ్ముడు అనే మూడు జీవితకాల అనుబంధాలకు తోడుగా, కొత్త బంధుత్వాలకు, చతుర్థ పురుషార్ధప్రదానికి కావలసిన ఆ నాలుగో బంధం కూడా అనుగ్రహించు అని.... 
( అది బంధనం కాకుండా ఉండేలాచూడు అనే క్లాజ్ తో..
)
( అది బంధనం కాకుండా ఉండేలాచూడు అనే క్లాజ్ తో..
అలనాటి ఆదిశంకరుల వోలే, అహరహం శ్రమించి తర తరాలకు సరిపడా ప్రవచనా పెన్నిధిని సృజించి,
ఇంకా ఎందరో జీవుల ఇహ/పర యాత్రలో ఆ ప్రవచనా పండ్లతోట లోని మధురసఫలాలు ఆకలితీర్చుతూ, ఆ ప్రవచనాల పూతోట లోని దేవపారిజాతాలు దశదిశలా చిరకాల సౌరభాలను వెదజల్లుతూ, శ్రీశైల భ్రమరాంబికా అనుగ్రహంగా గురువుగారి బ్రహ్మవిద్య, ఎందరెందరో శిష్యులను భ్రమర కీటక న్యాయంతో బ్రహ్మవేత్తలుగా మలచి సదా అనుగ్రహిస్తూ ఉండాలని ఆకాంక్షిస్తూ....

బాగా కాసిన మామిడిపండ్ల బరువుతో ఒక పెద్ద మామిడిచెట్టు క్రిందికి వంగి, తీసుకొండి ఈ మధుర ఫలాలు అన్నీ మీకే, అని చెప్పినట్టుగా....
భువిపై నడయాడే నిలువెత్తు నిటలాక్ష స్వరూపులై ఉండి కూడా, అవతలి వారి నమస్కరానికి ప్రతినమస్కారం, ఈ దేశంలోని ఎంతో గొప్ప సంస్కారం అనడానికి సూచకంగా ఉన్నది అన్నట్టుగా, నా కెమెరా క్లిక్ కి లభించిన ఒక చిత్తాంకితమైన గురువుగారి చిత్తరువు...

-ఆస్మద్ గురుపాదపద్మములచెంత ఒక చిరు ఏకలవ్య శిష్యుడి ఆనందాశ్రుపూరిత సవినయాక్షర సుమాంజలులు....! 
( ఆనందం వరకు బాగానే ఉంది కాని, ఆ అశ్రువులెందుకు అంటే, కొందరి అమూల్య పరోక్ష సహాయానికి ప్రత్యక్షంగా ఏమి సమర్పించుకోలేని నాడు, అలా అంతర్లీనంగా ఉండే గౌరవం అప్పుడప్పుడూ, నమస్కారాలను కాసేపు పక్కకు పెట్టి, నయనధారలుగా నగుమోముపై చిరునవ్వులు విరబూయిస్తుంది...అది కేవలం మనకు మరియు గోవిందుడికి మాత్రమే తెలిసే విషయం...లోగుట్టు పెరుమాళ్ళకెరుక అని కదా ఆర్యోక్తి..!
)

No comments:
Post a Comment