అందరికి అన్నమయ్య 609వ జయంతి శుభాభినందనలు...!!!
శ్రీవైష్ణవ తత్వ సారమంతా సరస సంకీర్తనల్లోకి, నిగూఢ యతిప్రాసాలంకారమయమైన సరల పదకవితలతో ఒలికించి, పండిత పామర భేదం లేకుండా త్రికరణశుద్దితో పాడినవారికి, విన్నవారికి సద్యోఫలితంగా చతుర్విధ పురుషార్ధాలను ప్రసాదిస్తూ, ఈ కలియుగం లో సైతం దేవున్ని
' రామచంద్రుడితడు రఘువీరుడు.... కలడన్న వారిపాలి కన్నులెదుటి మూరితి...వెలయ శ్రీవేంకటాద్రివిభుడీతడు..."
అంటూ పరిచయం చేస్తూ, దేవుడు ఎక్కడో వైకుంఠాది పరలోక ప్రాకారాల్లో మాత్రమే కాదు , ప్రత్యక్ష శ్రీ వేంకటనాధునిగా తిరుసప్తగిరుల్లో తిరుగాడుతున్న
'కామధేను విదే కల్పవృక్ష మిదే, ప్రామాణ్యముగలప్రపన్నులకు..'
అంటూ, మన ఆధ్యాత్మిక గతి గమ్య గమనాలను సువ్యవస్థీకరిస్తూ , సంకీర్తనలతో కమలా విభుని కరుణను కరతల అమలకము చేసిన సాక్షాత్ హరి కరవాల స్వరూపులు, అన్నమాచార్యులు...!
" విందువలే మాకును శ్రీవేంకటనాధుని ఇచ్చే...అందరిలో తాళ్ళపాక అన్నమయ్య...!!! " 

No comments:
Post a Comment