Tuesday, September 25, 2018

కొలిచినవారల కొంగుపైడి ఇతడు......! బలిమితారక బ్రహ్మమీతడు.....!! :)

ఓ శ్రీ వేంకటశైల వల్లభ....
సప్తాచల సార్వభౌమ....
కరిరాజ వరద...
కోనేటి ధామ...
కోదండ రామ...
నామాల స్వామి...
నియమాల స్వామి....!
సాటిలేనిది నీ భాగవతులు ఒనరించు సహాయము...ధీటైనది నీ ఆర్తత్రానపరాయణత్వము...మహామహిమోపేతమైనది నీ నామసంకీర్తనా వైభవము..!!
గురువాక్యమ్మును మదినమ్మి గొలిచిన, మాధవుడు మనవాడవును....శ్రీ వైష్ణవాచార్యులచే అనుసంధింపబడిన స్తోత్రంతో నిను స్తుతియించిన దాసకోటికిని, సకలము అర్పింతువు...
'ఎందెందువెదకి జూచిన అందందే గలడ్' అని పోతనామాత్యులు నుడివినా....
'కలడు కలడితని కనిమనరో' అని ఆన్నమార్యుల పదకవితల పూదోటలు పరిమళాలు వెదజల్లినా.....
అవన్నీ నీ దాసకోటి మైమరచి రంగరించిన శ్రీహరి వైభవవర్ణనలో, శ్రీపతి లోకసారంగ స్తవములో, అని మాత్రమే కాకుండా, అవి జగజ్జాలములన్నిటిలో సాటిలేని మేటైన నీ శ్రీచరణయుగలంబును దరిజేర్చు దారులుగా భావించి సేవించిన నాడు.....
స్వామి దేహి..!, అని అర్ధిస్తే, ఆకలి తీర్చే మాధవకబలం ప్రసాదిస్తావనుకుంటే.... అక్షయపాత్రే ఇచ్చెస్తావు....!
అలనాడు తొండమాన్ చక్రవర్తికి ఏకంగా శంఖచక్రాలే ఇచ్చినవాడివి.... కడు దుర్లభమైన, ధర్మరాజు లాంటి ఉద్దండులకు మాత్రమే సాధ్యమైన సశరీర ఉన్నతలోకప్రాప్తిని, నువ్వే సర్వస్వమని మట్టితులసిదళాలు ప్రేమతో సమర్పించిన కుమ్మరి భీమునికి ఇచ్చినవాడివి, పరిమళాల విరిదండ ఇచ్హాడని నీ మామ కంసుని రాజ్యంలోని మాలాకారున్ని మహదైశ్వర్యవంతునిగా చేసినవాడివి, నీ మేని సౌరభానికి ఏదో తక్కువైనట్టు కొంచెం గంధం పూసిన కుబ్జని, అతిలోక సుందరిగా మార్చినాడివి, చిన్ననాటి గురుకుల స్నేహితుడైన సుదాముని / కుచేలుని గుప్పెడు అటుకులకు అపర కుబేరునిగా మార్చినవాడివి, ఇలా నీ కళ్యాణగుణాలను వర్ణించడం, నారద శుకయోగీంద్రులకే చెల్లు....
ఒక నమస్కారానికే గురువులు / ఆచార్యులు, శిష్యులను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దే వైనానికి నయనాలు నయగరా జలపాతములా ఆపలేని ఆనందాశ్రువులు దొరల్చిననాడు, జిహ్వ అప్రయత్నంగా అందుకొనే ఆన్నమార్యుల సంకీర్తన.....
కొలిచినవారల కొంగుపైడి ఇతడు......! బలిమితారక బ్రహ్మమీతడు.....!! 
ANNAMACHARYA-LYRIC

No comments:

Post a Comment