అమ్మవారికి సమర్పించే విశేష ప్రార్థన / భోజనం / నివేదనం ' అషాఢ బోనం ' .....!
"ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు ...........సరి నెన్నుదురు శాక్తేయులు శక్తిరూపునీవనుచు....."
బతుకమ్మ (బ్రతుకమ్మ) ఉత్సవాలు, బోనాలు, సమక్క సారలమ్మ జాతర, పైడితల్లి సిరిమానోత్సవం, తిరుపతి గంగమ్మ జాతర, నాగోబా జాతర..... ఇలా ఎన్నెన్నో, శాస్త్రగతం కానివి, నైసర్గిక ప్రాంతీయాచార వ్యవహారాలకు అనుగుణంగా జరుపబడేవి, వైదిక ప్రతిపత్తి లేనివి, జానపదశైలిలో జనజీవనాంతర్భాగంగా కొలువైన ఉత్సవాలు. ఇవి ఎందుకు, ఏమిటి, అనే వాటికంటే, వాటిలో ఉన్న అర్థపరమార్థములేమి అని తర్కించి, వాటివల్ల దైవానుగ్రహం పొంది కుటుంబం / గ్రామం / పట్నం / రాష్ట్రం / దేశం చల్లగా ఉండడానికి కావలసిన జ్ఞ్యానసముపార్జన అందరి విహిత కర్తవ్యం... 
బ్రహ్మశ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల మరియు ఇతర అధ్యాత్మ ధర్మసందేహ నివృత్తకుల / పెద్దల ద్వారా తెలుపబడిన సంగ్రహసారం...
తోలి ఏకాదశి / దేవ శయన ఏకాదశి / ఇత్యాది పేర్లతో పిలువబడే అషాఢ శుద్ధ ఏకాదశి తరువాత, అమేయ కాలచక్ర పగ్గాలను పక్కనపెట్టి శ్రీమన్నారాయణుడు యోగనిద్రలోకి జారుకొని, జీవుల జీవయాత్ర స్థితిగతులను / ప్రారబ్ధ ఆగామి లెక్కలను / అన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి, వారి వారి ప్రార్థనలకు అనుగుణంగా అనుగ్రహించవలసిన మార్గాలాను ఏర్పరిచే పనిలో ఉండగా... నారాయణి గా / యోగమాయ గా / ఉండే పరాశక్తి అయిన తన చెల్లెలు ఆ పగ్గాలను చేబూని, విశ్వాన్ని ప్రత్యక్షంగా శాసిస్తు సమ్రక్షిస్తూ ఉండే కాలం ఈ దక్షిణాయణపుణ్యకాలం.....
ఇటు లౌకికంగా వర్షాలు, చీకట్లు, రోగాలు, పెరిగి జనజీవనాన్ని కొంత ఇబ్బందిగా చేసే కాలం ఈ ఆషాఢశ్రావణభాద్రపదాశ్వీయుజాలు...
ఎదైనా ఒక కొత్త మార్పు చెందినప్పుడు దాన్ని స్థిరీకరించడం / శాంతపరచడం / స్థిమితపరచడం / అత్యంత ఆవశ్యకం.
( Stabilization of / Smooth transition for / propitiating /
a new entity అన్నమాట... ). అప్పుడే నిద్రలేచిన ఒక పెద్ద అధికారి దెగ్గరికి వెళ్ళి, ఇది చేసిపెట్టండి అది చేసిపెట్టండని చిరాకుపెట్టడంకంటే, వాళ్ళు కాస్త స్థిమితంపొంది అల్పాహారం / పానీయాలు / అన్ని అయ్యాక అర్జీలు చేయడం సరి...
అదేవిధంగా, ప్రత్యక్షంగా అధినేత్రి గా కొలువయ్యుండే అమ్మవారికి వివిధ రూపాల్లో విశేషంగా భోజనం సమర్పించి శాంతింపచేయడం అంటే, అందులోని పరమార్థం, మనకు కలగబోయే రోగాలను / ఇక్కట్లను / కష్టనష్టాలను ఈ ప్రార్థనాపూర్వక నివేదన రూపంలో స్వీకరించి మన జీవ యాత్రను సులభతరమయ్యేలా అనుగ్రహించమని వేడుకోవడమే...

ఆషాఢ శక్తిగా మేల్కొని, శ్రావణ లక్ష్మిగా, భాద్రపద గణపతిగా, ఆశ్వీయుజ దుర్గగా, కార్తీక శివసుబ్రహ్మణ్యులుగా, తన పాలననుసాగించి కార్తీక శుక్ల ఏకాదశి / దేవ ఉత్థాన ఏకాదశి కి తిరిగి శ్రీమన్నారాయణుడికి కాలచక్రపుపగ్గాలను అప్పగించి, అంతర్లీనంగా అణువణువులోకి ఒదిగిపోయే పరాశక్తి ప్రహేళిక ఈ చాతుర్మాస్య కాలగీతిక..!
ఎండాకాలంలో కూల్ కాటన్స్, వర్షాకాలంలో వాటర్ ప్రూఫ్ వేర్, చలికాలంలో వులెన్ వేర్, వేసుకున్నా అందులో ఉన్నది మనమే అన్నట్టుగా, ఏ రూపం లో ఏ నామం లో ఆ పరబ్రహ్మాన్ని ఆరాధించినా అన్నీ ఒకే పరతత్వానికి చెంది అనుగ్రహిస్తాయి.అందుకే అన్నమచార్యులు ఆ తిరువేంకటనగముపై కొలువైన పరతత్వాన్ని పలువిధాలుగ భక్తులు ఆరాధిస్తారు అని, తమ "ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు ..." అనే కృతిలో " సరి నెన్నుదురు శాక్తేయులు శక్తిరూపునీవనుచు..." అంటూ కీర్తించి, మరో కృతిలో "దిక్కు నీవే జీవులకు దేవ సిమ్హమా...." అంటూ ఆ శ్రీనివాస పరదైవాన్ని కొనియాడారు...! 
https://www.facebook.com/Vinay.Aitha/posts/10215016304974422

No comments:
Post a Comment