ఒక విద్యుత్ ఉత్పాదకకేంద్రం నుండి విడుదలయ్యే విద్యుత్తు సక్రమంగా సుదూరప్రాంత ప్రజలకు సైతం అంది వారి ఇళ్ళను దేదీప్యమానంగా చేయాలంటే, ఎన్నెన్నో ఫీడర్లతో ( Feeder ), స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ లతో ( Step Down Transformers ), అనుసంధానింపబడిఉండే ఒక కట్టుదిట్టమైన సరఫరా వ్యవస్థ అత్యంతావశ్యకం..! లేనిచో ఉత్పత్తిచెందిన అధికశాతం విద్యుత్తు లీకేజ్ లో వ్యర్ధమైపోయి ఎవరికి అందకుండా పోతుంది... సాంకేతిక పరిభాషలో దీన్నే ' ట్రాన్స్మిషన్ లాస్ ' ( Transmission Loss ) అని వ్యవహరిస్తారు...
చాల మంది అసలు ఆ విద్యుత్తు ఉత్పాదకకేంద్రంలో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో పట్టించుకోరు. మన ఇంటికి కరెంట్ / సరిపడా వోల్టేజ్ ఉండి, అన్ని విద్యుత్ చోదక వస్తువులు బాగా పనిచేస్తున్నాయా లేదా అని మాత్రమే చూసుకుంటాం... అది సర్వసామన్యం అనుకోండి....
అక్కడ జరిగే పనిగురించి, అక్కడి విద్యుత్ అధికారులు మరియు ఇతర సిబ్బంది చూసుకుంటారు అని సరిపెట్టుకుంటాం. కాని అక్కడ ఏమైనా ఇబ్బంది జరిగి సరఫరా నిలిచిపోతే, ఊరంతా లబోదిబో మంటుంది.
అక్కడ జరిగే పనిగురించి, అక్కడి విద్యుత్ అధికారులు మరియు ఇతర సిబ్బంది చూసుకుంటారు అని సరిపెట్టుకుంటాం. కాని అక్కడ ఏమైనా ఇబ్బంది జరిగి సరఫరా నిలిచిపోతే, ఊరంతా లబోదిబో మంటుంది.
అక్కడి అధికారులు, పరిసరాలు, పరికరాలు సక్రమంగా ఉండి నిరంతరం సరిగ్గా పనిచేసేలా చూడడం ప్రభుత్వ పెద్దల బాధ్యతగా భావిస్తాం....
సరిగ్గా అదేవిధంగా....,
స్వయంభు మరియు ఇతర ఋషి, ముని, మానవ ప్రతిష్ఠిత ఆలయాలు, అమేయ దైవశక్తి కేంద్రాలు. అక్కడ జరిగిన అత్యంత సశాస్త్రీయ సవైదిక క్రతువుల్లో భాగంగా కొలువైన దైవానుగ్రహం నిరంతరం భక్తజనానికి అంది వారి జీవితాలను అన్నివిధాలా ఉజ్జ్వలంగా తీర్చి దిద్దడానికి అత్యంతావశ్యకమైనదే " ఆలయ ఆగమ వ్యవస్థ ". మనకు వాటిగురించి పెద్దగా తెలియకపోయినా, కేవలం నమస్కరించి మనం / మన కుటుంబం / సన్నిహితులు క్షేమంగా ఉండాలని భావిస్తాం. కాని తత్శాస్త్ర సంబంధ పెద్దలకు, ఆచార్యులకు, సత్బ్రాహ్మనోత్తములకు, పీఠాధిపతులకు, స్థపతులకు, ఆయా విషయాలపై క్షుణ్ణంగా అవగాహన ఉండి, ఇది ఇలా చేయడం ఉత్తమం, అది అలా చేయడం ఉత్తమం, అని వారు చెప్తున్నప్పుడు, మీడియా లో కొందరు ప్రతినిధులు అరకొర జ్ఞ్యానం తో వారి దెగ్గరికి వెళ్ళి, " ఎందుకు ఇంత ప్రజా ధనం వ్యర్ధం చేయిస్తునారు...లైట్ గా కానిస్తే సరిపోదా..మేము ఎందుకు లోపల జరిగే దైవ క్రతువులను లైవ్ లో చూడొద్దు...ఇలా సరిపెట్టుకుంటే మీ ఆగమం ఒప్పుకోదా...దేవుడు వచ్చి తనకు వాస్తు పరంగా, శాస్త్ర పరంగా ఆలయాలు కట్టమని చెప్పాడా..." మొదలైన తెంపరి వెర్రి ప్రశ్నలు వేస్తుంటే నవ్వాలో, బాధపడాలో అర్ధం కాని సందర్భాలు అవి....
కనిపించని విద్యుత్తు, ఆ లౌకికమైన విద్యుతుత్పాదక కేంద్ర వ్యవస్థకు ఎంత గౌరవం ఇచ్చి వాటిని జాగ్రత్తగా సమ్రక్షించుకుంటామో,
కనిపించని దైవత్వం, ఆ అలౌకిక దైవిక కేంద్రాలైన ఆలయాల (ఆగమాల), మందిరాల, వ్యవస్థకు కూడా అంతే గౌరవం ఇచ్చి వాటిని జాగ్రత్తగా సమ్రక్షించుకోవడం అందరి విహిత ధర్మం..!
కనిపించని దైవత్వం, ఆ అలౌకిక దైవిక కేంద్రాలైన ఆలయాల (ఆగమాల), మందిరాల, వ్యవస్థకు కూడా అంతే గౌరవం ఇచ్చి వాటిని జాగ్రత్తగా సమ్రక్షించుకోవడం అందరి విహిత ధర్మం..!
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి పర్యవేక్షణలో, అత్యంత వైభవోపేతంగా పాంచరాత్ర విష్ణ్వాగమ బద్దంగా, సరికొత్త రూపురేఖలతో తీర్చిదిద్దబడిన తన ఆలయంలో, ఇక శ్రీ యాదగిరి లక్ష్మీనృసిమ్హుడు తన దివ్య ప్రతాపాన్ని పుంజుకొని, అప్రతిహతంగా నమ్మి కొలిచిన వారి కష్టాలను శరవేగంగా చీల్చి చెండాడి, శుభములను అనుగ్రహించడానికి సిద్దమవుతున్నాడన్నమాట...
మన ఇంట్లో ఉన్న పూల చెట్టుకు కావలసిన క్షేత్ర కనీస అవసరాల్ని (అంటే మంచి మట్టి, నీరు, ఎరువు, అలా ) అన్నీ సవ్యంగా అందించినప్పుడు అది ఎన్నెన్నో పూవులను మనకు అందిస్తుందనడం ఎంత ఖచ్చితమో......
ఒక దేవాలయానికి తగురీతిలో ఆగమ బద్దంగా కావలసిన క్షేత్ర కనీస అవసరాలన్నీ సవ్యంగా అందించినప్పుడు, అందు కొలువైన దైవం ఎనలేని తేజోమహిమ్నావిరాజితుడై ఉండడం అంత ఖచ్చితం...!!! 
అన్నమాచార్యుల వారు, శ్రీవేంకటపరదైవాన్ని శ్రీవేంకటనారసిమ్హంగా అభివర్ణిస్తూ స్వామి వారి ఉగ్ర ఉత్తుంగతరంగ శౌర్యానికి ప్రతీకగా ఉండేలా ఈ క్రింది కీర్తన రచించారు...!
ప|| భాలనేత్రానల ప్రబల విద్యుల్లతా | కేళీ విహార లక్ష్మీనారసింహా ||
చ|| ప్రళయమారుత ఘొర భస్త్రీకాపూత్కార | లలిత నిశ్వాసడోలా రచనయా |
కూలశైలకుంభినీ కుముదహిత రవిగగన- | చలన విధినిపుణ నిశ్చల నారసింహా ||
చ|| వివరఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూత- | లవదివ్య పరుష లాలాఘటనయా |
వివిధ జంతు వ్రాతభువన మగ్నౌకరణ | నవనవప్రియ గుణార్ణవ నారసింహా ||
చ|| దారుణోజ్జ్వల ధగద్ధగిత దంష్ట్రానల వి- | కార స్ఫులింగ సంగక్రీడయా |
వైరిదానవ ఘోరవంశ భస్మీకరణ- | కారణ ప్రకట వేంకట నారసింహా ||

https://www.facebook.com/Vinay.Aitha/posts/10215073609887009
No comments:
Post a Comment