Tuesday, September 25, 2018

కంచిస్వామి (నడిచే దేవుడు) చిదంబరంలోని కుంచితపాదం...!

Vinay Kumar Aitha shared a post.
6 May
Apara Kaamakshi Swarupula durlabhamaina chitram.....Kanchi - Chidambaram kalagalisinavela.....🙂
Jaya Jaya Shankara...Hara Hara Shankara..... 🙏
Patanjali Tadepalli
అద్భుతమ్.. (05-05-2018)
Really blessed with the rare photograph of Mahaperiyava (నడిచేదేవుడు, కంచి స్వామి) adoring the sacred kunjithapadam from Sri Nataraja Temple Chidambaram.
తన 97 ఏళ్ళ వయస్సులో ఒకనాటి రాత్రి కంచిస్వామి (నడిచే దేవుడు) చిదంబరంలోని కుంచిత పాదాన్ని శిరస్సు మీద పెట్టుకోవాలనే కోరిక వెలిబుచ్చారట. ఆశ్రమం వారికి ఏమీ తోచలేదు. స్వామి కంచి నుండి చిదంబరంకు మోటారు వాహనం మీద వెళ్లరు. నడిచయినా వెళ్లాలి. లేదా పల్లకీలో తీసుకువెళ్లాలి. పల్లకీలో అయినా కుదుపులకు వారిశరీరం ఓర్చుకోదని శిష్యులు బెంగపడసాగారు.
తెల్లవారు జామున ఒక వింత జరిగింది. చిదంబరం దేవాలయం నుంచి కొందరు వ్యక్తులు వచ్చారు. చిదంబరంలోని నటరాజ స్వామి కుంచిత పాదాన్ని మహా స్వామి వారికి ఇవ్వాలని వచ్చామని చెప్పారు.
చిదంబర నటరాజ స్వామి పాదాలకు చుట్టిన హారాన్ని కుంచితపాదంగా చెబుతారు.
ఆ కుంచిత పాదాన్ని కంచిస్వామి(నడిచేదేవుడు) ఆనందంతో శిరస్సు మీద ధరించారు.
కుంచిత పాదాన్ని నడిచేదేవుడు శిరస్సు మీద ధరించిన ఫొటో చాలా మహిమాన్వితమని, అది ఇంట్లో ఉంటే చాలా శుభాలు జరుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.
( మిత్రులు శ్రీ వెంకటేశ్వర్లుగారు కుంచితపాదము గురించి వివరించమని కోరినప్పుడు ఈ ఫొటో అనుగ్రహాన్ని స్వామి అనుగ్రహించారు.
కుంచితాంఘ్రి స్తవం 300 శ్లొకాలు. కుంచితపాదుడు అంటే భక్తుల అశుభాల వంకరలు పోగొట్టే పాదం కలవాడు అని అర్థం)
ఫొటో .అంతర్జాల సౌజన్యం

No comments:

Post a Comment