కలియుగ ప్రత్యక్ష దైవం... పరమపావన స్వామిపుష్కరిణితీర స్థిత, శ్రీవత్స భూషిత వక్షోవిరాజిత శ్రీభూ సమేత వేంకటేశ్వర స్వామి మూలవర్ దర్శనం...!!!
స్వామి అనుగ్రహంపొందిన వారెల్లరికి అదొక శాశ్వత మధురాతిమధురానుభవం... ఆవు గ్రాసాన్ని ఆబగా ఆరగించి, తరువాత తీరిగ్గ కూర్చొని లాగి ఉండలుకట్టి నెమరువేసుకుంటూ మధుర క్షీరంగా మలచినచందంగా....
తలుక్కుమని తనువుస్థాణువయ్యెలా అతిలోక సుందర దరహాసంతో, భువన సమ్మొహన క్రీగంటి చూపులతో,
మాధవవశమైన మన మనసు తన స్వాధీనత కోల్పోయేలా, మరులుగొలిపించే ఆ ముకుందుని సమ్మోహన ఆపాద తలమస్తక దర్శనావైచిత్రి ఎంత అలోచించినా అంతుచిక్కని చక్కని చక్కెరపాకంలా లోన నిలిచిపోవడమే తప్ప.... అపరిమిత పదవర్ణనకుసైతం అందని అమరసల్లాపం ఆ ఆనందనిలయుని అమృతస్వరూప చిద్విలాసం...
మాధవవశమైన మన మనసు తన స్వాధీనత కోల్పోయేలా, మరులుగొలిపించే ఆ ముకుందుని సమ్మోహన ఆపాద తలమస్తక దర్శనావైచిత్రి ఎంత అలోచించినా అంతుచిక్కని చక్కని చక్కెరపాకంలా లోన నిలిచిపోవడమే తప్ప.... అపరిమిత పదవర్ణనకుసైతం అందని అమరసల్లాపం ఆ ఆనందనిలయుని అమృతస్వరూప చిద్విలాసం...
భోగులా, యోగులా, భువరాది ఊర్ధ్వలోకపు సిద్ద గంధర్వాది దివిజసమూహములా... ఎవ్వరైనా సరే, ఆ సజీవ సాలిగ్రామ ఆవేశిత విశ్వచైతన్యపు సాకార పరమాత్మను వర్ణించడం అసాధ్యం...
మాంసనేత్రద్వయానికి ఒక 9 అడుగుల సుందర స్వరూపంగా గోచరించే పరమాత్మ, సద్గురు పాదపద్మభక్తి తో కూడుకున్న తన శ్రీపాద శరణాగతిచే, సంస్కరించబడిన మన మనోస్థాయికనుగుణంగా, మరో నేత్రమైన మనో నేత్రాన్ని ప్రసాదించి, 'కందర్పదర్పహర సుందరదివ్యమూర్తే' అన్నచందంగా తన దివ్యమంగళస్వరూప సందర్శనా సౌభాగ్యాన్ని తానే కటాక్షించి, ఆచమనం చేసి ఆసీనులైన మరుక్షణం తన దర్శనంలోని ఆంతర్యాన్ని, మన బాధలను వాటికి కారణం అయిన ప్రారబ్ధ కర్మలను, తన నిర్హేతుక దయావిశేషం చేత వాటిని పరిమార్చే తన శైలిని, మనతో ఉంటూనే మనలను వంచించే వారిని, మనకు సుదూరంగా ఉంటూనే మనకు మంచి చేసే వారిని, మన తప్పొప్పులను, తడబాట్లను, యెడబాట్లను, ఒక్కటేమిటి సర్వం సహా....తన నీలమేనినే ఒక మాయాదర్పణంగా మలచి తాను పరచే ఆ దృశ్యకావ్యం సంభ్రమాశ్చర్యాల సమాహారం...!
అందుకే అనుకుంటా స్వామిని తన కణకణంలో కొలువయ్యేలా చేసుకున్న అన్నమాచార్యుల వారు, స్వామిని నిజంగానే ఒక " నీలదర్పణం " అంటూ కీర్తించారు....
" తలపోయ హరినీలదర్పణంబో ఇతడు వెలుగుచున్నాడు బహువిభవములతోడ
కలగుణం బటువలెనె కాబోలు లోకంబు గలదెల్ల వెలిలోన కనిపించుగాన...! "
కలగుణం బటువలెనె కాబోలు లోకంబు గలదెల్ల వెలిలోన కనిపించుగాన...! "
---గతవారం స్వామి కటాక్షించిన తన గురువార పూలంగిసేవ ప్రయుక్త నేత్ర దర్శనం, శుక్రవార అభిషేకానంతర నిజపాద దర్శనం, సర్వాలంకార విరాజిడై, దివ్యమణిపూరిత వరదకటిహస్త భూషణుడై వెలుగొందిన శనివార శేషశైల వల్లభుని స్మరిస్తూ, ఎనలేని నా స్వామి శ్రీపాదపద్మములచెంత వినయపూరిత ఒక చిరుకవన తులసీదళం... 

No comments:
Post a Comment