Tuesday, September 25, 2018

పోతనామాత్యుని ...భాగవత పద్యాలు !

Vinay Kumar Aitha shared a post.
19 January
"O ThiruVenkaTa SreeHari....Nee talapu, neepai valapea bhaagawatulaku jeevam jeevitam kadaa...." ani bhaavinchi sevinchinavaariki Hari Naamamu enno vidhaalugaa mana chuTTuundelaa cheasi mari anugrahistaadu.....
Sree Hari.....
Namminavaariki namminanta....
Kolichinavaariki kolichinanta...
Talachinavaariki Talachinanta.....😁
Vinjamuri Venkata Apparao
పోతనామాత్యుని ...భాగవత పద్యాలు !
.
అంబరీషుడు :
.
హరియని సంభావించును, హరి యని
దర్శించు, నంటు; నాఘ్రాణించున్;
హరి యని రుచి గొన దలచును,
హరిహరి!ఘను నంబరీషు నలవియె పొగడన్?
.
అంబరీషుడు” మాటలాడేముందు హరీ అని పలికేవాడు ,
హరి అన్న శబ్దం ఉచ్చరించాకే ఇతరులను చూచే వాడు ,
హరి అన్న తరవాతే ఇతరులను తాకే వాడు , వాసన
చూడాలన్నా , రుచి చుడాలన్నా మొదలు హరి నామం
ఉచ్చరించ వలసినదే . అటువంటి నిష్టాగరిష్టుడయిన
అంబరీషుని పొగడడానికి సాధ్యమా ” అంటాడు పోతన
. స్వామి సౌందర్య సందర్శనానుభూతిలో పొంగి
ప్రవహించిపోయేవాడే భక్తుడు . కాదంటారా ?
.
భక్తులందరికీ ఈ పృవృత్తి సహజం .
పోతన అయినా , విదురుడైనా , అంబరీషుడైనా , ప్రహ్లాదకుమారుడైనా — తనువూ , తలపూ , తపస్సూ అంతా భగవంతుని మీదే . అటువంటి భక్తి లభించడం ఒక సౌభాగ్యం . దానికి కూడా ఆ పరమాత్ముని అనుగ్రహం ఉండాలి మరి .
అంబరీషుని కథ అందరికీ తెలిసిందే కదా .
సుదర్శన చక్రం ఆతనికి ఏవిధమైన ఆపదా రాకుండా కాపాడింది
తన భక్తులను రక్షించుకోవడానికి పరమాత్మ సర్వదా
సన్నిధ్ధంగా ఉంటాడు.

No comments:

Post a Comment