" భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు,
శూలికైనఁ దమ్మిచూలికైన,
విబుధజనుల వలన విన్నంత కన్నంత
దెలియ వచ్చినంత దేటపఱతు....! "
శూలికైనఁ దమ్మిచూలికైన,
విబుధజనుల వలన విన్నంత కన్నంత
దెలియ వచ్చినంత దేటపఱతు....! "
అని పోతనామాత్యులు ఎంత గొప్ప సంకల్పంతో, తెనుగుభాగవత గ్రంథరచనకు సంకల్పించారో, అంతే గొప్ప సంకల్పంతో, భాగవతులందరికి అంతర్జాల భాగవత పుటల ద్వారా, చీటికి మాటికి పుస్తకం తీస్తే ఎక్కడ పన్నలు నలిగిపోతాయొ, అంత పెద్ద పెద్ద పుస్తకాలు వెళ్ళిన ప్రతిచోటికి ఎలా మోసుకెల్లడం, పక్కవారు పుస్తకం తీసుకొని సరిగ్గా తిరిగివ్వరనో, మొదలైన ఇబ్బందులేవి లేకుండా, గ్రంథప్రతులకు బదులుగా మొత్తం భాగవత సరంజామా అంతా, ఒక మీట నొక్కగానే కళ్ళకు చెవులకు హాయికలిగిస్తూ ఎదుట ప్రత్యక్షమయ్యేలా, ప్రపంచం మొత్తానికి సౌలభ్యం కలిగించిన http://telugubhagavatam.org రూపకల్పన సభ్యులందరికి ఎంతో ఋణపడిఉంటుంది యావద్ ఆస్తికప్రజానీకం సర్వదా ...!
భాగవతం అనే ఒక రచన పై మక్కువ, మన యావద్ జీవితాన్ని భగవద్ కైంకర్యంగా మార్చేస్తుంది అని నేను నమ్మడానికి కారణం ఈ క్రింది, నాకు ఎంతో ఇష్టమైన సీస / ఆటవెలది పద్యాలు.... 
సీ. హరినామ కథన దావానలజ్వాలచేఁ;
గాలవే ఘోరాఘ కాననములు;
వైకుంఠదర్శన వాయు సంఘంబుచేఁ;
దొలఁగవే భవదుఃఖ తోయదములు;
కమలనాభధ్యాన కంఠీరవంబుచేఁ;
గూలవే సంతాప కుంజరములు;
నారాయణస్మరణప్రభాకరదీప్తిఁ;
దీఱవే షడ్వర్గ తిమిర తతులు;
గాలవే ఘోరాఘ కాననములు;
వైకుంఠదర్శన వాయు సంఘంబుచేఁ;
దొలఁగవే భవదుఃఖ తోయదములు;
కమలనాభధ్యాన కంఠీరవంబుచేఁ;
గూలవే సంతాప కుంజరములు;
నారాయణస్మరణప్రభాకరదీప్తిఁ;
దీఱవే షడ్వర్గ తిమిర తతులు;
ఆ. నలిన నయన భక్తినావచేఁ గాక సం
సారజలధి దాఁటి చనఁగ రాదు;
వేయునేల; మాకు విష్ణుప్రభావంబుఁ
దెలుపవయ్య సూత! ధీసమేత!
సారజలధి దాఁటి చనఁగ రాదు;
వేయునేల; మాకు విష్ణుప్రభావంబుఁ
దెలుపవయ్య సూత! ధీసమేత!

No comments:
Post a Comment