సరిగానము మీ చందములు... పరిపరి విధముల బ్రదుకరయ్యా.. 
శ్రీనివాస ప్రభు దయ... శ్రీ వేంకటేశ్వరానుగ్రహం... గోవిందుని భక్త వాత్సల్యం... తిరువేంకటకృష్ణుని శ్రీకరలీలావైభవం... ఇలా ఎవరికి తోచినట్టు వారు పేర్లు పెట్టేసుకోవచ్చు.... ఆ ఏడుకొండలపై మూర్తీభవించిన విశ్వచైతన్య సాకారమూర్తి యొక్క సౌజన్యాన్ని... 
స్వామి శ్రీపాద శరణాగతి చేసి జీవితాన్ని శ్రీవేంకటశైలవల్లభ దాస్య శ్రీకైంకర్యంగా, శ్రీవైష్ణవాచార్య సద్వాక్కులను / సద్గురుబోధలను ఆలంబనగా చేసుకుని సాగించే వారెల్లరు, సుదీర్ఘ జీవయాత్రలోని చిన్న భాగమైన ఈ జీవనయాత్రయొక్క ప్రతి మలుపునందు ఆ మాధవుని ముద్ర ప్రస్ఫుటంగా దర్శించగలరు....
ఎక్కడో సముద్రం దెగ్గర తయారైన కారుమబ్బులు అలా గాలి వాటానికి ముందుకుసాగి మన ఇంటిపైనుండి వెళ్తూ వెళ్తూ తన చల్లని తీయని నీరంతా వెదజల్లి మనకు ఆహ్లాదం పంచినట్టుగా.....
ఎక్కడో సుదూరంలో ఉన్న గురుబోధలను వినాలని ఆరాటంగా వెళ్ళిన మన ఆర్తిని ఆలకించే దైవం, ఏకంగా అక్కడే మనకు, ఒక జీవితకాలంపాటు తోడు నీడై ఉండే స్నేహబంధాలను కల్పించి, మన ఇంటికే వారువచ్చేలా చేసి ఆనందం అనే ఆకాశపు అంచులను తాకేలా మనసనే విహంగానికి ఆహ్లదం కలిగిస్తాడు....
నేలలో పడ్డ ప్రతీవిత్తనం ఎదో ఒక స్వాతి చినుకు స్పర్శకి మొలకెత్తి ఒక వృక్షంగా మారగలదన్న చందంగా,
సంచితపు సరంజామాలోని ఏదో ఒక బంధం, ఈ జీవితంలో కూడా మనకు ఏదో ఒక సరైన క్షణంలో మంచి అనుబంధమై ఏకంగా జీవితమంతా మనకు ఎంతో ప్రీతికరమైన స్నేహ బంధమై ఉండేలా మారిపోతాయి కొన్ని మధుర స్మృతులు....
సంచితపు సరంజామాలోని ఏదో ఒక బంధం, ఈ జీవితంలో కూడా మనకు ఏదో ఒక సరైన క్షణంలో మంచి అనుబంధమై ఏకంగా జీవితమంతా మనకు ఎంతో ప్రీతికరమైన స్నేహ బంధమై ఉండేలా మారిపోతాయి కొన్ని మధుర స్మృతులు....
అదేం విచిత్రమో కాని ఆ విరించి, ఎంతో దెగ్గరగా సాగిన స్నేహబంధాలను ఎంతో దూరంలో కల్పించి... దూరంగా కల్పించవలసినవాటిని నిత్యం పక్కనే ఉండేలా చేసి తన రచనావైచిత్రిని చాటుకుంటాడు... ఉన్నాడుకదా ఏడుకొండలపై నిలిచి అన్నీ సరిదిద్దే అయ్య అనుకొని, స్పీడుగా రాసేసి కిందికి జారవిడుస్తాడో ఏమో కపాలములన్నిటిని... 

No comments:
Post a Comment