Tuesday, September 25, 2018

GuruPornami / VyaasaPornami / Shiridi Vaibhavam...! - 2018


స్వామిపుష్కరిణీస్నానం, శ్రీనివాస దర్శనం, ఏకాదశివ్రతం, సద్గురోః పాదసేవనం...
ఇవి సశాస్త్రీయంగా లభించడం చాలా దుర్లభం అని అంటారు పెద్దలు....
అందుకోసమే, కుల మత వర్ణ వర్గాది భేదభావం లేకుండా, నన్ను శరణుజొచ్చిన వారికి సరైన బాట నేనే చూపిస్తా అని అందరికి సద్గురువుగా వీరాసనం లో కొలువై అభయమిచ్చిన అవధూత శ్రీసాయి బాబా వారి కొన్ని విశేషాలు.... 
శ్రీ శిరిడీ సాయి బాబా జీవితంలో ముఖ్యఘట్టాలు.!!
మొదట 16 సంవత్సరాల బాలుడిగా ప్రకటితమైన సంవత్సరం - 1854
(వేప చెట్టు - ప్రస్తుత గురుస్థానం)
సుమారు మూడు సంవత్సరాల తర్వాత తిరిగి శిరిడీ చేరుకుని దర్శనమిచ్చిన స్థానం..ఖండోబా ఆలయం మఱ్ఱి చెట్టు దగ్గర
శరీరం విడిచి మూడు రోజుల తర్వాత గదాధరుని (శ్రీ రామకృష్ణ పరమహంస) అవతారకార్యాన్ని స్వీకరించి తిరిగి పునరుజ్జీవితులైన సంవత్సరం - Aug 18,1886
3మహాసమాధి చెందిన సంవత్సరం - Oct 15,1918 ,బూటి వాడాలో మహ సమాది
షిరిడి లో సాయి బాబావారి" దినచర్య.💐
శ్రీ సాయిబాబా వారిదినచర్య క్రమం ఈ క్రింది విధంగా ఉంటుంది.....
1) ప్రతి రోజు ప్రాత:కాల సమయంలో అయిదు గంటలకు ముందే మశీదులో " దుని " అనబడే పవిత్ర అగ్నికి దగ్గరగా సాయి కూర్చునే వారు.
2) అయిదు గంటల తర్వత కాలకృత్యములను తీర్చుకొని దీనికి దగ్గరగా నిశబ్దముగా కూర్చోనే వారు. భక్తులకు బోధ చేసేవారు.
3) బాబా వారు బోధ కేవలం వాచికంగా అంటే నోటిమాటగా సాగేది. చేతి వేళ్ళసంజ్ఞలతో "యాదే హఖ్" అనుచు తెలియజేసే వారు
4) బాబా వారు ఉ॥8 గం॥లకు గ్రామంలోని ఐదు ఇళ్ళకు బిక్షకై వెళ్లేవారు.
5) బిక్షాటన నుండి వచ్చినాక కొంత ఆహారమును
భక్తులకు, పక్షులకు, జంతువులకు సైతం ఆహరం
పెట్టేవారు.
6) ఉ॥9-30ని॥లకు బాబావారు అబ్దుల్ వెంటరాగా
"లెండి " తోట కు వెళ్లేవారు అక్కడ ఒక గంట గడిపేవారు.
7) అక్కడ నుండి వచ్చి నాకమ॥2 - గం||ల వరకు మశీదులోనే ఉండేవారు, అటైములో భక్తులు హరతి ఇచ్చేవారు.
హరతి అనంతరం బాబా ఒంటరిగా కూర్చుని
ఒక చిన్న సంచి బయటకు తీసి..
1 పైసా,
1 అణా
బేడా,
4 అణాలు (పావలా),
అర్ద 8 అణాలని,
బయటకు తీసివేళ్ళతో రుద్ది సంచిలో భక్తుల పేర్లతో మరలా దాచేవారు. ఈ తతంగం అంతా
భక్తుల క్షేమం కోసం అనేవారు.
9) బాబా రోజు మొత్తం మీద..
ఉ॥8-30 - 9 -30 మధ్య,
మ॥10-30-11-30లకు,
సా॥5-00-6-30 గంటల మధ్య
మూడు సమావేశాలు నిర్వహించేవారు అపుడు భక్తులతో మాట్లాడేవారు.
10 ) భక్తుల సందేహాలను తీర్చేవారు.వీరికి అర్దమగు రీతిలో సమాధాన పరచేవారు.
11) పగలు ముగిసి రాత్రి కాగానే భావారు, చూరుకు ఒకటి లేదా ఒకటిన్నర అడుగుల క్రిందగా నేల నుంచి ఏడు లేదా ఎనిమిది అడుగుల ఎత్తులో ఆరడుగుల పొడవు ఒక అడుగు వెడల్పు కలిగిన చక్క బల్ల చినిగిన గుడ్డ పేలికలతో వేలాడదీసి దానిపై నిదురించే వారు.
12) ఈ బల్లమీద విశ్రమించడం వింతగా భక్తులు చూసేవారు, దీనికి బాబా వారు విసిజి దానిని విరగ
కొట్టి ధునిలో పడేసారు.
13) బాబా వారు ఎల్లపుడు శారీరకంగాను,
మానసికంగాను, ఉత్సాహంగా మెలుకువగా అప్రమత్తంగా ఉండేవారు.
పైవిధంగా బాబా వారి దినచర్య ఉండేది,
బాబా ఎల్లప్పుడు శారీరకంగాను, మానసికంగాను ఎక్కు
వగా మెలుకువతో అప్రమత్తంగా మెలిగేవారు
భక్తులను రక్షించుతూ ఉండేవారు
షిరిడి మసీదులో ఎన్నో సంఘటనలు ఆనాటి భక్తులకు తెలుసు
ఆ సంఘటనలు బాబా వారి చరిత్రలో చూస్తే బాబా వారి శక్తి తెలుస్తుంది.
ఈనాడు ప్రపంచమంతా బాబాను గురించి తలవని వారు, తెలియని వారు లేరనేది అతిశయోక్తి కాదు!
శిరిడీలో దర్శనీయ స్థలాలు:💐
1.గురు స్థానం(వేప చెట్టు)
2.ఖండోబా మందిరం
3.ద్వారకామాయి(మసీదు)
4.చావడి
5.సమాధి మందిరం
6.లెండీ వనం
7.నంద దీపం
8.గణపతి,శని,మహదేవుల ఆలయాలు
(సమాధి మందిరానికి ఎడమప్రక్క)
9.కర్ణ కానీఫనాధుని ఆలయం.
10.విఠల్ మందిరం (కర్ణ కానిఫా ఆలయం దగ్గర)
11.అష్టలక్ష్మీ మందిరం ( పంజాబీ హోటల్ ఎదురుగా) 12.తాజింఖాన్ బాబా గారి దర్గా.
13.బడే బాబా గారిదర్గా(చావడిఎదురుగా)
14.చోటే బాబా గారి సమాధి(ఖండోబామందిరంలోని మఱ్ఱి చెట్టు ప్రక్కన),
15.మోటే బాబా గారి సమాధి (Gate no: 4 దగ్గర), 16.తాత్యాకోతే పాటిల్ సమాధి,
17.అయ్యర్ సమాధి,
18.అబ్ధుల్ బాబా సమాధి,
19.నానావళి గారి సమాధి (ఊదీ ప్రసాదం పంచే దగ్గర), 20.అమీదాస్ భవాని మెహతా గారి సమాధి,
21.ముక్తరాం గారి సమాధి(దత్త మందిరం వెనుక).
బాబాగారు బిక్ష గ్రహించిన ఇళ్లు:💐
1.సఖరామ్ పాటిల్
2.వామనరావ్ గోండ్ఖర్
(వీరిరువురి ఇళ్లు చావడికి దగ్గరలో ఇప్పుడు వెన్నెల హోటల్ ఉన్న దగ్గర ఎదురెదురుగా ఉండేవి)
3.బయ్యాజి అప్పాకోతేపాటిల్
4.బాయిజాబాయి గణపతికోతే పాటిల్
(వీరిరువురి ఇళ్లు వెన్నెల హోటల్ దాటగానే ఎడమచేతివైపు ఉన్న వీధిలోకి ప్రవేశించి 20
అడుగులు వేయగానే తులసి కోట లాంటి దానిపై పాదుకలు ముద్రించి ఉంటాయి - -పక్కపక్క ఇళ్లు)
5.నందరామ్ మార్వాడీ సంఖ్లేచా.
(ద్వారకామాయి దగ్గర)
బాబాను సేవించిన భక్తులు:💐
1.మహల్సాపతి.(వీరి సమాధి తాజింఖాన్
బాబాగారి దర్గా దగ్గర ఉంది)
2.చాంద్ పాటిల్
3.తత్యాకోతే పాటిల్
4.మాధవరావ్ దేశ్ పాండే /శ్యామా
5.నానా సాహెబ్ చందోర్కర్.
6.అన్నా సాహెబ్ దబోల్కర్ /హేమాడ్ పంత్
7.దాసగణు మహరాజ్
8.ఉపాసని బాబా
9.లక్ష్మీబాయి షిండే(ద్వారకామాయి
ఎదురుసందులో 30 అడుగుల దూరంలో
ఎడమచేతి వైపు)
10.అన్నాసాహెభ్ దభోల్కర్
11.భాగోజీ
12.కాకా సాహెబ్ దీక్షిత్ / హరి సీతారాం
13.దాదా సాహెబ్ ఖాపర్డే
14.అబ్ధుల్లా జాన్
15.బూటీ
16.బడే బాబా
గురుభ్యోనమః
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగి రాజ పరబ్రహ్మశ్రీసచ్చిదానంద సద్గురుసాయినాథ మహారాజ్ కి జై..!!
సబ్..కా..మాలిక్..ఏక్.. హై..!!🙏

https://www.facebook.com/Vinay.Aitha/posts/10214971712219631

No comments:

Post a Comment