Vinay Kumar Aitha
శ్రీకరమైన ' బాల ' గణపతి దర్శనం ...! 
అనగనగా ఒక చిన్న కుటుంబం... పార్వతీ పరమేశ్వరులకు గణపతి, కుమారస్వామి లా, సీతారాములకు లవుడు, కుశుడు లా, అమ్మ నాన్న ఆ ఇద్దరు పిల్లలు...
రాం నగర్ ( జమై-ఒస్మానియ దెగ్గర ) లోని మదర్ తెరెసా స్కూల్లో ఎల్.కె.జి, ఆ తర్వాత మూసాపేట్ దెగ్గర భరత్ నగర్ లోని ' వివేకానంద కాన్వెంట్ ' స్కూల్లో యు.కె.జి లో చదివిన ఆ పెద్ద పిల్లాడిని, ఇంకా ఇంట్లోనే ఆడుకుంటున్న ఆ చిన్న పిల్లాడిని తీసుకొని, చాలి చాలని కొన్ని వందల జీతంతో కిరాయి ఇండ్లల్లో ఉండలేక, జగద్గిరి గుట్ట దెగ్గర్లోని ఓ స్లం ఏరియాలో కొనుకున్న 80 గజాల చిన్న జాగలో ఒక 20 గజాల రేకుల రూం కట్టుకొని అక్కడికి మకాం మార్చి, ఇంటికి ఓ 5 నిమిషాల దెగ్గర్లోనే ఉన్న చిన్న స్కూల్లో పెద్ద పిల్లాడిని 1స్ట్ క్లాస్ లో, చిన్నోడిని నర్సరి లో వేసారు....
స్కూల్లో ఇచ్చిన హోం వర్క్ ఇంటికిరాగానే కోడిబరికినట్టు గీసేసి వెంటనే ఆటాపాటలతో ఊరంతా తిరగడం, చిన్నప్పటినుండి బాగా చలాకి అయిన ఆ పెద్దపిల్లవాడికి ఉన్న ఒకే ఒక పని... అప్పటికీ స్కూల్లో తెలుగు బోధించే అనురాధా టీచర్ అప్పుడప్పుడు,' మీ అమ్మ కి చెప్పాలా హోంవర్క్ అస్సలు నీట్ గా రాయట్లేదని, అవి అక్షరాలో పిచ్చిగీతలో అన్నట్టుగా ఉన్నాయని...' అంటూ పిల్లాడిని రెండు దెబ్బలు వేసేది కూడా...' వద్దు టీచర్ ప్లీస్ ఈ సారి నీట్ గా రాస్తాను ' అనడం, మళ్ళి ఇంటికి వచ్చి అవే ఆటపాటలతో రోజంతా తిరగడం.. ఇసుక కుప్పల్లో నీళ్ళు పోసి బిల్డింగ్లు కట్టడం, కర్ర తో రబ్బర్ టైర్లు తిప్పుతూ తిరగడం, చోర్ పోలిస్, కరంట్ షాక్, వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేంపేర్ వంటి ఆటలన్ని ఆడుతూ, మధ్యలో అలిసి పోయినప్పుడు, సనత్నగర్ ఆల్విన్ లో ఒక చిరుద్యోగి అయిన నాన్న సాయంత్రం / రాత్రి తెచ్చే బిస్కెట్లు / ఫ్రూట్ బ్రెడ్లు / కచోరీలు / తింటూ మళ్ళి పొద్దున్నే స్కూలు, సాయంత్రం 4 నుండి ఆటలు.... ఇదే ఆ పిల్లగాడి పని....
( అప్పటి ఆ కొంటె చిన్న పెద్దపిల్గాడిని నేనే .....
)

పై క్లాసులకు వెళ్తున్నాకొద్ది, ఇంటి చుట్టూ కొత్త కొత్త ఇళ్ళు, దోస్తులు పెరగడం, ఆ స్కూలు కూడా చిన్న చిన్న రేకుల షెడ్ల నుండి కొద్ది దూరంలోనే ఒక పెద్ద బిల్డింగు గా మారడం, ఆ కూకట్పల్లి పరిసరాలు కూడా పొలాలు, వరి చేన్లు కొద్ది కొద్ది గా తగ్గుతూ బిల్డింగ్ల కాలనీలు గా మారడం... ఇలా ఆ పిల్లగాడి బాల్య కౌమారాలకు గుర్తులుగా మిగిలిపోతు ఆ పరిసర ప్రాంతాలు ' అభివృద్ది ' చెందుతూ ఉండడం...
అన్ని గల్లీల్లో వినాయక చవితి రాగానే చిన్న చిన్న పందిరి / గుడారాల్లో గణపయ్యలను చూసి, ఆ క్లాస్ లోని దోస్తులకు కూడా అందరం కలిసి ఏ దోస్త్ ఇంటిదెగ్గర వీలైతే అక్కడ గణేషుడిని పెట్టి పూజిద్దామని, లడ్డూ కూడా పెట్టి, లాస్ట్ కి అందరం తిందామని అనుకొని అలా ప్రతి సంవత్సరం గణేషుడిని పెట్టడం ప్రారంభించారు... నవీన్, మహేష్, సందీప్, చాణిక్య, ఈ నలుగురి ఇంటిదెగ్గర ఎక్కడ వీలైతే అక్కడ చవితి రాగానే ఇక చందాలకు తిరగడం, పందిరి వేయడం, గణేషుడిని కొనడం, పూజలు, ప్రసాదాలు, నిమ్మజన ఉత్సవం లో ఉట్లు కొట్టడం, ఇలా ఆ 9 రోజులు ఒకటే సందడి...

రాష్ట్ర అసెంబ్లి ని రన్ చేసినంతగా ఫీల్ అవుతూ ఉండేవారు ఆ పండగ రాగానే దోస్తులంతా... ఇక నేను అందులో పూజారి లా బిల్డప్ ఇచ్చే వాన్ని (అప్పుడు ఆ చిన్నపాటి స్కూల్ జీవితంలో, ' పూజ కు అరి(శత్రువు) = పూజారి ' అనే పద బంధనం సరికాదని సరిదిద్దిన శ్రీ చాగంటి సద్గురువుల వాక్కు ఇంకా ప్రవేశించలేదు కాబట్టి నేనూ అదే అనేసే వాన్ని..
)
' అరెయ్ ఏందిరా ఇది... అక్కడ మా బస్తి లోని పెద్ద గణేషుడి దెగ్గర పూజారి ఎట్లా చేస్తారో నాకు తెలుసు, మిగతా అరేంజ్మెంట్స్ ఎట్లున్నా సరే పూజ, ప్రసాదాలు, నేను చెప్పినట్టే ఉండాలి....చలో మళ్ళి అన్ని నేను చెప్పినట్టే రీసెట్ చేయండి...." అంటూ ఇక నా సోది తో అందరిని దబాయించే వాడిని...నాకు చిన్నప్పటి నుండి అందరు దోస్తులు, నువ్వేదంటే అదే రా... అనే వారే కాబట్టి నేనే మా చడ్డీ గ్యాంగ్ కి లీడర్ గా బిల్డప్ ఇస్తూ అందరికి డైరెక్షన్ చేయడం పరిపాటి... స్కూల్లో ఎట్లాగో క్లాస్ లీడర్ నేనే కాబట్టి ఇక్కడవినకుంటే అక్కడ క్లాస్ లో అరుస్తా అని నేనుచెప్పింది చేసేస్తూ, అందరం అలా ఆడుతూ పాడుతూ చదువుకుంటూ గడిచిన ఆ బాల్యకౌమార స్మృతులు వెలకట్టలేనివి..!
కూకట్పల్లి పరిసర ప్రాంతాల అన్ని గణేష మండపాలకు అలా తిరుగుతూ ప్రసాదాలన్ని ఒక పెద్ద కవర్లో జమచేసి ఇంటికి తెచ్చుకొని ఇక ఆ రోజు రాత్రికి అదే భోజనం అని లాగించే వాన్ని..!
ఫ్రెండ్స్ తో / ఇంట్లో అందరికి ఏ గణేషుడు ఏ వాహనం పై ఉన్నాడో, తొండం ఎటువైపు ఉందో, లడ్డు ఎంత పెద్దగ ఉందో, ఇవే ముచ్చట్లు ఇక ఆ వారమంతా...
మేము పెట్టిన గణేషుడిని స్కూల్లో వారందరికి వచ్చి చూడమని అందరిని ఆహ్వానిస్తూ వచ్చిన వారందరికి, స్పెషల్ గా మా క్లాస్ వాళ్ళకి ప్రసాదాలు బాగా పంచిపెట్టేవాన్ని....
కొన్ని సంవత్సరాలకు ఇంకో చిన్న కిట్చెన్ రూం వేసుకొని ~ 50 గజాల రేకుల ఇంట్లో ఉంటూ, పక్కన ఉత్తరంగా ఉన్న ఇంకో 80 గజాల స్థలం కొని, మా అమ్మ ఇంటినిండా వివిధ పూల మొక్కలు నాటి, రంగుల రంగుల చామంతులు (తెల్ల చామాంతి, ఎర్ర చామంతి, పసుపుపచ్చ చమంతి, నీలం రంగు చామంతి, చిట్టి చామంతి ) గులాబీలు, లిల్లీలు, మల్లె, విరజాజి, గన్నేరు, దవనం, జామ, దానిమ్మ, కొబ్బరి, ఇత్యాది మొక్కలు / చెట్లతో, మా ఇల్లంతా ఓ నందనవనం లా ఉండేది ఆ రోజుల్లో....
సో చేతికి అందిన పూలన్ని కోసి ఆ సంవత్సరం గణేషుడికి రోజుకో పూమాల అమ్మతో కట్టించి, సాయంత్రం పూజలో దేవుడికి వేసి, ' స్వామి చూసావా, అందరూ ఒకేరకంవి కొని తెస్తే, నీకు నేను ఇంట్లో నుండి ఇన్ని రకాల పూలతో అల్లిన దండను తెచ్చా...కాబట్టి నాకు ఎప్పటికీ ఫుల్ల్లుగా మార్కులు ర్యాంకులు, ఫిస్ట్ ఇన్ క్లాస్ / క్లాస్ లీడర్ బ్యాడ్జ్ లు ఎప్పుడూ నా షర్ట్కే ఇలా నీ పూలమాలల్లా ఉండిపోయేలా దీవించు స్వామి అని, తలపై మొట్టికాయలు వేసి (మెటికలు), గుంజీలు తీయడం...., ఇలా సాగిన ఆ స్కూల్ జీవితం ఎప్పటికీ ఎదలోతుల్లో నిలిచిపోయే సుమనోహర సుమకేసరసౌరభాన్విత కిన్నెరగాన మధురామృత లహరులే కదా.....!

ఆటాపాటలమధ్య మధ్య వచ్చీ రాని పూజలతో, తెలిసి తెలియని ప్రార్థనలతో, హృదయపూర్వకంగా అర్చించిన నాటి బాల గణపతి , 10వ తరగతి లో 85+ % తో స్కూల్ ఫస్ట్, ఆ తర్వాత ఇంటర్లో 95+ % తో నన్ను ఘనంగా దీవించి, ఆ తదుపరి నా జీవితానికి అత్యంత కీలకమైన ఇంజనీరింగ్ పైచదువుల సమయం లో నాకోసమే ప్రత్యక్షంగా నా కాలేజిలోకే గుడికట్టించుకొని మరీ వచ్చి, విధి వక్రించి నా చదువులకు కలగజేసిన విఘ్నాలన్నింటిని తన పాశంతో చుట్టి, అంకుశం తో ఖండించి, ఆపదలను ఆమడదూరంలోనే అణచి, ఇంజనీరింగ్ విద్యలో కూడా నన్ను తడబడకుండా గట్టెకించి 81 % తో ఉత్తీర్ణుడయ్యేలా వెన్నంటే ఉండి సహాయం చేసిన ఆ గణపతి పరబ్రహ్మానికి, ఆయన అనుగ్రహంగా నాకు సహాయం చేసిన వారందరికి, శతధా నేను సదా అభివంద్యుడనే...!! 
అలా 10వ తరగతి అయిన తర్వాత 5 సంవత్సరాలకు హనుమ / పరాశక్తి అనుగ్రహంగా ఎప్పుడో ఓసారి అలా అలా విన్న శ్రీ చాగంటి సద్గురువుల సద్వాక్కే, నా 21వ పడి నుండి, అంటే పదోతరగతి తర్వాత 6 సంవత్సరాలకు, నిత్యమైన సత్యమైన శాశ్వతమైన పరబ్రహ్మతత్వాన్ని బ్రహ్మపదార్ధ ఉనికిని గ్రహింప, ఆ ' భవాని భావనాగమ్యా భావారణ్యకుఠారికా ' అనుగ్రహింప తలచి, కౌమార సదాచార వరిష్ఠులైన, మూర్తిభవించిన పరబ్రహ్మస్వరూపులైన, ఈ తరానికి లభించిన, శ్రీ ఆది శంకరులు, పరమాచార్యులు, శ్రీ రామకృష్ణపరమహంస, అరుణాచల రమణులు, షిరిడి సాయిబాబా, ఇత్యాది భరతి భూమి పై సద్గురువులుగా నడయాడిన ప్రత్యక్ష దైవాల సమ్మిళిత జ్ఞ్యాన రాశి అయిన, శ్రీ చాగంటి సద్గురువుల సద్వాక్కుల సహాయంతో, అవే భవ ప్రయాణపు భావ దిక్సూచి గా చేసి, ఈనాటి వరకు నా బ్రతుకు జట్కా బండిని నడిపించాడు / నడిపిస్తున్నాడు ఆ స్కందపూర్వజుడు....! 
---------------------
---------------------
---------------------
నితాంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజమ్ |
అచింత్య రూపమంత హీన మంతరాయ కృంతనమ్ |
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినామ్ |
తమేకదంతమేవ తం విచింతయామి సంతతమ్ || 5 ||

ఓం గం గణపతయే నమః..!

🙏
---------------------
---------------------
ఓం గం గణపతయే నమః..!
https://www.facebook.com/Vinay.Aitha/posts/10215365800271586
🙏
No comments:
Post a Comment