Wednesday, September 26, 2018

అందరికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జ్ఞ్యాపకార్ధకంగా జరుపుకునే జాతీయ పండుగ " ఉపాధ్యాయ దినోత్సవ " శుభాభినందనలు...! - 2017

అందరికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జ్ఞ్యాపకార్ధకంగా జరుపుకునే జాతీయ పండుగ " ఉపాధ్యాయ దినోత్సవ " శుభాభినందనలు...!
స్కూల్లో, కళాశాలలో, విశ్వవిద్యాలయంలో, ఇలా మన జీవితంలో పైకిరావడానికి కావలసిన చదువుసంధ్యలను నేర్పిన అందరి గురువులకు మనం ఎల్లవేళలా కృతగ్న్యులమే...కాని జీవితంలో ఎంతో కష్టపడి వీలైనన్ని చదువులు గడించి, ఒక స్థాయికి వచ్చాక, అసలు ఈ జీవితపమార్ధం ఏమిటి, ఈ జీవితపు నౌకను అన్నివిధాలా సక్రమంగా పయనించేలా చేసుకునేందుకు కావలసిన భగవద్భక్తి వస్తు విషయ సామాగ్రి ఏంటి, అసలు ఇంకోసారి ఇలాంటి జీవితంలోకి రాకుండా లేదా ఇంతకంటే మెరుగైన జీవితం పొందేలా, అసంఖ్యాక జీవపరంపర లోని ఒకానొక ఈ జీవితానికి ధర్మబద్ధంగా ఆఖరిన శుభంకార్డ్ పడడానికి చరించవలసిన మార్గం ఏంటి అనే ఎంతో దుర్లభమైన / గహనమైన / విలువైన / ఎన్ని డబ్బులు పెట్టినా కొనలేని, అధ్యాత్మ విద్యను ప్రసాదించే తమ తమ బోధక / వాచక / సూచక / పరమ / కారణ సద్గురువులకు కూడా కృతగ్న్యతలు తెలపాలన్నది నా భావన... 
జీవితపు ఉత్థానపతనములను చవిచూసిన వారు జాగ్రత్తగా పరికిస్తే, అన్నివేళలా అన్నిచోట్లా తమకు తోడునీడై ఉన్నది అలాంటి సద్గురు వాక్యం మరియు హరి నామము మాత్రమే...! ఆ హరినామము కూడా అంత రుచిగా జిహ్వాగ్రమున ఒదిగిపోవడానికి కారణము సద్గురు బోధలే...
మనలోనే మనలా మనమై ఉన్న మన ఇంద్రియాలను నిగ్రహించలేక కష్టపడ్డనాడు, ఔదలదాల్చిన ఆ సద్గురు వాక్యమే సుతిమెత్తని అంకుశమై వాటిని దమించింది...
మనతో ఉంటూనే మనజీవితానికి శల్యసారధ్యం వహించే వారిని గుర్తించి స్వీయరక్షణ పొందేందుకు, ఆ సద్గురువాక్యమే క్షీరనీర న్యాయం నేర్పే పరమహంస అయ్యింది...
మనవాళ్ళు కదా సహాయం చేస్తార్లే అనుకుని భంగపడ్డనాడు, ఆ సద్గురువాక్యమే, బంధుత్వపు / మిత్రత్వపు ముసుగులో ఉన్న గోముఖవ్యాఘ్రములను తెలుసుకొని మనల్ని మనమే సరిదిద్దుకునేలాచేసి, సేదతీర్చి స్వాంతన చేకూర్చే సరిజోడయ్యింది...
ఆ ' సర్వానులంఘ్య శాసన ' ను తమజిహ్వాగ్రమున కొలువైఉండేలా చేసుకొని, శివ త్రినేత్రానల సమమైన వారి సద్వాక్కులతో, ఈ తరం యొక్క లక్షలాది ఆధ్యాత్మిక శిష్యులను కడుదూరాల నుండే పార్థసారధిలా నడిపిస్తూ, తమ అప్రతిహత ప్రవచనా యగ్ఞ్య ఫలాలతో అందరి జీవితాలను సుసంపన్నం చేస్తున్న, సాటిలేని ఉపాధ్యాయులు శ్రీ చాగంటి గారికి,
ఇవే ఒక ఏకలవ్య శిష్యుని, ఉపాధ్యాయ దినోత్సవపు కృతగ్న్యతాపూర్వక పాదాభివందనాంజలులు...! 

No comments:

Post a Comment