అంగరంగవైభవంగా తిరుమలలో శ్రీనివాసుని పవిత్రోత్సవాలు సంపూర్ణం... 
వి.ఐ.పి ల ప్రత్యేక ఆర్భాటాలు, దొరలకు ప్రత్యేక ఏర్పాట్లు, సామాన్యభక్తులకు యథావిధిగా అరకొర ప్రాప్తములు, 'ఆలయంలో తెలిసి తెలియక జరిగిన పొరపాట్ల వల్ల స్వామికైంకర్యాల్లోని దోషాల నివృత్తికై ఈ పవిత్రోత్సవాల నిర్వహణ...' అని అర్చక స్వాముల సశాస్త్రీయ వివరణలు...." ఇలా షరామామూలు వార్తలు విని సరిపెట్టుకోవడం కంటే...ఇంకో అడుగు ముందుకు వేసి, అసలు పవిత్రతకే పవిత్రతను ఆపాదించే స్వామికి, పవిత్రోత్సవాలు నిర్వహించడంలో ఇంకేమైనా తాత్విక ఆంతర్యం ఉన్నదా అనే ఆలోచన ఎవరికైన వస్తే, ఒక తర్కం స్ఫురించడం కద్దు అని నా భావన.... 
శ్రీ చాగంటి సద్గురువుగారి " శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర ప్రాశస్త్యం " ప్రవచనం విన్నవారికి తెలిసినట్టుగా, సహస్రం లోని మొట్టమొదటి నామం " విశ్వం " లోనే, పరమాత్మ ఈ మొత్తం విశ్వం తానే అయ్యి, మొత్తం విశ్వం అంతటా తానే దృశ్యాదృశ్యంగా నిండినిబిడీకృతమై, "విశ్వేతి వ్యాప్తః ఇతి విష్ణుః" అనే వాచ్యార్ధానికి ప్రామాణికంగా శ్రీ పోతనామాత్యులవారి భాగవత పద్యం లో
' ఇందుగలడందులేడను సందేహమువలదు...చక్రి సర్వోపగతుండు..ఎందెందువెదకి జూచిన అందందే గలడు దానవాగ్రణివింటే....'
అనే ప్రహ్లాదుని భావనలా,
"యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే" శౄయతేపివా... అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యనారాయణస్థితః...."
అనే మంత్రపుష్పవచనానికి ప్రతీకగా, అసలు పరమాత్మ కాని పదార్ధం అణువంత కూడా లేదని మన పెద్దలు ఎల్లప్పుడూ చెప్పినట్టుగా, ఎక్కడ ఆ
"రేఖామయధ్వజసుధాకలశాతపత్రవజ్రాంకుశాంభురుహకల్పకశంఖచక్రైః భవ్యైరలంకృతతలౌ పరతత్వచిహ్నైః శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపథ్యే"
అని ప్రస్తుతించబడే శ్రీపాద యుగళం కొలువై ఉంటుందో, అక్కడ నిత్యం వసంతఋతుగానమే, ఎల్లవేళలా పచ్చదనం, ఆహ్లాదం, పవిత్రత, పారమార్ధిక సౌరభాలు చుట్టూరా పరుచుకుని ప్రకృతి సాగించే ప్రణయగీతిక.... అని పెద్దలచే రూఢిపరచబడిన సత్యం ఉండగా, మళ్ళీ ఆ విరాట్పురుషున్ని మనం పవిత్రీకరించడం చాలా ఆశ్చర్యమైన విషయమే అవుతుంది కదా మరి..! 
"పవిత్రాణాం పవిత్రం యో మంగళాణాం చ మంగళం, దైవతం దేవతానాం చ భూతానం యో అవ్యయః పితః .." అనే విష్ణుసహస్రనామ వాచకాన్ని,
" అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపివా, యఃస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యాంతరః శుచిః...పుండరీకాక్ష..పుండరీకాక్ష..పుండరీకాక్ష..." అని ఆ స్వామిని తలచుకొని మనం పవిత్రతను సంతరించుకొని అదే పరమాత్మను సేవిస్తూ, ఆయన్నే పవిత్రీకరించడం అంటే భలే విడ్డూరం కదా ?
" అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపివా, యఃస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యాంతరః శుచిః...పుండరీకాక్ష..పుండరీకాక్ష..పుండరీకాక్ష..." అని ఆ స్వామిని తలచుకొని మనం పవిత్రతను సంతరించుకొని అదే పరమాత్మను సేవిస్తూ, ఆయన్నే పవిత్రీకరించడం అంటే భలే విడ్డూరం కదా ?
పెద్దలు చెప్పినదాని ప్రకారం, పవిత్రోత్సవాలు కేవలం పరమాత్మను, ఆయన దేవేరులను, వారి పరివారానికి నెలవైన ఉపాలయాల దేవతాగణాలను, సేవించడంలోని పొరపాట్లను శమింపజేయడం కోసమే కాకుండా, ఆయన్ని, ఆయన తత్వాన్ని సరిగ్గా అర్ధంచేసుకునే క్రమంలో మన తొట్రుపాట్లను, జ్ఞ్యానలేమిని, సరిదిద్దేందుకు పరమాత్మకు ఒక విశేష ఉత్సవంగా జరిపి, తదంతర్భాగంగా ఆయన్ని సంతసింపచేసి ఇంకా మెరుగైన విధంగా తన లీలావైభవాలు మనకు గ్రాహ్యమయ్యేలా విశేషానుగ్రహాన్ని వర్షించేందుకు జరిపే సంవత్సరోత్సవం. మన శాస్త్రాల ప్రకారంగా, ఆత్మశక్తికి ప్రతీక సూర్యుడు. మనోశక్తికి ప్రతీక చంద్రుడు. దక్షిణాయణంలో సూర్యుడు తన రథగమనాన్ని భూమికి దూరంగా దక్షిణదిశగా సాగిస్తున్న సమయంలో సహజనంగానే జీవకోటికి ఆత్మశక్తి సన్నగిల్లే కాలం. అన్ని శక్తియుక్తులకు మూలమైనది ఆత్మశక్తి. అది తగ్గడమంటే అన్ని జీవక్రియలు మందగించి క్రమక్రమంగా మనిషిలోని ఆత్మబలం శోషించి అచేతనత్వం వైపుగా వెళ్ళడం. అలా కాకుండా జీవకోటిని సదారక్షించే ఆ శ్రీహరికి, అనగా భూమి మీద శ్రీవేంకటనగముపైన కొలువైన తన సజీవసాలిగ్రామ అర్చాబింబానికి పవిత్రోత్సవాంతర్భాగంగా వైదిక క్రతువులతో విశేషంగా ఆత్మశక్తిని పరిపుష్టిగావించి తద్వారా అది లోకంలోని జీవకోటికి అంది అందరి జీవితాలు సుఖసంతోషాలతో వర్ధిల్లి, పరమాత్మ పోషక తోషక రక్షకత్వాన్ని మరింత స్ఫష్టంగా అర్ధంచేసుకొని, తనను వాచిక కాయిక మానసికంగా సదాసేవిస్తూ బ్రతికే పవిత్రమైన మనోసంకల్పములే ఎల్లప్పుడు మనకు ఉద్భవించాలని జరిపే మహోత్సవం స్వామి పవిత్రోత్సవం...! 
అనమాచార్యుల వారికి కూడా బహుశా ఇలాంటి భావనే వచ్చినప్పుడు స్వామిని, తమ
" యజ్ఞమూర్తి యజ్ఞకర్త యజ్ఞభోక్త విన్నిటాను యజ్ఞాదిఫలరూప మిటు నీవై వుండవే "
అనే కృతిలో,
" జగతికి నీపాదజలమే సంప్రోక్షణ, జిగినీకు సంప్రోక్షణ సేయువారమా, పగటున నన్నునేడు పావనము సేయుటకు, అగు పుణ్యతీర్థముల అభిషేకమందవే..."
అంటూ కీర్తించి పరవశించారు ఆ పదకవితాపితామహులు....! 
https://www.facebook.com/Vinay.Aitha/posts/10215204814087032

No comments:
Post a Comment