అందరికీ శ్రీకృష్ణజన్మాష్టమి శుభాభినందనలు....
దేశం ఒకటే అయినా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా వాతావరణం ఆయా ప్రాతానికి అనుగుణంగా ఉంటుంది....
అలాగే దైవం ఒకటే అయిన, ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఆయా ఐతిహ్యం / స్థలపురాణానికి తగ్గట్టుగా తన దివ్య భూతులతో ఉండడం ఈ భరత భూమి యొక్క వైశిష్ట్యం ...
అలాగే దైవం ఒకటే అయిన, ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఆయా ఐతిహ్యం / స్థలపురాణానికి తగ్గట్టుగా తన దివ్య భూతులతో ఉండడం ఈ భరత భూమి యొక్క వైశిష్ట్యం ...
మనిషి తను ఒకటి చేసి అది నేను చేయలేదు, నేనెందుకు అలాచేస్తా, నాకేం అలా చేసే అవసరం లేదే అని ఇలా చాల విధాలుగా తనకు గిట్టని వారిపై సత్యాన్ని ధనబలం, దేహబలం, ఇత్యాది లౌకికాంశాలతో, రూపుమాపేయడం ఈ కలియుగంలో పరిపాటి..ఇది యుగయుగాలుగా ఉన్న జాడ్యమే అయినా, దైవం తనదైన శైలిలో కొన్నిటిని సత్యప్రామాణికక్షేత్రాలుగా చేసుకొని అక్కడకొలువై ఉండడం ఈ కాలానికి కూడా మనం గమనించవచ్చు...
కాణిపాక గణపతి క్షేత్రం, తరిగొండ శ్రీలక్ష్మీనృసిమ్హ క్షేత్రం, ఇలా ఎన్నెన్నో క్షేత్రాలు సత్యప్రమాణాలకు కేంద్రంగా ఆనాటి బ్రిటీష్ వారి నుండి ఈనాటి వరకు వర్ధిల్లడం అందరికి విదితమే....
ఒక సంఘటనలో ఇరుపక్షాలు మేము చెప్పిందే, చేసిందే నిజం అవతలి వారిది అసలు నిజమే కాదు అనే వాదప్రతివాదాలకి ఇలాంటి క్షేత్రాలు ఇప్పటికి పెద్దలచే, మహనీయులచే, సప్రామాణీకాలుగా చెప్పబడడం నిజం...
ఎవరైనా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని, తన స్థానబలానికి ఇవ్వబడే నమ్మకాన్ని, గౌరవాన్ని అధారంగా చేసూకొని తప్పుదారి పట్టించేలా దుర్బోధ చేసి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తద్సంబంధంగా మరెన్నో ఎన్నెనో శల్యసారధ్యాలు చేస్తూ ఉన్నా, దైవం మాత్రం తనను నమ్మిన వారిపట్ల కృష్ణసారధ్యం వహించి వాటిని గురించిన అవగాహన కల్పించడంలో ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది...
శ్రీ చాగంటి సద్గురువుల భాగవతాన్ని జీర్ణం చేసుకున్న వారికి తెలిసినట్టుగా, శ్యమంతకమణి కోసం శ్రీకృష్ణుని పై ఎన్నో నిందలు వేసి తర్వాత సత్యం తెలుసుకొని సత్రాజిత్తు తన కూతురైన సత్యభామను కృష్ణుడికి భార్యగా సమర్పించడం, 8 మంది రాజకాంతల్లో / భార్యలలో ' సత్యభామ ' ఒకరవ్వడం వెనక అసలైన తాత్విక అర్ధం ఈ చరాచర అష్టవిధ ప్రకృతికి ఆధారమైన పరమాత్మను కృష్ణపరమాత్మగా భావించినప్పుడు, ఆయన అష్ట భార్యలే అష్టవిధ ప్రకృతికి సూచికలైనప్పుడు,
' సత్య(సత్యం) భా(వెలుగు/కాంతి) మా(విష్ణుశక్తి) ' అనగా ఎల్లప్పుడూ ఉండే సత్యం అయిన వెలుగు యొక్క విష్ణుశక్తి, పరమాత్మ యొక్క శక్తి గానే ఉంటుంది అని చెప్పడమే....!
' సత్య(సత్యం) భా(వెలుగు/కాంతి) మా(విష్ణుశక్తి) ' అనగా ఎల్లప్పుడూ ఉండే సత్యం అయిన వెలుగు యొక్క విష్ణుశక్తి, పరమాత్మ యొక్క శక్తి గానే ఉంటుంది అని చెప్పడమే....!
కృష్ణపరమాత్మను ' కృష్ణం వందే జదగ్గురుం ' అని జగద్గురువుగా ఆరాధించడంలోని ఆంతర్యం పెద్దలు చెప్పినట్టుగా, తనని కేవలం దైవంగా కాకుండా ఒక మెట్టు పైస్థాయిలో నిలిచి గురువుగా ఆరాధించిననాడు, లోకంలోని సత్యాలన్నిటికి సజీవసాక్షిగా ఎల్లప్పుడూ ఉండే పరమాత్మ తన సత్యభామ శక్తి యొక్క అనుగ్రహంతో, ప్రతి సంఘటనలోని నిజానిజాలను ఎరుకపరిచే విధంగా తన యోగవిభూతులను భక్తులకు అనుగ్రహిస్తాడు అనేది జగమెరిగిన నిర్వివాదాంశం...! ఆనాటి శ్రీకృష్ణుడే ఈనాటి శ్రీవేంకటేశ్వరుడు అనేది అంతే సత్యం...!! 
అన్నమాచార్యుల వారుకూడా, తమ " కేవల కృష్ణావతార కేశవా
దేవదేవ లోకనాథ దివ్యదేహ కేశవా " కృతిలో "కిరణార్క కోటితేజ కేశవా... " అని స్వామిని ముదావహంగా కీర్తించారు...
దేవదేవ లోకనాథ దివ్యదేహ కేశవా " కృతిలో "కిరణార్క కోటితేజ కేశవా... " అని స్వామిని ముదావహంగా కీర్తించారు...
https://www.facebook.com/Vinay.Aitha/posts/10215246747735347

No comments:
Post a Comment