Friday, September 21, 2018

మంగళవార వైభవం...!

శాస్త్ర గౌరవం తెలిసిన పెద్దలు ఏది చెప్పినా సుదూరాలోచనతో ఎక్కువ మంది శ్రేయస్సును పరిగణలోకి తీసుకొని చెప్తారే కాని, వాళ్ళకి ఏదో చాదస్తం ఉండి మనం ఇచ్చే పదో పరకో జేబులో వేసుకొని ప్లాట్లు, కోట్లు కూడబెట్టేద్దామని మాత్రం కాదు...
వైదికధర్మాన్ని ఆపోశనపట్టిన వారికి మొట్టమొదట గుర్తోచ్చేదే సమాజ శ్రేయస్సు కాబట్టి పురము యొక్క హితము కోరుకునే వారే పురోహితులు అనడం పరిపాటి...
అతిసామాన్యంగా ఒక విషయాన్ని తరచు చూస్తుంటాం, ఎవరైనా మంగళవారం కొన్ని పనులు చేయడం దోషపూరితం అనగానే, వెంటనే వారిపై విరుచుకపడి అక్కసు ప్రకటించడం కంటే, అందులో ఏదైనా ధర్మసూక్ష్మం ఉన్నదా లేక వొట్టి చాదస్తమా అనే దిశగా ఒక్కసారైనా వివేచన తో ఆలోచన సాగిస్తే అది గౌరవప్రదమైన కార్యనిర్వహణ అంటారుగాని, మేమేంటి, మా పరపతి ఏంటి, మా స్థాయి ఏంటి, చిన్నవారైన అవతలి వారి మాట మేము ఏంటి వినేది, అనే దిశలోనే ఉగ్రమైన అలోచనా ధోరణి ఉన్నప్పుడు, అది ఆమోదయోగ్యం కానేరదు కదా...
ఆఖరికి ప్రతి వారికీ అతిసామాన్య శరీర ధర్మమైన క్షవరం (హెర్ కట్టింగ్ ) చేసే దుకాణాలు కూడా మంగళవారమే బంద్ చేయడానికి ఇదే కారణం...
ఆయా రోజు మొదలయ్యే హోర ప్రకారంగా నవ గ్రహాలలో ప్రతి రోజుకి ఒక అధిపతి ఉండడం అందరికి తెలిసిందే....
( ఛాయా గ్రహాలైన రాహు, కేతువులను పక్కన పెడ్తే )
ఆది వారానికి సూర్యుడు, (రవి వాసరే)
సోమవారానికి చంద్రుడు, (ఇందు వాసరే)
మంగళవారానికి కుజుడు, (భౌమ వాసరే)
బుధవారానికి బుధుడు, (సౌమ్య వాసరే)
గురువారానికి గురుడు, (బృహస్పతి వాసరే)
శుక్రవారానికి శుక్రుడు, (భృగు వాసరే)
శనివారానికి శని... (మంద వాసరే / స్థిర వాసరే)
ఇలా ప్రతి రోజు తనదైన విశిష్టత తో ఉండడంవల్ల శాస్త్రమరియాదలు తెలిసిన పెద్దలు కొన్ని చేయకూడని పనుల గురించి అందరి శ్రేయస్సుకై చెప్తుంటారు....
భారత న్యాయ శాస్త్ర ప్రకారం, వెయ్యి మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కాని, ఒక్క నిర్దోషి కూడా పొరపాటుగా శిక్షింపబడ కూడదు...
అదే విధంగా, భారత సనాతన ధర్మ శాస్త్ర ప్రకారంగా, వెయ్యి మామూలు పనులు మెల్లగా చేసుకున్నా పర్లేదు కాని,
ఎందరినో చాలాకాలం ప్రభావితం చెయ్యగల, ఖచ్చితంగా చేయవలసిన ముఖ్యమైన పనిని తర్వాత ఎప్పటికో వాయిదా వేస్తే, దాని పర్యవసానం ఎంత మందినైనా తీవ్రంగా బాధించవచ్చు...
కాబట్టి ముఖ్యమైన పనుల్లో శాస్త్రానికి, లౌక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి తప్ప, అనవసర భేషజాలకు, పట్టింపులకు, పరపతికి, కాదు అన్నది ఎందరో సద్వర్తనులైన పెద్దల మాట...
సకల దేవతా స్వరుపుడైన హనుమంతుని, శక్తి పుత్రుడైన సుబ్రహ్మణ్య / కుమార స్వామిని, మంగళగౌరి అమ్మవారిని,
అర్చించే మంగళవారానికి పెద్దలు చాల ప్రాముఖ్యత ఇవ్వడానికి గల కారణం ఆ రోజు మొదలయ్యే కుజ హోర వల్ల...
కుజుడి ప్రభావం అంతా ఇంతా కాదు....
వివాహ, ఉద్యోగ, సంతాన, మానసిక / శారీరక ఆరోగ్య, ఇత్యాది ఎన్నింటినో మంచిగా / చెడుగా ప్రభావితం చెయ్యడంలో కుజుని పాత్ర కీలకం. అంగారకుడు, భౌముడు, ధరాసుతుడు, ఇత్యాది పేర్లతో పిలువబడే భూదేవి వరాహస్వామి యొక్క సంతానమైన కుజుడిది భూమి తత్వం కనుక, ఆ రోజు భూమికి సంబంధించిన అన్ని పనుల్లో ఎంతో జాగ్రత్త వహిస్తారు. భూమిని అసలు అకారణంగా తవ్వరు. శరీరంలోని అన్ని అవయవాల్లో ' చర్మం ' భూమి తత్వంతో ఉండేది. కాబట్టి చర్మాన్ని ఇబ్బంది పెట్టే పనులు, చర్మాన్ని ఆధారంగా చేసుకొని పెరిగే జుత్తు ని కత్తిరించడం కూడా ఆ రోజు కుజుని ఆగ్రహానికి కారణం అవుతుందనే అవి నిషిద్దం చేయడం...
ఈ కలి యుగంలో అశ్వమేధ యజ్ఞ్య సమమైన దహనసంస్కారాది క్రియలను కూడా మంగళవారం నాడు కుజుని ఆగ్రహానికి కారణం కాకుండా పెద్దలు నిషిద్దం చేసింది...
సర్పానికి ప్రతిరూపంగా కొలువబడే సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం ఆరాధించడం కూడా, సర్పశాపం ఎంత తీవ్రమైనదో అంతటి తీవ్రమైన కుజ దోష బాధలనుండి విముక్తి కొరకే.
కుజ గ్రహం యొక్క ప్రభావం ఇంకా బాగా అర్ధమవ్వాలంటే, కృష్ణా జిల్లా లో మోపిదేవి అనే సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి, అక్కడ భూమి సొరుగులో ఉన్నాడా అన్నట్టుగా గర్భగుడిలో ముదురు గోధుమవర్ణ శివలింగ స్వరూపంగా ఉండే సుబ్రహ్మణ్యస్వామిని ధ్యానిస్తే తెలుస్తుంది ఎన్ని తర తరాలకు సర్ప బాధలు, కుజ బాధలు వాటి ప్రభావం చూపగలవో...
( ఒ 6 సంవత్సరాల క్రితం శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనం విని, అక్కడ సుబ్రహ్మణ్యస్వామి పెద్ద కాలసర్ప రూపం లో బయటికి వచ్చి దర్శనం ఇస్తారని తెలియగా వెళ్ళిన నాకు..... పొద్దున్నే 5 గంట్లకు అభిషేక భాగ్యం అయితే లభించింది కాని, స్వామి అలా సర్పరూపంలో ఇప్పట్లో రావడంలేదు బాబు అని అక్కడి అర్చకులు చెప్పారు..).ఇట్లా ఎన్నో విధాలుగా కుజుడికి ఉండే ప్రాముఖ్యత వల్ల మంగళవారం నాడు సర్వమంగళా / మంగళగౌరి అమ్మవారి అనుగ్రహాన్ని కోల్పోకుండా ఉండడానికి పెద్దలు సూచించిన విషయాలలోని ఆంతర్యాన్ని అర్ధం చేసుకుని జీవించగలిగితే అందరికి ప్రశాంతజీవనమే...
కొందరు వెంటనే, మీ ఏడుకొండల స్వామి ఎందుకో మరి మంగళవారం కూడా మా జుత్తుని తీసేస్కుంటున్నాడు అని ఈ శాస్త్ర ధర్మాన్ని అపహాస్యం చేయొచ్చు... ఇక్కడ గమనించవలసిన ధర్మసూక్ష్మం, ఏడుకొండలు అప్రాకృతమైన వైకుంఠం లోని క్రీడాద్రి అనే పర్వతరాజం...ఆదిశేషుడు / వాయు దేవుడు, నేనంటే నేనే గొప్ప అనే చిన్న వాదులాటలో భాగంగా స్వామిచే ఈ భూమిపైకి సువర్ణముఖరి నదీ తీరానికి దెగ్గరగా పడేలా దివినుండి పంపించబడిన సాలిగ్రామపర్వతం...అక్కడ శ్రీనివాసుని శ్రీవైష్ణవ నియమాలే తప్ప, సామాన్యమైన లౌకిక / పృథ్వీ నియమాలు వర్తించవు...!
అన్నమాచార్యులు స్వామిని
మాధవునకు మంగళం | సాధు ప్రియునకు జయ మంగళం ||"
అనే కీర్తనలో
" మహామహునకు మంగళము | మహీధవునకు మంగళము | "
అంటూ మంగళవచనభరితంగా కీర్తించారు... 

ANNAMACHARYA-LYRICS.BLOGSPOT.COM
Sri Tallapaka Annamacharya (1408-1503) the saint composer of the 15th century is the earliest known musician of India to compose 32k songs called “sankIrtanas” in praise of Lord Venkateswara.Lord Vishnu manifested Himself as Lord Venkateswara in Tirumala Hills to protect the Dharma from decay in...
Comments

Renukumar Gupta అద్భుతంగా చెప్పారు Vinay Kumar Aitha గారు.. పెద్దరికం అనేది వయసుతో కాదు.. పరిణతితో వస్తుంది అని చెప్పిన మాటకి మీరే ఉదాహరణ.. నేను చెప్పిన మాట మీకు అతిశయోక్తిగా అనిపించవచ్చు..

పైన మీరు చెప్పిన ప్రతి మాట చాల లోతైన పరిశిలనతోనే వస్తాయి.. మీరు పెట్టె ప్రతి టపాలో మీరు చేసిన నిశిత పరిశీలన.. తెలిసిన పెద్దలకి ముచ్చట గోలిపితే.. తెలియనీ వారికి ఆశ్చర్యము, ఆనందము కలుగుతాయి.


శ్రీ వేంకటేశ్వర కరుణా కటాక్ష సిద్ధిరస్తు.

Manage


LikeShow More Reactions
Reply2w

Vinay Kumar Aitha Mee vanTi Bhaagawatula Sangamu toa alanaaDu Srivaari Seavaantarbhaagamgaa labhinchina EaDukonDala Swaamy kaTaakshamea indantaa....🙏Sarvam SriVenkaTaKrishnaarpanamastu...: )

Manage

LikeShow More Reactions
Reply2w

https://www.facebook.com/Vinay.Aitha/posts/10215253954795519

No comments:

Post a Comment