హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటంసునాసం మందస్మితం మకరకుండలచారుగండం
బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం...!
బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం...!
స్వామి వారి దివ్య ముఖమండలం కస్తూరి తిలకాఛ్ఛాదిత కర్పూరనామం తో కప్పబడి ఉండడానికి పెద్దలు ఈ క్రింది అనేక కారణాలు చెప్తుంటారు..నామం యొక్క కొలతలు, రూపురేఖలు మొదలైన లౌకిక అంశాలు వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా అర్చకులు తూచాతప్పకుండా పాటించడం పరిపాటి... అందులో ఏమైనా లోపాలు జరిగితే స్వామివారి ఆగ్రహాన్ని ఆహ్వానించడమే అనే సత్యం గురువుగారు చెప్పినట్టు పి.వి.అర్.కే ప్రసాద్ గారి హయాంలో మరియు ఇంకోసారి అక్కడ విదితమైన విషయమే...
ఇక అలా ఎందుకు ఏమిటి అనే వాటికి తాత్వికపరంగా సమాధానం...
1. ఆనందనిలయంలో శుక్రవారం నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆనాడు సన్నిధి డ్యూటి లభించిన వైఖానస అర్చకులు, అభిషేకకైంకర్యానంతరం, కొద్ది సమయంపాటే స్వామివారు ప్రసాదించే " నిజపాదదర్శనం " అనంతరం, ఆ మనోహరమైన ముఖమండలాన్ని వైఖానస ఆగమశాస్త్రనియమానుసారంగా కర్పూరాన్ని అద్ది కస్తూరితిలాకన్ని దిద్ది, తోమాల సేవ, ఆభరణాలు ఇత్యాదులన్ని అలంకరించిన తర్వాతే సామాన్య భక్తులకుదర్శనభాగ్యం కల్పిస్తారు.. ( భక్తుల రద్దీ కారణంగా, నిజపాదదర్శనం లైన్ అవ్వగానే వెనువెంటనే మిగతా అన్నిలైన్లు మొదలుపెట్టేస్తారు )
2. అన్నసూక్తం, ఇత్యాది వైదిక సూక్తాలను పఠించి తమనుతాము శ్రీమహావిష్ణుస్వరూపంగా మలచుకొని, అర్చకులు జరిపిన అభిషేక కైంకర్యంతో స్వామివారు నూతనదైవికతేజస్సును సంతరించుకొని, సంతసించి అతిప్రసన్నుడై ఉండే ఆకొద్ది కాలం మాత్రమే పూర్ణముఖమండలదర్శనం. తరువాత స్వామి వారినేత్రములనుండి ఉత్పన్నమయ్యే దివ్యతేజస్సును భరించడం మానవమాత్రులకు అసాధ్యం. " బ్రాహ్మణోః అస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః..." అని పురుషసూక్తంలో వర్ణించినట్టుగా, ఆ విరాట్ పురుషునివదనారవిందం నుండి బ్రాహ్మణులు ఉద్భవించారు (అంటే సత్బ్రాహ్మణుల్లోని దైవిక తేజస్సు, జ్ఞ్యాన వర్చస్సు తన శక్తియే అని భావం...). త్రికాలగాయత్రితో పోతపోసుకున్న పరాశక్తిస్వరూపులుగాఉండే బ్రాహ్మణోత్తముల వర్చస్సునే చూసి మనం ఆశ్చర్యపోతాం...మరి అటువంటి అసంఖ్యాక తేజోపుంజములకు నెలవైన స్వామివారి ముఖమండలం, అది నిరంతరం బహిర్గతమయ్యే నయనకవాటాలను సూటిగా చూసిభరించే శక్తి మానవులకు దుస్సాధ్యం. అందుకే అది యెల్లవేళలా శాస్త్రబద్దంగా ఆఛ్ఛాదింపబడి ఉండాలి. కేవలం స్వామివారి కంటికొలుకుల్లోనుండి ప్రసరింపబడే అతికొద్ది తేజోరాశి భక్తుల పైకి వచ్చి వారి వారి ఆర్తికి అనుగుణంగా పాపనాశనం అయ్యెలా ఉండే ఆ తిరునామకూర్పు అనాదిగా ఆచరింపబడుతున్న సత్సాంప్రదాయం...
3. ఆలయ ఆగమం ప్రకారంగా ఆయా దేవతాస్వారుపాల వాహనం వారికి అభిముఖంగా ఉండేలా ప్రతిష్ఠ ఉండడం గమనించే ఉంటారు. అంటే శివుడికి నందీశ్వరుడు, పరాశక్తికి సిమ్హం, శ్రీమహావిష్ణువుకి గరుడాళ్వార్, శ్రీరాములవారికి హనుమంతుడు, హనుమంతునికి ఉష్ట్రము (ఒంటే) అలా వివిధమైన వాహనాలు అన్నమాట. ఆలయ దైవానికి, వాహనానికి మధ్యలో ఎక్కువసేపు ఎవరు అడ్డుగా ఉండకూడదు అని పెద్దల ఉవాచ. వాహనానికి వాహకశక్తిని నిరంతరం తద్ దైవం సమకూరుస్తూ ఉంటుంది. అంటే అక్కడి మూర్తిలోని దైవికతేజస్సు నిరంతరం స్థిరంగా ఉండేలా పరస్పర పరావర్తన సైద్ధాంతిక సత్యానికి అనుగుణంగా అక్కడి నిర్మాణం ఉంటుంది. తిరుమలలో నిరంతర భక్తుల దర్శనాలతో అలా స్వామివారు మరియు గరుడాళ్వార్లు తమ నేత్రశక్తిని నిరంతరం సరళరేఖపైనే నిలిపేలా వీలుండడం చాల తక్కువని అందరికి తెలిసిన విషయమే. కాబట్టి అది ఉద్గమస్థానంలోనే అంతర్నిహితమై స్వామిలోనే స్థిరంగా ఉండేలా ఆ కర్పూరనామకూర్పు.
మరి గరుడాళ్వార్లకు అక్కడ స్వామి వారు అప్పుడప్పుడు తప్ప, నిరంతరం తేజస్సును ప్రసాదించడా..? అని అనడం భావ్యం కాదు. తిరుమల పై సహజంగానే గరుడాళ్వారుల శక్తి అనంతమైనది. అది సాక్షాత్తు గరుడాచలమే. కొండదిగి వెళ్తున్నప్పుడు అందరం చూసేవిధంగా రెక్కలు విప్పార్చికొలువైన పెద్ద గరుడుడిపైనే స్వామి కొలువైఉన్నారనేది అందరికి తెలిసిన విషయమే...
4. ఇక ఎనలేని గురువార నేత్రదర్శనంలో స్వామివారి ముఖమండలం నయనభరితంగా చూసే అదృష్టం..! ఆభరణాలన్ని సడలింపుగావించి పూలంగి అలంకారం లో ఉన్న స్వామి వారి అలౌకిక అందానికి ఎవ్వరైనా ఇట్టే మోహం పొందవలసిందే...అంతటి రమణీయశోభాయమానమైన దర్శనం అది..!!
గురువారం ఉండే గురుహోర కు స్వామివారి నేత్రములనుండి ప్రసరించే తీక్షణశక్తిని సౌమ్యంగా మార్చే శక్తికలదు. నవగ్రహాల్లోకెల్ల గురుగ్రహం అత్యంత పెద్దది, శక్తివంతమైనదని అందరికి తెలిసిన విషయమే. " సర్వాంగే సౌమ్య లక్ష్మీః మయితు విజయతాం సర్వ సామ్రాజ్య లక్ష్మీః...." అని స్వామిని ప్రస్తుతించినట్టుగా, స్వామిని ఆపాదతలమస్తకం ఆవహించి ఉన్న ఆ సౌమ్యలక్ష్మీ అమ్మవారు ఆరోజు స్వామిని నిరంతరం అతిప్రసన్నంగా ఉండేలా చేస్తుంది..
మిగత అన్ని రోజులు స్వామి అంతర్నిహితుడై భక్తులను జీవుల స్థాయిలో చూస్తు, యోగదృష్టి తో వారిని అనుగ్రహిస్తుంటే, గురువారం మాత్రం సహజమైన తన నిజనేత్రాలతో చూస్తు ఉంటాడు. అందుకే తిరుమల లో అందరు గురువారం మాత్రం స్వామిని, స్వామిభక్తులను అత్యంత భక్తిశ్రద్ధలతో చూస్తారు. ఏ చిన్న పొరపాటు, తప్పిదం, భక్తులను మోసం చేయడం, ఆమ్యామ్యాలు కావించడం ఇలాంటివన్ని అస్సలు చేయరు. గురువారం అలా చేసినవారిని స్వామి వారు వెంటనే శిక్షించడం అక్కడ ఎందరికో తెలిసిన సత్యం..!

5. "సర్వేంద్రియానాం నయనం ప్రధానం.." అనే పెద్దలమాట ప్రకారంగా, మానవులకు అంతగా అవగతం కాని, కాకుడని ఎన్నెనో దైవిక, ఆధ్యాత్మిక కారణాలకు, స్వామివారిని అలా కర్పూరనామభరితుడిగా దర్శించడమే సర్వశ్రేయస్స్కరమని భావించడమే విజ్ఞ్యులకు ఔచిత్యం. 
https://www.facebook.com/Vinay.Aitha/posts/10214903483753962

No comments:
Post a Comment