Tuesday, September 25, 2018

కమలాక్షు నర్చించు కరములు కరములు...!

Vinay Kumar Aitha shared a post.
18 July
7-169-సీ.
కమలాక్షు నర్చించు కరములు కరములు;
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు;
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము; 
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు;
మధువైరిఁ దవిలిన మనము మనము;
భగవంతు వలగొను పదములు పదములు;
పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;
ఒక సామాన్య సగటు మధ్యతరగతి మనిషి, ఎన్నో సంవత్సరాలు వ్యయప్రయాసలకు ఓర్చి కష్టార్జితమైన రొక్కాన్ని పైసా పైసా జమచేసి, కూడబెట్టుకున్న ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చుపెట్టి ఒక సొంత ఇల్లు కట్టుకోవడమే ఎంత పెద్ద ఘనకార్యమో అందరికి తెలిసిందే. అలా ఒక పది సంవత్సరాలు కష్టపడి దాచుకున్న లౌకిక ధనం తో కట్టుకున్న ఇంటినే ఎంతో అపురూపమని ఉదాహరణగా తీసుకుంటే...
కొన్ని జన్మల పాటు కష్టపడి, ఎన్నో ఉత్తానపతనాలకు ఓర్చి ధర్మబద్దంగా జీవించి, ఆర్జించుకున్న పుణ్యం అనే పారలౌకిక సంపదతో పొందే ఉన్నత జన్మల్లో సంప్రాప్తించే ' నిర్మల భక్తి జ్ఞ్యాన ధనం ' తో స్వామి వారి సన్నిధిని ' ఆర్జించి ', ఈశ్వరున్ని సేవిస్తూ బ్రతకడం కూడా ఎంతో అపురూపమైన జీవనమే...!
అది స్వామికి కైంకర్యం జరిపే అర్చకులైనా, మోసే బోయీలైనా, సన్నిధిని శుభ్రపరిచి స్వామిముందు రంగవల్లులు తీర్చిదిద్దే వారైనా, తిరుఛ్ఛినం ఇత్యాది వాద్యకారులైనా, సంగీత సాహిత్య సంకీర్తనాలాపకులైనా, పద్య గద్య హరికథా వాచకులైనా, మరే ఇతరమైన ఈశ్వర ప్రసాదితమైన సేవలో ఉన్నవారైనా సరే... 
అన్నమార్యుల భావనలో ఇంకా చెప్పాలంటే, మన ఉనికి లోని ప్రతి మనికి పరమాత్ముని సేవగా ఎలా ఉండగలదో ఈ కీర్తనలో ముదావహంగా కృతిపరిచారు... 

No comments:

Post a Comment