అందరికి వైశాఖ బహుళ దశమి హనుమద్ జయంతి శుభాభినందనలు...
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం..!
అర్చనం వందనం సఖ్యం దాస్యం ఆత్మనివేదనం..!!

ఇట్టి నవవిధ భక్తిమార్గాల్లో, ఒక్కొక్క మహితాత్మున్ని ఒక్కొక్క దానికి ప్రతీకగా పెద్దలు పేర్కొనడం పరిపాటి... బలిచక్రవర్తి ఆత్మనివేదనానికి, హనుమంతున్ని దాస్యానికి, అర్జునున్ని సఖ్యానికి, అక్రూరున్ని వందనానికి....ఇలా...ఒక్కొక్కరు ఒక్కొక్కమార్గాన్ని అనుసరించి భగవంతుడు ఎవరు ఎలా భావిస్తే అలాగే దరిచేరతాడనడానికి తార్కాణంగా నిలిచి శరణాగతిపూరిత భక్తిమార్గాన్ని సర్వశ్రేయోదాయక సాంప్రదాయంగా చాటిచెప్పడం విదితమే...
కాని, సరిగ్గా పరికించి చూస్తే, హనుమంతుడు దాస్యానికి ప్రతీకగా చెప్పబడినా, ఆంతరముగ నవవిధ భక్తిమార్గాలను ఉపాసించి, పిలిచిన పలికే పరమభాగవతోత్తమునిగా, చిరంజీవిగా, భవిష్యద్ బ్రహ్మగా ఇప్పటికీ ఎప్పటికీ చిరంతనంగా సత్ చిత్ ఆనంద స్వరుపుడైన పరమాత్మతో జీవాత్మను అనుసంధానించడంలో, ఉపాసకులకు ఎనలేని సహాయం చేసే భగవంతుడిగా స్థిరపడిపోయాడు...!!
1.రామనామాన్ని రామకథను శ్రద్ధతో ఆలకించేవారిలో ప్రపథముడు హనుమంతుడు...
2.రామనామవైభవాన్ని, రామకథను, శృతిశుభగంగా ఆలపించేవారిలో ప్రపథముడు నవవ్యాకరణపండితుడు హనుమంతుడు...
3.నిరంతరం బాహ్యాంతర రామనామస్మరణలో అంజనిసుతునికి అన్యులెవరు సాటిరాగలరు...?
4.రామయ్య పాదద్వయమే తన హృదయపీఠాన నిలిపిన రామబంటుకి కలరే సాటి కలనైనన్ ...?
5.ఋగ్సామయజురథర్వణాల నిగమసారాన్ని తన జిహ్వాగ్రమున నిలిపి సీతారాములను, పవనసూతి అర్చించినట్టు ఇంకెవ్వరికైనా సాధ్యమా...?
'6.పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం..." అన్నప్పుడు, అక్కడ మారుతి చేసినంత హుందాగా రాములవారికి వందనం ఎవరు చేయగలరు..?
7.రామాలింగన సౌఖ్యన్ని పొంది, నిన్ను మించిన సఖుడు నాకెవ్వరు కలరు....? అంటూ సాక్షాత్ శ్రీరాములవారే చిరంజీవిత్వాన్ని భవిష్యద్బ్రహ్మత్వాన్ని హనుమకు ప్రసాదించడం అందరికి తెలిసిందే...!
8.హనుమ హృదయకవాటాల్లో హ్రీం బీజశక్తి స్వరూపంగా కొలువైన సీతారాములకు, మారుతి ఎప్పుడూ తనను తాను ఆత్మనివేదనం కావించడం కద్దు..!

అందుకే అన్నమాచార్యులవారు, హనుమను తమ కీర్తనంలో "త్రిజగములలోపల దేవతా సంఘముల లోన అజుని పట్టాన నిల్చె హనుమంతుడు.." అని కీర్తించారు..!

No comments:
Post a Comment