కొన్ని కోట్ల హృదయాలను పరోక్షంగా, కొన్ని లక్షల మందిని ప్రత్యక్షంగా, అపర శారదా స్వరూపులై శాసించగలగడం, వారి సద్వాక్కులు, శ్రోతల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసి వారికి సకల యోగక్షేమాలను సమకూర్చడం, కుల మత వర్గ వర్ణాది భేదాలు లేకుండా, అధ్యాత్మ జిగ్ఞ్యాస అనే ఒకే ఒక అర్హతను గుర్తించి, ఎనలేని కరుణారససాగారాల్లో భక్తుల మానస హంసలను మునకలు వేయించడం, కేవల మానవమాత్రులకు అసాధ్యం...శ్రీ చాగంటి సద్గురువుగారు, ఈ నవయుగపు ప్రాగ్పశ్చిమాలను అనుసంధానం చేస్తు, అనాడూ స్వామి వివేకానంద చెప్పినట్టుగా, "శ్రీమద్ రామాయణ భారత భాగవతాది పురాణేతిహాసాలు, కేవల పుస్తకానికి పరిమితమైననాడు, ఎందుకు పనికిరావని, వాటిని సరైన మార్గాన మానవాళికి అందించగలిగిన సద్గురుగువులు ఉన్నప్పుడే, వాటికి మనకు సార్థకత చేకురుతుంది..."
అలాంటి నిరుపమాన సద్గురువుల స్థాయిలో నిలిచి, ఎల్లరికి ఆధ్యాత్మిక ఆపద్బాంధవులై మనగలగడం, " మాధవ రూపం లో ఉన్న మానవులకే " సాధ్యం..!!
అస్మద్ గురుభ్యో నమః ! అస్మద్ గురు పాదుకాభ్యాం నమః !! 

No comments:
Post a Comment