" ఓ శ్రీ వేంకటేశ్వరా, కలియుగ ప్రత్యక్ష దైవమా, రాముడిగా నవ్వుతూ, కృష్ణుడిగా నవ్విస్తూ, మోహిని గా కవ్విస్తూ,
ఎక్కడెక్కడో ఉన్న నీ శ్రీపాద శరణాగతులందరితో నీ నామ సంబంధంతో ఎంతో ఆత్మీయ బంధాన్ని కల్పిస్తూ, చిత్ర విచిత్రంగా నీ లీలలు సాగిస్తున్నవాడవు, అసలు నువ్వెవరివి స్వామి ...? "

అని, మొన్న కాకినాడ లో, శ్రీ చాగంటి సద్గురువుగారి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాంతర్గత, హేమలంబ మార్గశిర ఆఖరి స్థిరవార మహా పుష్పార్చన రోజు స్వామిని ఒక భావనాత్మక ప్రశ్నగా అడిగినప్పుడు, పరిప్రశ్న గా లభించిన పరమాత్ముని సమాధానం....
( ఆపాద శ్రీవత్సవక్షసపర్యంతం అర్చించి అలంకరించబడిన ఆ సౌకుమార్య సౌగంధికలు పేర్చబడిన వైనం వర్ణించనలవి కానిది...!
)

" నీ గురు సన్నిధిని ఆలంబనగా చేసుకొని ప్రశ్నించావు కాబట్టి, ఇదిగో నా సమాధానం....
అద్వయమైన ఒకే ఒక 1 పరతత్వంగా ఉంటూ, జీవుడు దేవుడు అనే ఉపాధి ద్వయాన్ని 2 సృజించి, భూత వర్తమాన భవిష్యత్ అనే 3 త్రికాల పేకమేడలు కడుతూ, అపౌరుషేయ 4 చతుర్ వేదాలనే నా ఉనికి / ఊపిరి గా చేసుకొని, 5 పంచ భూతాలను నా పనిముట్లుగా చేసుకొని, 6 షడృతువులను నా ఆహార్యంగా చేసి, 7 సప్త స్వరాత్మకమైన సామ గాంధార విద్యల ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తపరుచుకుంటూ, శేషశైల గరుడాచల అంజనాద్రి వేంకటాద్రి నారయణాద్రి వృషభాద్రి వృషాద్రి అనే 7 కొండలను నా శాశ్వత ఆవాసంగా చేసుకొని, 7 సప్త మాతృకలతో, 8 అష్టవసువులతో, 9 నవ గ్రహాలతో, 10 దశదిక్కులను (అధోఊర్ధ్వములను కలిపి), 11 ఏకాదశ రుద్రులతో, 12 ద్వాదశాదిత్యులతో, పరిమిత మానవ మేధో పరిధికి కొంతైనా అందని కొన్ని కోటానుకోట్ల జీవులను / బ్రహ్మాండాలను లీలగా, సృష్టించి స్థితిపరిచి లయించి వేసే, గోలోక స్థిత రాధిక మనోవిహారి అయిన రసేశ్వరుడను....!!!

అర్ధం కాదు , కుదరదు అని అంటావా... ? అయితే, నువ్వు భావించే ఆ కొంటె కృష్ణుడను అనుకొని అలాగే ఆనందించు... అదియే సరి..." అని ముగించాడు ఆ వెన్నముచ్చు...
అన్నమాచార్యుల భావనలో చెప్పాలంటే...
"అణురేణు పరిపూర్ణమైన రూపము , అణిమాదిసిరి అంజనాద్రిమీది రూపము
వేదాంతవేత్తలెల్ల వెదకేటిరూపము , ఆదినంత్యము లేని యారూపము
పాదుగ యోగీంద్రులు భావించురూపము , యీదెస నిదివో కోనేటిదరి రూపము...! "

No comments:
Post a Comment