శ్రీ చాగంటి సద్గురువుగారి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవ విశేషాలు... 
అది పవిత్ర హేవిళంబి (హేమలంబ) చాంద్ర మార్గశిర మరియు సౌర ధనుర్మాస సంధికాలం...!
కాకినాడ భానుగుడి జంక్షన్ అయ్యప్ప దేవాలయ ప్రాంగణం, తిరుమల లో శ్రీ వేంకటేశ్వరస్వామికి జరిగినట్టుగా, వివిధ నిత్యోత్సవ వారోత్సవ సేవలతో కోలాహలంగా ఉన్న సమయం...అక్కడ జరిగే అత్యంత వైదిక సశాస్త్రీయ అర్చా ఆరాధనా విధానానికి, సద్గురు పాదపద్మస్పర్శతో నిత్యం త్రివేణి సంగమ సమ పునీతమైన ఆ పరిసరాలకు,
కర్త / కర్మ / క్రియా అన్నీ ఈశ్వరుడే అనే సర్వోన్నతమైన శరణాగతితో కూడిన జీవన విధానముననుసరించే సనాతన ధర్మావలంబకులు / భక్త భాగవతజనము, వివిధ చోట్ల నుండి విచ్చేసి, ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆరాటంతో ఎదురు చూస్తున్న భృగువార పూరాభిషేక ఘడియలు అవి...
సుగంధ పరిమళభరిత ద్రవ్యాలను అలదుకొని, తెల్లటి స్నానశాటి ఒకటి కట్టుకొని బోసి నవ్వులు ఒలకపోస్తూ,
ఆహ్నికోత్సవ ధృవ మూర్తిగా ప్రతిష్ఠాపన గావించబడిన స్వామి, తన తిరుమేని పైనుండి సోయగంగా జాలువారే గోక్షీర, దధి, ఘృత, మధు, ఇత్యాదులతో అభిషేకించబడుతున్న తనని చూడడానికి వచ్చిన వారందరిని, మీనాక్షి తత్వంతో తేరిపారా చూస్తూ, శ్రీవత్స చిహ్న భూషితుడై, వనమాలా విరాజితుడై, వైకుంఠ కటి హస్త విరాజమానుడై, 'బలం విష్ణోహో ప్రవర్థతాం' అంటూ తనను నిత్యం గోవింద మాధవ కేశవాది నామాలతో, స్మరణ మనన నిధిద్యాసాదులతో సేవించే వారికి,
పరవ్యూహవిభవార్చాంతర్యామి రూపాత్మకంగా, 5 రకాలుగా తన ఉనికిని నిత్యం వ్యక్తపరిచే పరమాత్మ ఎంతగానో సంతసిస్తున్న సందర్భం అది....

మనలోనే అణువణువునా అంతర్యామిగా కొలువైఉన్న పరమత్మాను గుర్తించడానికి తగిన అధ్యాత్మ సాధన ఎవరెవరు సాగిస్తున్నారో, వారికి తగువిధంగా సద్గురువుల బోధలను, ఆచార్య సద్ వాక్కులను ఆధారంగా కల్పిస్తూ, వారికి ఎదురయ్యే త్రివిధతాపాలను పరిహరించమని తన చక్రత్తాళ్వార్ ని ( సుదర్శనున్ని ) ఆదేశిస్తూ, తన వైష్ణవమాయా విలాసాన్ని కొనసాగిస్తున్న మాధవుడు, చిరునవ్వులు చిందిస్తూ, వేదఘనాపాటీలచే ఆమ్నాయం కావించబడుతున్న, శృతిశుభగమైన ఉదాత్త అనుదాత్త స్వరిత సంగమ భరిత వివిధ ఘనజటలను చెవులు రిక్కించి వింటూ, తద్ అనుగుణంగా తన ధృవమూర్తిలోనికి జీవ శక్తిని ఆవహింపచేసుకుంటూ, వైకుంఠప్రాకారాల్లోని తన నిత్యసూరులు వారి వారి ఇచ్చా రూపాలను స్వీకరించి వచ్చి తన సేవలను తిలకించేలా చేస్తూ, ఇలా ఆ ప్రాంగణాన్ని తత్కాల భూవైకుంఠంగా మార్చి, శరాణగతుల ఈప్సితాలను ఈడేరుస్తూ... ఆనందనిలయుడు అందరివాడు, ఆర్తితో ప్రార్ధించినవారిని అక్కున చేర్చుకుంటూ "అనాథనాథో దీనబంధో రాధే గోవిందా...." అనే తన సార్ధక నామధేయవైభవన్ని ఎల్లరికి ప్రతినిత్యం చాటిచెప్పే ఆ తుంటరి తిరువేంకట కృష్ణున్ని అన్నమాచార్యుల మాటల్లో సరిగ్గా వర్ణించాలంటే....
ప|| చేరి కొల్వరో ఈతడు శ్రీదేవుడు |
యీ రీతి శ్రీ వేంకటాద్రి నిరవైన దేవుడు ||
యీ రీతి శ్రీ వేంకటాద్రి నిరవైన దేవుడు ||
హరి బోల్...హరి బోల్...హరి బోల్...!!! 

No comments:
Post a Comment