Tuesday, September 25, 2018

శ్రీవేంకట నృసింహం యోగముద్ర - హిరణ్యకశిపుని వధ ...

నేను ఒక చికిత్స నిమిత్తమై పొద్దున్నే దంతవైద్యుని దెగ్గరికివెళ్ళి వచ్చి, అలా కాసేపువిశ్రమించి, అసురసంధ్య వేళకి మా మామ్మయ్యగారి ఇంటిమేడపైకెక్కి కూర్చొని అస్మద్ గురుదేవుల సంపూర్ణభాగవత ప్రవచనాంతర్గతంగా ప్రహ్లాదోపాఖ్యానం వింటున్న సమయం...
సాయంసంధ్య వరకు వేడి, ఉక్కపోత, చెమటతో యధావిధిగా వేసవి తాపం తన ప్రతాపం చూపుతుండగా, ఇంకా అధికజ్యేష్ఠం, జ్యేష్ఠం, ఆషాఢం అవ్వనేలేదు...కాని ఆకాశం అంతా ఒక్కసారిగా దట్టమైన మేఘావృతమై ఉరుములు, మెరుపులు, జడివాన తో ఒక్కసారిగా ఇది శ్రావణభాద్రపదమా ఏమో అన్నట్టుగా మారిపోవడం ఇవాళ భాగ్యనగరవాసులందరికి ఒక విచిత్ర అనుభవంతో కూడిన చక్కని వేసవితాపోపశమనం...!
చిత్ర విచిత్ర వరాలను పొంది లోకకంటకుడైన హిరణ్యకశిపుని వధకు, ప్రహ్లాదుని వచనానుసారంగా అంతే విచిత్రంగా శ్రీహరి స్తంభం నుండి బయల్వడి వాడిని చీల్చిచెండాతున్న ఘట్టాన్ని అందులో వర్ణిస్తునట్టుగా, ఆ ఉరుముల్లో, మెరుపుల్లో, తిరుమల ఆలయంలో ఈశాన్యాన యోగముద్రలో కూర్చున్న శ్రీవేంకట నృసింహం ఒక్కసారిగా లేచివచ్చి వినువీధిలో ఆ ఘట్టాన్ని ప్రదర్శిస్తున్నాడా ఏమి అన్నట్టుగా ఆకాశపు అంచులు చలనచిత్ర తెరగా మారి స్వామి వైభవానికి అవని ఆకాశాలు ఏకమై చేస్తున్న వివిధవర్ణవిన్యాసంలా అనిపించింది నాకు ఆ ఖేచరదృశ్యమాలిక...!! 

https://www.facebook.com/Vinay.Aitha/posts/10214583027422754

No comments:

Post a Comment