"ఆదిమూలమే మాకునంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష ...
.
సాధించి శ్రీవేంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సాదరము మీరినట్టి సర్వరక్ష..."
.
సాధించి శ్రీవేంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సాదరము మీరినట్టి సర్వరక్ష..."
అనే సంకీర్తనలో, అన్నమాచార్యులవారు శ్రీవేంకటపతియొక్క సర్వ సాక్షిత్వాన్ని సర్వ వ్యాపకత్వాన్ని సర్వకాలసర్వావస్థల్లోని చైతన్య స్వరూపమై భాసించే సర్వాంతర్యామిత్వాన్ని ప్రస్ఫుటంగా విశదీకరిస్తూ, పరవ్యూహవిభవార్చాంతర్యామియై పంచవ్యూహాత్మకంగా పరిఢవిల్లే పరమాత్మ, పంచభూతాత్మకమైన ప్రకృత్రి తో తన సత్ చిత్ ఆనంద మైన స్వస్వరూపానుసంధానాన్ని గావించి జీవులకు సంరక్షణ కలిగించేవైనాన్ని ప్రస్తుతించడం కడు ఆశ్చర్యానందదాయకం...!
చివరి చరణంలోని మకుటానికి వచ్చేసరికి, మరింత ఆశ్చర్యంగా శ్రీవేంకటనగమును మనకోసం సాధించి నిలిచిన ఆ సర్వేశ్వరుడు, సకల ఆదరములను మించినట్టి సాదరమైన సర్వోన్నతమైన రక్ష అని ప్రపన్నులందరికి తమ సంకీర్తనానంతర్భాగంగా అభయాన్ని ప్రసాదిస్తూ, స్వామి అల్లంత కొండపైనే కాదు, ఎల్లప్పుడూ కూతవేటు దూరంలోనే ఉంటాడని రూఢిపరిచారు మన పదకవితాపితామహులు...! 
No comments:
Post a Comment