సమాజంలో అత్యంత శక్తివంతంగా తమ వాక్కుల ద్వారా శిష్యుల హృదయసామ్రాజ్యాలను ఏలుతున్న సద్గురువులను గుర్తించి వారికి ఏకలవ్యశిష్యులై ధర్మార్ధకామమోక్షములనే చతుర్విధ పురుషార్ధాలను గడించడం అందరి విహితధర్మం.
చాలమందికి అలాంటి వారిని గుర్తించడం ఎలాగో తెలియక సతమవుతూ,
ఇంతమంది 'స్వామీజీలూ , ' బాబాలు ' వేషం కట్టి భక్తిని భుక్తికొరకు బూటకంగా మార్చుతున్నసందర్భంలో ఏ విధంగా పరమహంసలను గుర్తించి వారిని
అంతగా నమ్మేసి దైనందిన మనోగురుపీఠంపై నిలపడం అని అంటే....
ఇంతమంది 'స్వామీజీలూ , ' బాబాలు ' వేషం కట్టి భక్తిని భుక్తికొరకు బూటకంగా మార్చుతున్నసందర్భంలో ఏ విధంగా పరమహంసలను గుర్తించి వారిని
అంతగా నమ్మేసి దైనందిన మనోగురుపీఠంపై నిలపడం అని అంటే....
కేవలం కొన్ని విషయాలు పరికిస్తే చాలు....
వారు తమ గురువుల గురించి, శ్రీ ఆదిశంకరాచార్యులచే అనుగ్రహించబడిన పురి, శృంగేరి, కంచి, ద్వారక, బదరి, పీఠాల్లోని ఏదేని జగద్గురువులకు, వారి వైభవానికి, వారి అనుగ్రహ పాత్రతకు, తమ శిష్యపరమాణువులకు అనుసంధానకర్తగా ఉండడం.....

మరియు ఇతర సదాచార సంపన్నులైన వివిధ విశ్వాసాలకు చెందిన యతిపురుషులు, సాధువరేణ్యులు, పీఠాధిపతులు వారియొక్క జ్ఞ్యాన ప్రచారంలో ఒక భాగమై ఉండడం..
వ్యాసవాల్మీకశుకశౌనకాది పురాణపురుషులు, శ్రీమధ్వాచార్యులు, శ్రీరామానుజాచార్యులు, పోతనామాత్యులు, సద్గురుత్యాగరాయులు, శ్రీ ముత్తుస్వామిదీక్షితర్, శ్రీశ్యామశాస్త్రి,
అన్నమాచార్యులు, శ్రీరామదాసు, శ్రీతులసిదాస్, శ్రీకబీర్దాస్, శ్రీసూరదాసాది వరిష్ఠులు, ఇత్యాది మహనీయుల చరిత్రలు వారి జ్ఞ్యానప్రచారాంతర్భాగములై ఉండడం....
అన్నమాచార్యులు, శ్రీరామదాసు, శ్రీతులసిదాస్, శ్రీకబీర్దాస్, శ్రీసూరదాసాది వరిష్ఠులు, ఇత్యాది మహనీయుల చరిత్రలు వారి జ్ఞ్యానప్రచారాంతర్భాగములై ఉండడం....
మరియు తమ వ్యక్తిగత కుటుంబనేపథ్యం పరిమితపరిధిలో సమాజాభిముఖం కావించడం..
సరిగ్గా గమనిస్తే ఇవ్వాళ సమాజంలో వందల వేల సంఖ్యల్లో ఉన్న స్వామీజీలు, బాబాజీలు, గురుజీలు, సన్యాసిజీలు,
ఎంతమంది ఈ విధంగా ధర్మతత్పరులై ఉన్నారో పరికిస్తే చాలు....
ఎంతమంది ఈ విధంగా ధర్మతత్పరులై ఉన్నారో పరికిస్తే చాలు....
శ్రీ చాగంటి సద్గురువుగారి మాటల్లో చెప్పాలంటే "ఇంటగెలిచి రచ్చగెలుచుట...." అనేపెద్దల నానుడికి సరితూగే వారిని సరైనవారని భావించడం సర్వశ్రేయస్కరం...!
😊
శ్రీ గురుభ్యోనమః... శ్రీ గురుపాదుకాభ్యాం నమః.....
🙏
https://www.facebook.com/Vinay.Aitha/posts/10215059441852817
No comments:
Post a Comment