"శబరిమల అయ్యప్ప ఆలయం లోకి బాలికలు, వయోవృద్దులు కాని మహిళామణులకు ప్రవేశం నిషిద్ధం...."
దేశంలో ఎంతో మంది కొందరు so called modern erudite social activists / reformists, and other highly educated illiterates, ఒక సంఘం గా ఏర్పడి ఈ విషయాన్ని అనవసరమైన రాద్ధాంతం చేస్తు, అత్యంత కట్టుదిట్టమైన శబరిమల సంప్రదాయిక ఆచార వ్యవహారాలను, కర్మకాండకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చే కేరళీయ అర్చారాధనా విధానాలను సవాల్ చేస్తు దేశ అత్యున్నత న్యాయస్థానానికి ట్రవన్ కోర్ దేవాస్వం బోర్డ్ సంజాయిషి ఇచ్చుకునే స్థాయికి తమ మూర్ఖత్వాన్ని తీసుకేళ్ళడం ఎంతో శోచనీయం..!
తమ వాక్పటిమచేత వాదప్రతివాదాలకు, అభియోగ సంజాయిషీలకు, కలియుగ దైవసన్నిధానాధీషుడైన అయ్యప్పను సైతం జవాబుచెప్పుకొనేలా చెయ్యగలం అని అనుకునే సంకుచిత కుటిల స్వభావీకులు ఈ క్రింది విషయాలను కూడా తమ సమగ్రమైన అలోచనాసరళిలోకి తీసుకోవడం అత్యంత ఆవశ్యకం...
1. ఒక పెద్ద అధికారో లేదా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రో, ఎదైనా పూజామందిరం, మస్జిద్, చర్చి, గురుద్వార, ఇత్యాదుల్లో ఉండి తమ వ్యక్తిగత ప్రార్థనలు జరిపే సమయంలో, వారికి ఇబ్బంది కలిగించేలా ఎవైనా వస్తువులనో, వార్తలనో తీసుకెళ్ళడం, మరేవిధంగానైనా వారి శాంతికి భంగం కలిగించడం గొప్ప పని అనిపించుకుంటుందా లేదా వారిని అగౌరవపరిచి వారి ఇష్టాయిష్టాలకి భిన్నంగా ప్రవర్తించి వారి ఆగ్రహానికి గురికావడం అవుతుందా..?
2. మన ఇంటి పెద్ద అత్యవసర వైద్యనిమిత్తమై హాస్పిటల్ లో ఉన్నప్పుడు, ఇంటికి బంధువులువచ్చారనో, వచ్చే పండక్కి ఏం ఏం కొనిస్తారనో, మీ ఆస్తి ఎప్పుడు మా పేర రాసి మమ్మల్ని అనుగ్రహిస్తారనో ఇబ్బంది పెట్టడం, వ్యక్తిగత హక్కులను సాధించుకోవడం అవుతుందా లేక మన మూర్ఖత్వానికి నిదర్శనమా ?
3. ఒక సిమ్హం/ పులి గుహలోకి వెళ్ళి, బయట వర్షంపడుతుంది... అడవి అందరిది కాబట్టి మేము కూడా ఇదే గుహలో సేదతీరుతాం అనడం, సమానహక్కులను సాధించుకోవడం అంటారా లేదా కుందేళ్ళ తెంపరితనానికి కొలమానం అంటారా ?
మహిషి సమ్హారానికై హరిహర తేజస్సులు ఏకమై భువిపైకి వచ్చి, పరశురాముడు తన గొడ్డలిని సముద్రానికి ఉత్తరంగా విసిరి అంత మేర సముద్రుణ్ణి పశ్చిమంవైపు వెనక్కి జరగమని తనకు తపోభూమిగా ఆర్జించుకున్న పవిత్ర కేరళ తీరస్థలాన్ని, ధర్మశాస్త ఎంచుకొని తన తీర్థస్థలంగా చేసి, కఠిన నియమాలతో మండల పూజలు చేసి ఎంతో కష్టమైన కాలినడకను ప్రయాణించి తన సన్నిధికి విచ్చేసి , "పదునెట్టాంపడి అధిపతియే శరణమయ్యప్ప..." అంటూ తన శరణుఘోషతో, దేవతలకు ఉషోదయమైన మార్గశిర, సూర్యనారయణుడి దివ్య రథం ఉత్తరదిశగా సాగే మకరసంక్రమణం వచ్చే పుష్య మాసాల్లో మాత్రమే తన దైవిక శరప్రయోగంచే ఏర్పడ్డ 18 మెట్ట్లను అధిరోహించి యోగపట్టవిరాజితుడిగా ఉన్న తన దర్శనంతో, పాపపంకిలమైన కలియుగ ధాటికి సతమతవుతున్న భక్తులను రక్షించడానికి, స్వయంగా తానే విధించిన నియామావళిని ప్రశ్నించడం మనకు ఏపాటి ఉచితం / క్షేమకరం ?
శబరిమల కాకుండా, కేరళ / లేదా ఇతర ప్రదేశాలలో ఉన్న తన ఆలయాల్లోకి మహిళామణులను రావద్దని అయ్యప్ప నిషేధించలేదే ?
ఒక స్త్రీమూర్తి శరీర సహజ లక్షణంచే కొన్ని రోజులు దైవిక క్రియలకు దూరం ఉండాలనే శాస్త్ర నిబంధన, కాయిక వాచిక మానసికమైన త్రివిధ శౌచంతో, బ్రహ్మచర్యంతో, అత్యంత పవిత్రంగా సాగిన అయప్ప స్వాముల మండల దీక్షలను పరిపూర్ణమయ్యేలా చేసి వారికి కలికాలపు ఇక్కట్లనుండి తక్షణ స్వాంతన చేకూర్చి కాపాడుటకు, సంవత్సరంలోని మిగతా రోజులన్ని మానవులకు ప్రవేశం లేని తన ఆలయం లో, నిరంతరం దేవతలచే ఆరాధింపబడి అమేయ శక్తి సంపన్నుడయ్యే హరి హర సుతునకు, మన లౌకిక నియమాలను ఆపాదించి, హక్కులు / సమన్యాయం / అంటూ ప్రపంచంలోనే అద్వితీయమైన క్షేత్ర ప్రాభవాన్ని కించపరిచేలా ప్రవర్తించాలనుకోవడం విజ్ఞ్యానం అనిపించుకుంటుందా ?
ఒక పెద్ద కుండలోని లీటర్ల కొద్దిపాలు విరిగిపోవడానికి ఒక్క ఉప్పు రవ్వ చాలు....
ఒక పెద్ద భవనం వీగిపోవడానికి పునాదిలోని ఒక చిన్న కంపనం చాలు...
ఒక పెద్ద రాజకీయదిట్ట ఓడిపోవడానికి ఒక్క అవాంఛనీయవోటు చాలు....
ఒక పెద్ద భవనం వీగిపోవడానికి పునాదిలోని ఒక చిన్న కంపనం చాలు...
ఒక పెద్ద రాజకీయదిట్ట ఓడిపోవడానికి ఒక్క అవాంఛనీయవోటు చాలు....
అలాగే ఒక గొప్ప పుణ్యక్షేత్ర పవిత్రత శతాబ్దాల పాటు పటిష్ఠంగా ఉండడానికి ఒక నియమం ఖచ్చితంగా పాటించాలి అన్నప్పుడు, అది కాదు కూడదని తద్విరుద్ధంగా వెళ్ళి సాధించేది ఏముంటుంది ?
ఒక వ్యక్తి కష్టపడి ఒక పెద్ద ఇల్లు శాస్త్రబద్దంగా కట్టిస్తే, ఆ ఇంటి వారందరూ కూడా అందులో సుఖసంతోషాలతో ఉంటారు కదా...
ఒక సంస్థలోని ఉద్యోగి మంచి పేరుతెచ్చుకుంటే అది ఆ సంస్థ మొత్తానికి మంచి పేరు వచ్చినట్టే కదా...
అదేవిధంగా, ఒక ఇంట్లోని వ్యక్తి కఠిన మండలదీక్షతో అయ్యప్పని ఆరాధించి, శబరిమల యాత్రని పరిపూర్ణం చేసుకుంటే అది ఆ ఇంటివారందరికి ఫలితం లభించినట్టే కదా...
ఒక సంస్థలోని ఉద్యోగి మంచి పేరుతెచ్చుకుంటే అది ఆ సంస్థ మొత్తానికి మంచి పేరు వచ్చినట్టే కదా...
అదేవిధంగా, ఒక ఇంట్లోని వ్యక్తి కఠిన మండలదీక్షతో అయ్యప్పని ఆరాధించి, శబరిమల యాత్రని పరిపూర్ణం చేసుకుంటే అది ఆ ఇంటివారందరికి ఫలితం లభించినట్టే కదా...
మరి ఎందుకు అనవసరమైన సిద్ధాంతాలతో, అపరిపక్వ ఆలోచనలతో, అసంబద్దమైన వాదాలతో, పరిమిత మానవ మేధకు అపరిమిత శక్తిసంపన్నమైన దైవసాన్నిధ్య నియమనిబంధనలు లోబడి ఉండాలని వాదించడం ?
గతించిన మన పెద్దలకు ఉన్నట్టే,
మనకు ఒక జన్మదినం, కొన్ని సంవత్సరాలు అనే కాలపరిమితి కలిగిన జీవనం, ఒక అంత్యదినం, ఉన్నాయి...
మనకు ఒక జన్మదినం, కొన్ని సంవత్సరాలు అనే కాలపరిమితి కలిగిన జీవనం, ఒక అంత్యదినం, ఉన్నాయి...
చిరంతనమైన నమ్మకానికి / విశ్వాసానికి / అలౌకికమైన దైవానికి అవి ఉండవనే విషయం తెలిసి కూడా,
తద్సంబంధ నియమావళిని ఒక నియమిత పరిధిలోకి తీసుకువచ్చి ఏదో సాధించేస్తాం అనుకోవడం కంటే, ఎంతో కోల్పోవడమే అని తెలుసుకోవడంలోనే ఔన్నత్యం ఉందని గ్రహించడం కనీస మానవ ధర్మం...!
తద్సంబంధ నియమావళిని ఒక నియమిత పరిధిలోకి తీసుకువచ్చి ఏదో సాధించేస్తాం అనుకోవడం కంటే, ఎంతో కోల్పోవడమే అని తెలుసుకోవడంలోనే ఔన్నత్యం ఉందని గ్రహించడం కనీస మానవ ధర్మం...!
సర్వే జనాః సుజనాభవంతు....సర్వే సుజనాః సుఖినో భవంతు...!!
అనే పెద్దల నానుడి ఈ కాలంలో ఎంతో ఆవశ్యకం..!!!
అనే పెద్దల నానుడి ఈ కాలంలో ఎంతో ఆవశ్యకం..!!!
https://www.facebook.com/Vinay.Aitha/posts/10215054356925697

No comments:
Post a Comment