Tuesday, September 25, 2018

యజ్ఞ్యో వై విష్ణుః...!

యజ్ఞ్యో వై విష్ణుః...!
ఎప్పుడైనా ఎక్కడైనా ఆలయంలో, హోమం, యజ్ఞ్యం లాంటి వైదికక్రతువులు జరిగినప్పుడు, మన పెద్దలు / గురువులు / ఆచార్యులు / చెప్పేదానిప్రకారంగా, అక్కడ అగ్నిముఖంగా ఆయా దేవతలకు హవిస్సులు అందజేయబడతాయి అని...
వాళ్ళు ప్రీతిచెందితే త్రికరణశుద్దితో మనసులోనే నమస్కరించినవారికి దర్శనంకూడా ప్రసాదిస్తారని...
మనం, 'ఆదిపురుషాయ విద్మహే అలర్మేల్మంగనాధాయ ధీమహి తన్నహ్ శ్రీనివాసః ప్రచోదయాత్ ' అంటూ నమస్కరిస్తూ ఉన్నప్పుడు , అటుగా వచ్చినగాలి వాటానికి హోమవేదిలోని ఆ అగ్నిశిఖ త్రికోణాంతరసవ్యంగా తిరుగుతూ తిరునామాలుగా దర్శనమిచ్చినప్పుడు ఆ అనలుడే శ్రీ వేంకటేశ్వర స్వామి...!
మనం, 'కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నహ్ దుర్గిః ప్రచోదయాత్ 'అంటూ నమస్కరిస్తూ ఉన్నప్పుడు, ఊర్ధ్వ ముఖంగా ఆ శిఖ కాస్త అమ్మవారి చేతిలోని త్రిశూలంగా మారినప్పుడు, ఆ అనలుడే కనకదుర్గమ్మ ...!
(నేడు శరన్నవరాత్ర మొదటి రోజు, ' స్వర్ణకవచాలంకృత దుర్గమ్మ ' గా ఉండి ఆ ఇంద్రకీలాద్రిపై మందస్మితయై మనందరి దురితాలను దూరంచేసే దయామయిగా కొలువైఉంది... )
అందుకే అన్నమాచార్యులవారు స్వామిని, " వేదాంతనిలయా వివిధాచరణ ఆదిదేవా శ్రీవేంకటాచలేశ.. సోదించి తలచినచోట నీ వుందువట యేదెస నీ మహిమ యిదేటిదయ్యా" , అంటూ కీర్తించారు ...! 

No comments:

Post a Comment