బతుకమ్మ పండుగ సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా మహిళామణులకు ప్రభుత్వం పంచిపెట్టే చీరల్లో ' నాణ్యత ' లేదని రోడ్లపైకి తెచ్చి వాటిని తగులపెట్టి నిరసన తెలియచేస్తున్నారు కొందరు ' గొప్ప సంఘసంస్కర్తలు ' ....
లజ్జలవలేశమైన లేకుండా చేసే ఇలాంటి పనులవల్ల వారికి లభించేది ఏంటనే ఆలోచన అసలు ఆవగింజంతైనా ఉందోలేదో మరి...
అంచుతో మెరిసే ప్రతి వస్త్రంలో, అది ధోవతి, కండువ, చీర, ఎదైనాసరే, అందులో దేవతానుగ్రహం ఉండి ఇచ్చిన వారికి, పుచ్చుకున్న వారికి ఆయుర్ వృద్ది కలుగచేస్తుందని ఆర్యోక్తి... అలాంటి వస్తువులను అగ్గిపాలు చేసిన వారి వంశాలు ఎమవుతాయో ఆలోచించుకోవాలి మరి వారు..
అది వోట్ల కోసమో, లేద ఇంకేదైనా స్వలాభం కోసమో అని అనుకుంటే, నిరసన తెలియచేయడానికి ఎన్ని మార్గాలు లేవు... మరీ ఇంత సంకుచిత హీనత్వంతోనా భావస్వతంత్రత తెలిపేది..!
రాష్ట్ర పండుగలైన రంజాన్ కి ప్రభుత్వం ఈద్-ముబారక్ అంటూ బట్టలు / సేమియా పాకెట్ల తాయిలాలు పంచిపెట్టినప్పుడు లేని నిసరనలు, క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ కానుకలు పంచిపెట్టినప్పుడు లేని నిసరనలు, ఇప్పటికిప్పుడు తెలంగాణ గ్రామీణ / హైందవ సంస్కృతికి సంప్రదాయానికి గుర్తుగా, అంటూ చీరలు పంచిపెట్టినప్పుడు ఎందుకు గుర్తొస్తాయో ఏమో ఈ దేశద్రోహులకు...!
తిరుమలకు వెళ్ళి, వి.అయి.పి లకు పెద్ద గట్టి దిట్టపు లడ్డులూ, మాకు చిన్న సన్నదిట్టపు లడ్డులూ పంచుతున్నారని, ఏవరైనా వాటిని ' నాణ్యతా లోపం ' అంటూ నసగడం
ఎంతవరకు సబబో ఇది కూడా అంతే....
ఎంతవరకు సబబో ఇది కూడా అంతే....
( ఉచితానుచితములు / ఔచిత్యం అనేవి తెలుసుకొని ఉండడం పెద్దల కనీస లక్షణం. లక్షల మందిని, ఆడపడుచులుగా భావించి అందరికి ప్రభుత్వం కంచి పట్టు చీరలు పెడ్తుందనుకోవడం, ఆశ అత్యాశ దురాశ కు అవతల ఇంక ఎమైనా ఉంటే అదవుతుందేమో...
]
No comments:
Post a Comment