'AthruptyamrutaRoopaaya...'. rightly describes what he can be probably described as....
😊
Patanjali Tadepalli
శ్రీ వేంకటేశ మంగళాశాసనము 07వశ్లో ప్రతిపదార్థ,
తాత్పర్యములు-16-09-2017
ఆకాల తత్త్వ మశ్రాంత మాత్మనా మనుపశ్యతామ్
అతృప్త్యమృత రూపాయ వేంకటేశాయ మంగళమ్.
టీక
ఆకాల తత్త్వమ్= కాలతత్త్వము ఉండు వరకు
అశ్రాంతమ్= ఎప్పుడూ
అనుపశ్యతామ్= దర్శించుచున్న
ఆత్మనామ్ = ప్రాణులకు;
అతృప్త్యమృత రూపాయ= తనివితీరని అమృతస్వరూపుడగు
వేంకటేశాయ = శ్రీ వేంకటేశ్వరునకు
మంగళమ్= మంగళము
(ప్రయుంజే= చేయుచున్నాను.)
తా.
కాలతత్త్వము ఉండు వరకు , ఎల్లపుడును తన దివ్యసుందర
రూపాన్ని చూచుచున్న ప్రాణి కోటికి , తనివితీరని
అమృతస్వరూపుడయిన శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

No comments:
Post a Comment