Tuesday, September 25, 2018

అన్నమయ్య పాటకు పట్టాభిషేకం....

Very useful to practice the rare renditions in SVBC...
అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పాటలకోసం వెదుకగా
కొన్ని, పాటలు తితిదే వారి వెబ్ సైటులో దొరికాయి.
కాని తెలుగు సాహిత్యం దాని వివరాలు లేకపోవడం వల్ల
వాటికై ప్రయత్నించి ఇక్కడ పొందుపరచాను.
అన్నమయ్య పాటకు పట్టాభిషేకం-23
23-02॥పల్లవి॥అరుదు నీచెరిత్రము హరి నే నిదియే తలఁచుకొని
శరణంటిఁ గావు మిదియ విన్నపము సరిలేరు నీకు
॥చ1॥పరగ నీయకారణబంధుత్వ మహల్యయందుఁ గంటిమి
కరియందు నార్తరక్షకత్వము మెరయఁగఁ గంటిమి
అరసి ద్రౌపదియందు నాపదుద్ధారకత్వము గంటిమి
శరణంటెఁ గాచుట ధర విభీషుణునందుఁ గంటిమి
॥చ2॥మును భక్తవత్సలత్వము నీకు శబరియందుఁ గంటిమి
అనాథనాథుడవు నీ వగుట గ్రీవునందుఁ గంటిమి
పెనఁగి నిరుహేతుకప్రేమ పరీక్షితునందుఁ గంటిమి
నినుఁ గింకరాధీనుఁడని ప్రహ్లాదునియందేఁ గంటిమి
॥చ3॥గోవర్ధనమందు సర్వజీవదయాపరత్వము గంటిమి
భావించి సాందీపునందు ప్రతిజ్ఞాపాలకత్వము గంటిమి
దేవ శ్రీవేంకటేశ్వర నీవు ద్రిష్టవరదుఁడవగుట
తావైన నీకొనేటిదండ నొసఁగేయందే కంటిమి(2/321)
23-03॥పల్లవి॥కాదనగవచ్చునా ఘనుఁడ నీతోడిపోందు
యేదైనా నియ్యకొంటె నెక్కుడేకాదా
॥చ1॥నీకు సెలవైతేఁజాలు నీమోహపుసతులకు
చేకొని ప్రియము లెల్లా జెప్పేమయ్యా
యీకడ నాకడ నీకు హితవైతేఁ జాలుఁగాక
మాకేమి వారినేరాలు మరచేవయ్యా
॥చ2॥నట్టనడుమను నీకు నవ్వువచ్చితేజాలు
వొట్టి వారిచేఁతలకు నోరిచేమయ్యా
మట్టుమీర నేఁడు నీమనసు వచ్చితేఁజాలు
గట్టిగా నెంగిలిపొత్తు గలసేమయ్యా
॥చ3॥చక్కఁగ నీకే పొందు సంతోసమైతేఁ జాలు
వొక్కచోట నిద్దరము నుండేమయ్యా
యిక్కువతో శ్రీ వేంకటేశ మమ్ముఁ గూడితివి
చిక్కించుక నీపాదాలసేవ సేసేమయ్యా(18/198)
23-04॥పల్లవి॥సకియకు నీకును సరి పంతంబులు
ప్రకటం బాయ ప్రహ్లాదవరద
॥చ1॥చిక్కనిచెమటల జీరులు వారఁగ
వుక్కుగుబ్బలను వొత్తీఁ జెలి
నిక్కి నీవురము నెలకొని వోర్చెను
చక్కని పెనువజ్రము గాఁబోలును
॥చ2॥కనుఁగవతళుకులు గడువాఁడి మిగుల
కొనచూపులనే కొచ్చీఁ జెలి
గొనకొని నీమేను గురియై నిలిచెను
అనిశము పఁసిడిలోహము గాఁబోలు
॥చ3॥తేనెల పెదవులతీపు నాముకొన
కానుకరతులనుఁ గప్పీఁ జెలి
ఆనుక శ్రీవేంకటాధిప నీగుండె
కోనల సంజీవికొండ గాఁబోలు(16/429)
23-05॥పల్లవి॥చిత్తగించి చూడవయ్య చెలిలాగు
బిత్తరపుజవ్వనము పెచ్చుపెరిగీని
॥చ1॥చెలివీనులజవ్వాది చెక్కులఁ గరఁగి జారీ
వెలి నిన్నుఁ బాసినవిరహానను
మలసిన కోరికలు మతిలోఁ దీఁ గెలువారీ
వలపుల చెమటలవానలను
॥చ2॥వేవేగఁ బెట్టినకొప్పు వెడజారీ మూఁపుమీఁ ద
నీవొద్దికి వచ్చేటి నిబ్బరానను
పూవుల దండలో నిపుప్పొడి దుమ్ములురేఁ గీ
కావరపునిట్టూర్పుల గాలిచేతను
॥చ3॥మునుకొని మొరసీని ముంజేతికంకణములు
తనివార నిన్నుఁ గూడేతమకమున
యెనసితివి శ్రీవేంకటేశ యింతలోనె యీకెను
వినయాన నీకు మొక్కీ వేడుకలను(18/110)
23-06॥పల్లవి॥';నీటముంచు పాలముంచు నీచిత్త మిఁకను
చాటితి నీకృప గురి సంసారమునకు
॥చ1॥హరి నీవే గురి నాయాతుమలోపలికి
అరిది శంఖచక్రాలే యంగపుగురి
పరమపదమే గురి పట్టినవ్రతమునకు
తిరుమంత్రమే గురి దిష్టపునాలికకు
॥చ2॥గోవింద నీపాదపూజే గురి నాదాస్యమునకు
తావుల నాభక్తికి నీదాసులే గురి
ఆవల నాకర్మమున కాచార్యుఁడే గురి
దేవ నీశరణు గురి దిష్టపు జన్మానకు
॥చ3॥నగుశ్రీపతి గురి నన్ను రక్షించుటకును
తగుసంకీర్తన గురి తపమునకు
తెగనిజ్ఞానమునకు తిరుమణులే గురి
మిగుల శ్రీవేంకటేశ మించి నీవే గురి(4/224)
23-07॥పల్లవి॥చూడఁ బిన్నవాఁడు గాని జూటుఁదనాలు తనవి
యేడఁ జూచినాఁ దానే యేమని చెప్పుదునే
॥చ1॥దొంగాడుఁ గృష్ణుఁడు తొయ్యలుల మొగములు
తొంగిచూచీ ముంగురులు దూలాడఁగా
ముంగిట ముద్దులువెట్టి మోవితేనె లానుకొంటా
యెంగిలిసేసి నిదె యిందరి నొక్కమాఁటె
॥చ2॥వెన్నముద్దుకృష్ణుఁడు వేడుకతో జవరాండ్ల-
చన్నులంటి సారె సారె సాముసేసీని
చిన్నిచేతు లటుచాఁచి సిగ్గులురేఁచి చెనకి
సన్నలు సేసి పిలిచి సరసములాడీని
॥చ3॥వుద్దగిరికృష్ణుఁడు వొడిపట్టి మానినుల
అద్దుకొని కాఁగిలించి ఆసలురేఁచీ
వొద్దిక శ్రీవేంకటాద్రి నొనగూడి మాచేఁతలు
సుద్దులుగాఁ జెప్పి చెప్పి సొలసి నవ్వీనే(18/230)
23-08॥పల్లవి॥/ఏమని చెప్పుదునే యిదివో నావలపు
దోమటి మోవితేనెలఁ దొట్టుకొనె వలపు
॥చ1॥తలపోఁతలచేత దట్టమవును వలపు
సొలపులు నెరపితేఁ జుట్టుకొను వలపు
పలుకులఁ గొసరితేఁ బదనెక్కు వలపు
నెలకొని నవ్వితేను నిలుకడౌ వలపు
॥చ2॥చెనకులు గనమైతే చిమ్మిరేఁగు వలపు
తనువుసోఁకులను తగులౌను వలపు
పెనఁగఁగాఁ బెనఁగఁగా బెచ్చురేఁగు వలపు
మనసురా మెలఁ గితే మక్కళించు వలపు
॥చ3॥తప్పక చూచితేనే తలకొను వలపు
ముప్పిరివినయముల ముంచుకొను వలపు
అప్పఁడు శ్రీవేంకటేశుఁ డంతలోనె నన్నుఁ గూడె
చెప్పరానిరతులను చెట్టుకట్టు వలపు(18/228)
23-09॥పల్లవి॥ఇంతిసేసినభాగ్యమో యిట్టిది నీకరుణో
యెంతకెంత చెలులము యేమని పొగడెదము
॥చ1॥తలపోఁతలు రేఁచేవు తగ విడే లిప్పించేవు
నెలతకు నీకొలువు నిధానము
చలివాయ నవ్వేవు చదురఁ(రం)గా లాడేవు
చెలఁగి నీమన్ననలు చిగురులో చేఁగలో
॥చ2॥మొగ మెప్పుడఁ జూచేవు మోహములు చల్లేవు
మగువకు నీ పొందు లామనివంటలు
తగుల మాటలాడేవు తనివి బొందించేవు
వెగటులేనిమేలాలు వెన్నెలపులుఁగాలు
॥చ3॥చన్ను లేపొద్దూ ముట్టేవు సరసములాడేవు
కన్నెకు నీరతి తరగనిధాన్యము
యెన్నఁగ శ్రీ వేంకటేశ యీకె యలమేలుమంగ
యిన్నిటా బోగములు యింటిలోనిసిరులు(18/270)
23-10॥పల్లవి॥ఇంతులాల చూడరమ్మ యెన్నఁ గొ త్తలు
సంతతము నీపె జవ్వనవనమందు
॥చ1॥చెలియమోవినే సింగారము చిగిరించె
అలకల ననలుఁ గొనలు సాగెను
మలసి కరములను మారాకులు వెట్టె
వలపల యీపె జవ్వనవనమందును
॥చ2॥మచ్చికతోడుత మంచిమాటలనే నీడలొ త్తె
పెచ్చు రేఁగి చన్నులను పిందెలు వుట్టె
విచ్చనవిడి నవ్వుల వెన్నెలపంటలు వండె
వచ్చె నామని యీపెజవ్వనవనమందును
॥చ3॥పిఱిఁదిచక్కఁ దనము పెద్ద పెద్దరాసులాయ
కొఱగలతొడలే కొమ్మలాయను
చిఱుఁ జెమటలతోడ శ్రీ వేంకటేశుడు గూడి
వఱలుచు మించె నీజవ్వనవనమందును(18/219)
23-11॥పల్లవి॥ఆ మూరితియే యీ మూరితి అందు నిందు ఖేదము లేదు
సోమర్కనేత్రుఁడ విశ్వరూపములు చూచినవారమే మును నేము
॥చ1॥బలిమితోడ వత్సాపహరణమున బ్రహ్మకు నీ మాయ చూపితివి
విలసిల్లఁగ రణభూమిని నరునకు విశ్వరూప మటు చూపితివి
అలరిన నీ రూపు జలమధ్యంబున ఆక్రూరున కటు చూపితివి
చెలఁగి కుమారస్వామికి నా రూపు శ్రీవేంకటగిరిఁ జూపితివి
॥చ2॥దైవికముగ దుర్యోధను సభను ప్రతాపము నీ రూపు చూపితివి
ఆ విధముననే నీరూపు ముదంకు నా శ్రమమున నీటు చూపితివి
నీవిధ మెఱుఁగని భీష్మకునకు మఱి నిర్మలరూపము చూపితివి
శ్రీవేంకటగిరి నారూపంబే చేరి పరుషలకుఁ జూపితివి
॥చ3॥పుట్టినప్పుడే వసుదేవునకు చతుర్భుజముల నీ రూపు చూపితివి
జట్టిగ గొల్లెతలకు రూపము రా సక్రీడలలోఁ జూపితివి
యిట్టే నారదునకు ద్వారకలొ యింటింట నీ రూపు చూపితివి
పట్టుగ శ్రీవేంకటేవ్వర ఆ రూపమె మాకిప్పుడు చూపితివి(15/441)
పాటలకు లింకు:
TIRUMALA.ORG

No comments:

Post a Comment