Tuesday, September 25, 2018

హరి అను రెండక్షరములు నుడివిన అఖిలవేదములు మంత్రములు...!

"హరి అను రెండక్షరములు నుడివిన అఖిలవేదములు మంత్రములు...గరిమ ధర్మశాస్త్రపురాణాదులు క్రమమున చదివిన పుణ్యములు....
పరమ తపోయోగంబులు మొదలగు బహుసాధనముల సారంబు, పరిపక్వంబై ఫలియించంగా బట్టబయలు వెతకగనేలా..... త్రికరణ శుద్దిగ చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును...."
అని అన్నమాచర్యుల వారు రచించిన ఒక సర్వోత్కృష్టమైన కృతిలోని సారమంతా, పండిత పామరభేదం లేకుండా శ్రీవేంకటహరి శరణాగతులందరికి అర్ధమయ్యేలా సరళవచనామృతం లోకి పెద్ద తిరుమలచార్యులవారు కూర్చిన వైనం కడు రమణీయం.... 
Ponnala Venkatesh RD added a new photo to the album Sri Venkateswara vachanamaulu.
, నవ బ్రహ్మలును, నేకోనపంచాశన మరుత్తులును, వసువులును, దిక్పాలకులును, మునులును, సిద్ధగంధర్వపదంబులును, అణిమాద్యష్టైశ్వర్యంబులును,చతుర్దశభువనంబులును, కులాచలదిగ్గజ మహా నగములును, సింధుగంగానదీ ముఖ్య తీర్థంబులును, సకల సామ్రాజ్యంబులును, నున్నవి. పరమపదంబున్నది; నీవుగలచోట నన్నియుం గలవు; నిన్ను నాత్మ దలంచిన నాకు సకలసౌఖ్యంబులుం గలవు; శ్రీ వేంకటేశ్వరా !

No comments:

Post a Comment