Tuesday, September 25, 2018

నిలుచున్నాడిదె నేడును నెదుటను...కలిగిన శ్రీవేంకటవిభుడు...!

నిలుచున్నాడిదె నేడును నెదుటను...కలిగిన శ్రీవేంకటవిభుడు...
వలసినవారికి వరదుండీతడు...కలడు గలడితనిగని మనరో... 
"కలిగిన శ్రీవేంకటవిభుడు... ", అనే పదప్రయోగంలో అన్నమాచార్యుల వారు చాల ఆశ్చర్యకరంగా శ్రీహరి భక్తవాత్సల్యత్వాన్ని గౌరవ గుంభనంగా పొందుపరచి, శ్రీహరి కోరుకున్నంత వారికి కోరుకున్నంత...చేరుకున్న వారికి చేరుకున్నంత అని చెప్పకనే చెప్పి, స్వామిని మనకు ఎంతో చెరువగా చేసేలా చేసారు , ' గోవిందాది నామోచ్చ్హారణ ' అనే కీర్తనలో.....
ఒక్క సద్గురువు, గోవిందుడు మత్రమే, ఆశ్రయించిన వారిని, ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దాలి, అనే తలపు తోనే నిత్యం చిరునవ్వు తో ఉండగలరు... 
Sreenivasulu Somavarapu
హరి యన్న మాట
సిరి మల్లెల మూట
హరి యన్న మాట
హరించు పాపాల మూట
హరి యన్న మాట
మోక్షానికి పూల బాట
హరి యన్న మాట
తేనేటి రాగాల పాట
హరి యన్న మాట
కోరిన వరముల తోట
హరి హరి యని
కొలువవె తలవవె మనసా

No comments:

Post a Comment