కార్తీక మార్గశిర మాసాల్లోని ' ధర్మశాస్తా అయ్యప్ప ' ఆరాధనా విశేషాలు.... 
దసరా దీపావళి పండగలు అయిపోయాయి అనగానే, సర్వ సామాన్యంగా దక్షిణ భారత దేశాన కనిపించే దృశ్యం, అయ్యప్ప మాల / మండల దీక్షారాధనలు చేస్తుండే వేలాది ' అయ్యప్ప స్వాములు '....
కలియుగ ప్రత్యక్ష దైవసన్నిధానంగా వినుతికెక్కిన, 7 కొండల శ్రీభూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి, 5 కొండల శ్రీ పూర్ణా పుష్కలాంబా సమేత అయ్యప్ప స్వామి, ఒకేకొండ అరుల్మిగు ఉణ్ణామలై అమ్మన్ / అపీతకుచాంబ సమేత శ్రీ అరుణాచల శివ స్వామి, మొదలైన క్షేత్రాల్లో దైవం తన ఉనికిని తమదైన శైలిలో ప్రదర్శిస్తుండగా,
ఉత్తరాయణ మకరసంక్రమణ పుణ్యకాల ఆరాధన ( మకర విళ్ళక్కు / జ్యోతి ) ప్రత్యేకతగా, హరిహర సుతుని వైభవం సరిగ్గా అర్దం చేసుకుని మాలధారణ / మండల ఆరాధన చేయడం మరింత శుభదాయకం...
(కేవలం ఏదో మొక్కుబడిగా వేసుకున్నాం కదా అని కాకుండా, పాటించే కఠిన ఆచారనియమావళి వెనక ఉన్న ఆర్ధం పరమార్ధం ఏంటని, గురుస్వాముల పర్యవేక్షణలో కొంచెం స్వీయ పరిశీలన చేస్తూ సాగించే దీక్ష మరింత ఫలదాయకం )
నల్ల బట్టలు ధరించడం, నిత్య శీతలోదక స్నానాలు, త్రికాల ఆరాధన మొదలైన నిత్య ఆచార నియమాలు పాటించి చివరికి గురుస్వామి అనుగ్రహించిన ఇరుముడిని, 18 మెట్ట్లెక్కి స్వామికి సమర్పించడంలో , ఏమైనా తత్వం ఉందా అని కొంచెం పరికిస్తే...
సహజంగా మానవులకు నాకు ఇన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఇన్నొచు అన్నొచు, ఇలా నెత్తిన / బుర్రలో ఎన్నో భేషజాలు నిత్యం వస్తూ పోతూ ఉంటాయి...
ఎన్ని ఉన్నా, ఎన్ని వొచ్చినా, శాశ్వతంగా ఉన్నది ఉండేది కేవలం జీవుడు, దేవుడు అనే రెండు భావాలు మాత్రమే... ( ఇవే యాత్ర పొడవునా నెత్తి పైనే ఉండే ఇరుముడి - రెండు ముడులకు సంకేతం)
అవి మండల దీక్ష తర్వాత 18 బంగారు మెట్ట్లు ఎక్కి, పరమాత్ముడైన అయ్యప్ప స్వామికి సమర్పించడం అంటే....
అవి మండల దీక్ష తర్వాత 18 బంగారు మెట్ట్లు ఎక్కి, పరమాత్ముడైన అయ్యప్ప స్వామికి సమర్పించడం అంటే....
పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, వెరసి 15, మనల్ని నిత్యం శాసించే వీటిని అధిగమించి, చివరకు వీటిపైనుండే మనసు, బుద్ది, అహంకారం అనే అవాంగ్మానసగోచర త్రయాన్ని కూడా అధిగమించి, సన్నిధిలో కొలువైన అయ్యప్పను దర్శించడం, అనగా మన హృదయసన్నిధిలోనే అంతర్నిహితంగా కొలువైన దైవాన్ని, సద్గురువుల సహాయ సహకారాలతో సందర్శించడం.... 
అందుకే ఈ ఆరాధనల్లో, ఎక్కువలు తక్కువలు, నేను గొప్ప వాళ్ళు తక్కువ, ఇత్యాది భావనలకు అసలు చోటే లేకుండా అందరిని ' స్వామి ' అని పిలిచేది... ఎవ్వరైనా సరే ఎక్కేది అదే 18 మెట్ట్లు....దర్శించేది అదే ధర్మశాస్తను...!!
ఇదే అయ్యప్ప మాలధారణలోని అసలైన అధ్యాత్మ సందేశం...!!! 

No comments:
Post a Comment