Tuesday, September 25, 2018

యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవీహినః యస్యతి బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యైవా..... :D

సకల దేవతా సాకారా స్వరూప ధ్యానం సద్గురు పాద పద్మ సంస్మరణం...! 
మనం నమ్ముకున్న సద్గురు స్వరూపం, ఎప్పుడూ మనకు దెగ్గర్లో లేక పోవచ్చు...వారి దైనందిన మానుష కర్తవ్య నిర్వహణలో ఎక్కడో ఉన్నా సరే..వారి సద్వాక్కును ఆధారంగా చేసుకొని సాగించే మన దైనందిన జీవితంలో, వారు ఎల్లప్పుడూ మనకు తోడునీడై మనకు ఎన్నో విధాలుగా సహాయ సహకరాలు అందిస్తూ ఉంటారు... ఇది అధ్యాత్మ జీవుల్లెలరికి, తమ తమ గురుబోధలనందున్న శ్రద్ధావిశ్వాసాలకనుగుణంగా తమకు చేకూరే గురుబార్హస్పత్య శక్త్యానుసారంగా, విదితమయ్యే సత్యమే... 
నకు తత్ క్షణం తెలియకున్నా, దైవం మనకు తెలియచెప్పి అది అచ్చంగా మన ఆర్జితం కాదు..కేవలం గురు భిక్ష అని ప్రస్ఫుటంగా తెలియచెప్పి, అర్భకుని ఆర్తికి మెచ్చి (యోగ్యత లేకున్నను ), వర్షించబడే గురుకృపకు ముసిముసి నవ్వులతో నవ్వుకొని ఆనందపడాలో, అల్లంత పైన ఆకాశంలో ఉండి తీయని జలధారలు వర్షించే మేఘం, స్వామి పుష్కరిణి దెగ్గర కూర్చున్న మన దెగ్గరికే వచ్చి, ఇంత కిందికి మీకోసమే వచ్చేసా అని చెప్పి నవ్వినట్టుగా, గురువుగారు నవ్వుకొని ఉంటారో ఏమో అని బిడియపడాలో తెలియని మధుర స్మృతులను ఒక జీవితకాలం అలాగే పదిలపరుచుకొని ఆస్వాదించగలగడం ఒక యోగమే..! 
యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవీహినః
యస్యతి బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యైవా..... 

No comments:

Post a Comment