కలియుగం - ఒక కాలుష్యకాసారం... కమలలోచనుని సంకీర్తనం కడు చక్కని దివ్యౌషధం... 
అనివార్య వివిధ వాయు, జల, భూ, ఇత్యాది బాహ్య కాలుష్యమేకాకుండా...
ఆంతరమైన అరిషడ్వర్గ జనిత అసూయాది అవాంఛిత కాలుష్యం తో మనుషులు ఉక్కిరి బిక్కిరి అవుతూ కాలం వెళ్ళదీసే యుగం....
ఎంతగా పరికించి చూసినా, ఎవరు ఏమన్నా ఇది ఈ యుగ లక్షణం అని సాక్షాత్ శ్రీ కృష్ణస్వామి చెప్పిన సత్యం....
దానికి తగ్గట్టే మన దైనందిన జీవితంలో మనకు ఎదురుపడే తార్కాణాలు కోకొల్లలు....
ఆంతరమైన అరిషడ్వర్గ జనిత అసూయాది అవాంఛిత కాలుష్యం తో మనుషులు ఉక్కిరి బిక్కిరి అవుతూ కాలం వెళ్ళదీసే యుగం....
ఎంతగా పరికించి చూసినా, ఎవరు ఏమన్నా ఇది ఈ యుగ లక్షణం అని సాక్షాత్ శ్రీ కృష్ణస్వామి చెప్పిన సత్యం....
దానికి తగ్గట్టే మన దైనందిన జీవితంలో మనకు ఎదురుపడే తార్కాణాలు కోకొల్లలు....
కాని, ఒక సద్గురు / ఆచార్య వాక్కులు, శ్రీహరి / భగవంతుని నామాలు, అనే సర్వకాల స్వఛ్ఛమైన, ఎన్నటికీ వాడిపోని, ఎప్పటికీ సౌరభాలు వెదజల్లుతూ ఆహ్లాదాన్ని పంచి పెట్టే కలువలు కమలాలు, ఈ కలియుగ కాలుష్యకాసారపు మధ్య జీవితానికి లభించే అమూల్య నిధులు... అవి మాత్రమే ఈ నాటి మరయుగపు మృతజీవనశైలో మనం ఎక్కడా ఉన్న సరే సద్యో శాంతి, సౌఖ్యం ప్రసాదించి జీవితాన్ని చైతన్య పరిచే ఏకైక సాధనాలు...
అవి అందిపుచ్చుకొని పదిలంగా యెదలోతుల్లో దాచుకుని నెమరు వేసుకునే వారికి, క్రమక్రమంగా వారి జీవితాన్ని అవి తీర్చిదిద్దుతూ ఐహిక ప్రయాణానికి కాలసిన సహాయాన్ని సమకూర్చి, తద్ అంతర్లీనంగా తుదకు ఉన్నతమైన పారమార్ధిక యాత్రకు బాటలు వేసే వెలకట్టలేని పెన్నిధి...
అందునా, ఈ కలియుగం చిత్రమైన విచిత్రాలకు ఆలవాలం.....
దైవానుగ్రహంతో స్వతహాగా బాగనే ఆర్జిస్తూ, కొడుకు తరతరాలకు సరిపడా సంపాదించి, కోటి పైచిలుకు పలికే మంచి సౌధం కట్టించినా సరే,
తమ సమీప బంధువులు అంతలా కాకపోయిన, కొంతలో కొంతైనా ఉన్నతివైపుగా వెళ్తుంటే... అదేదో గుండెపోటు వచ్చినంత బాధగా,
ఒక పెగ్గు కూడా పడకముందే... "అన్నా...నా కోడుకు అంటే విదేశాలకు వెళ్ళి కట్టాడుకాని, వాడు ఇక్కడే ఉండి పెద్ద ఇల్లు కట్టుకోవడం నాకు అస్సలు మింగుడుపడట్లేదు...." అని తమ ఉదర బాధను చెప్పుకుంటూ ఊగిపోయి బ్రతికే వారు ఉండడం.....
తమ సమీప బంధువులు అంతలా కాకపోయిన, కొంతలో కొంతైనా ఉన్నతివైపుగా వెళ్తుంటే... అదేదో గుండెపోటు వచ్చినంత బాధగా,
ఒక పెగ్గు కూడా పడకముందే... "అన్నా...నా కోడుకు అంటే విదేశాలకు వెళ్ళి కట్టాడుకాని, వాడు ఇక్కడే ఉండి పెద్ద ఇల్లు కట్టుకోవడం నాకు అస్సలు మింగుడుపడట్లేదు...." అని తమ ఉదర బాధను చెప్పుకుంటూ ఊగిపోయి బ్రతికే వారు ఉండడం.....
స్వతహాగా జీవితమంతా కష్టపడి ఇద్దరు కొడుకులను తీర్చిదిద్ది జీవితాన్ని సుస్థిరం చేసి అరచేతిలో అరటిపండులా పెట్టినా సరే, భర్తను, ఇద్దరు కోడళ్ళను ఎప్పుడూ ఏదోటి తిడుతూ వాళ్ళ చేత ఒక మంచి అత్తగా పేరుతెచ్చుకోలేని పెద్దలు, సమీప బంధువుల పిల్లలను, 'వీడికి ఎవరి మెంటల్ గుణం వచ్చిందో ఏమో....' అని తీర్పులు చెప్పేయడం.....
తల్లితండ్రులు ఎంతో కష్టపడి చదివించిన రోజుల్లో, బాగా చదువుకోకుండా ఎంత చెప్పినా వినకుండా, సినిమాలు ఆటలు అమ్మాయిలు అంటూ గాలి తిరుగుళ్ళు తిరిగి... తీరా జీవితంలో స్థిరత్వం సాధించవలసిన సమయంలో, వాడు సంపాదిస్తున్నాడు వీడు సంపాదిస్తున్నాడు అని అందరిపైకి అరుస్తూ బ్రతికే వారికి, 'ముంచుకొస్తున్న నిద్రను మొహాన వేడినీళ్ళు కొట్టి ఆపి, ఆ రోజుల్లో పగలు రాత్రి అంతగా కష్టపడి చదివి మార్కులు రాంకులు సాధించినందుకు కదా నేడు అలా మనకంటే బెటర్ గా ఉన్నారు...' అనే కనీస ఆలోచనకూడా లేకుండా ఉండడం...
"మనమంటే ఎప్పటినుండో కేంద్ర ఉద్యోగం, లాభసాటి బిసినెస్ చేస్తూ, జీవితంలో ఉన్నతంగా ఇలా హాయిగ తరతరాలకు సరిపడా స్థిరచరాస్తులను కూడబెట్టి సుఖంగా ఉన్నాం... కాని, చిన్న ఉద్యోగాలతో బ్రతుకుతూ చిన్న చిన్న స్లం ఇళ్ళలో ఉండే వారు ఇలా పైకిరావడం ఏంటి అసలు... ఈ అయిటి జాబులు వచ్చి ఇలా బాగు పడ్డారు కాని, అసలు మన స్టేటస్ ఎక్కడా వాడి స్టేటస్ ఎక్కడా ...." అని అతలాకుతలం అవుతూ బ్రతికేవారుండడం....
" పిల్లల చదువుఏమైతే నాకేంటి, అసలు వాళ్ళు ఏమైపోతే నాకేంటి, నా విలాసాలు, నా వ్యసనాలు, నా ఇళ్ళు, నా సంపాదన, అంతా నా ఇష్టం... మీరందరు ఎక్కడికైనా వెళ్ళిపోండి నాకు సంబంధం లేదు..." అని కుటుంబ భాధ్యతను గాలికివదిలేసి, బ్రతికే తండ్రులు ఉండడం.....
మరోవైపు,
అహర్నిశలు పిల్లలకు ఏమి వండిపెట్టాలి, వారికి కావలసిన చదువుల గురించి అలోచిస్తూ.... ఇలా జీవితమంతా అన్నపూర్ణగా బ్రతికే గృహలక్ష్మి స్వరూపాలు....
తమ పిల్లలు మాత్రం జీవితంలో తమంతగా కష్టపడొద్దని భావించి, ఇంకా పై చదువులు చదవగలిగినా సరే, వాటికి స్వస్తి పలికి, చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకొని, కొడుకు కూతురు జీవితంలో బాగా వృద్ది చెందితే అదేచాలు నా జీవితానికి, అని బ్రతికే తండ్రులు....
నమ్ముకున్న శిష్యుల కోసం, నిస్వార్ధంగా జీవితాన్నే అంకితం చేసే గురువులు......
నమ్మిన ఆశయంకోసం, భగవంతుడే సర్వస్వం...భగవద్ భక్తి ప్రచారమే సకలం...అంటూ జీవించే వారు.....
90 పైచిలుకు ముదిమి ప్రాయంలో కూడా, భగవంతుని గుణగానం లో ఆరితేరి, మానసికంగా అప్పటికప్పుడే భగవంతుని సన్నిధికి కొనిపోయేలా చిడతలు వాయించ గల పెద్దలు.....
ఇలా ఈ కలియుగం విచిత్రాల సమ్మేళనమై ఉండి.....
కేవలం భగవద్ నామం / గురు వాక్యమే, ఈ యుగంలో జీవిత నావను సరిగ్గా నడపగలిగే సాధనం అని రూఢి పరిచే సంఘటనలు తరచి చూడగ ఎన్నెన్నో.... 
" కలౌ వేంకటనాయకః " అని పెద్దలు మనకు చెప్పినట్టుగా, ఈ కలియుగపు ప్రత్యక్ష దైవం అయిన గోవిందుడు, ఆ ఏడు కొండలపై నిలిచి...
" మీరు ఏవరు ఏమిటి ఎందుకు అనే దానితో నాకు పనిలేదు.....నా శ్రీపాద శరణాగతి చేసిన మరుక్షణం మీ జీవిత భాద్యత అంతా నాదే...." అనే విధంగానే మనలను సదా అనుగ్రహిస్తూ ఉండి, ఇంకా 4 లక్షల పైచిలుకు సంవత్సరాల వరకు నేను ఇలాగే నిల్చొని ఉంటా...మీ కోసం చిరునవ్వులు చిందిస్తూ...." అంటూ ఉన్నాడు ఆ గోపాలుడు..... 

No comments:
Post a Comment