"ఇరుసు లేకుండా ఈ భూమి చక్రమును ఎల్లవేళ తిప్పుచున్నాడయా ఉన్నాడయ్య దేవుడున్నాడయా.....
"
ఉన్నాడయ్య దేవుడున్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా కనిపింపకేమి చేస్తున్నాడయా?
దేవుడు ఉన్నాడు అంటునావు కదా ఏమి చేస్తున్నాడు? మాంస నేత్రమునకు దొరకడు అంటున్నావు. మరి ఉన్నాడని అనడానికి ఏమిటి ఆధారము?

లోకాల చీకట్లు పోకార్ప గగనాన రవి చంద్ర దీపాలు ఉంచాడయా ఉన్నాడయా దేవుడున్నాడయా.
ఇంట్లో దీపము లేకుండా ఉండకూడదు కనక పగటి పూట సూర్యుడు అన్న దీపము రాత్రిపూట చంద్రుడు అన్న దీపము ఉంచాడు. దీపము లేకుండా ఇల్లు ఎప్పుడూ ఉండదు. ఆయన ఇల్లు ఎప్పుడూ మంగళప్రదమే. ఆ దీపములను పెట్టి అవి కొడిగట్టి పోకుండా చేస్తున్న వాడు ఈశ్వరుడే.

ఇరుసు లేకుండా ఈ భూమి చక్రమును ఎల్లవేళ తిప్పుచున్నాడయా ఉన్నాడయ్య దేవుడున్నాడయా.
సూర్యోదయము అయింది అంటే భూమి సూర్యునకు ఎదురుగా వచ్చింది. భూమి సూర్యునకు ఎదురుగా ఉంటే పగలు ఆయన కిరణములు పడకుండా వెనక్కి వెళ్ళిపోతే సూర్యాస్తమయము చీకటి. భూమి తిరుగుతున్న ది.

లక్షలాదిగ ఉన్న నక్షత్రములెల్ల నేలరాలక మింట నిలిపాడయా ఆధారమే లేని ఆకాశము భూమిపై పడకుండ ఆపాడయా ఉన్నాడయా దేవుడున్నాడయా
కన్నులకు కనిపింపకున్నాడయా పొంగిపొరలుతు వచ్చి భూమిపై పడకుండ కడలిరాయుడి కాళ్ళు కట్టాడయా
ఆయన ఆజ్ఞ లేకపోతే సముద్రము పొంగుతూ వచ్చి భూమి మీద పడిపోతుంది. నాలుగు కెరటములతో అలా వెనకకు వెళ్ళమని చెలియలి కట్ట దాటవద్దని ఎవరు శాసించారు? దాటి వెళ్ళడానికి వీలు లేదని ఎవరు వేలు చూపించి చెపితే ఆగిపోయింది? సముద్రము బయటికి వస్తే వేలకోట్ల నష్ఠము జరిగి పోతుంది. కాళ్ళు చేతులు కట్టేస్తే గింజుకుంటారు. సముద్రము ఘోషతో అలాగే ఉంటుంది. ఎంత గొప్ప దర్శనము చేసారో జానపదులు.

జగతిలో ఉన్న జీవరాశుల కెల్ల అన్నమిడి ఆదరించాడయా. తెరవెనక తానుండి తెరముందు మననుంచి తైతక్క లాడించుతున్నాడయా. ఇన్ని పనులున్నవాడు ఎన్నటికొ కనిపించు నన్నమాట నమ్మకున్నారయా
జీత బత్తెము లేక గాలిలో సురిటీలు మనకొరకు తిప్పుతూ ఉన్నాడయా ఉన్నాడయా దేవుడున్నాడయా
మహానుభావుడు ఇన్ని పనులు ఉన్నవాడు ఎలా కనపడతాడు? ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటాడు. లేకపోతే జీవకోటికి అన్నము ఏది.

జీత బత్తెము లేక గాలిలో సురిటీలు మనకొరకు తిప్పుతూ ఉన్నాడయా
గాలిని ఆయన కదుపుతున్నాడు. అలా తోస్తుంటే గాలి అంతటా ప్రసరించి మనకి ఊపిరి అందుతున్నది అలా తోస్తున్నందు వలన మనము ఏమీ జీతము ఇవ్వడము లేదు. ఈశ్వరుడుకి మనము తినే అరటి పళ్ళు కూడా పెట్టము గుళ్ళోకి అంటే చిన్న చిన్న పళ్ళు అమ్ముతారు పావలాకి నాలుగు అవి పెడతాము. అటువంటి వాడు ఈశ్వరుడు ఆయన ప్రభుత్వము అలా ఉంటుంది.

No comments:
Post a Comment