హరియవతారమీతడు అన్నమయ్య...అరయ మాగురుడీతడు అన్నమయ్యా.....! 
ఆన్నమయ్య పదం -- ఆ తుంటరి గోపాలుడైన నందనందనుని, ఆనందనిలయుని, నందివాహన వల్లభుని అనునిత్యం అర్చించి స్మరించి కీర్తించి, ఈ కలియుగ జనసామాన్యమునకు అరచేతి చింతామణిగా అందివ్వబడిన అమరవంద్యుడి శ్రీపాదపద్మార్చిత కైంకర్యపు అమరకోశం... శ్రీవేంకటశైల వల్లభున్ని, ప్రార్ధించిన ఉత్తర క్షణం మన దరిజేర్చు అక్షరదర్పణం...! 
దేశకాలానుగణంగా ధర్మాధర్మ విచక్షణా పరిధి విస్తరింపబడి, వివేకం వర్ధిల్లి ధర్మసూక్ష్మాన్ని ఆకళింపజేసుకుంటూ, మిగిలిన 3 పురుషార్ధాలైన అర్ధ కామ మోక్షాలను సాధించడమే ప్రతిమనిషి యొక్క కర్తవ్యం అని ఎందరో సద్గురువులు / వాగ్గేయకారులు బోధించుట విదితమే అయినా.... ఈ తరంలోని బహు కొద్ది సద్గురువులు మాత్రమే, అనగా భువిపై ప్రత్యక్ష సరస్వతీ స్వరూపులుగా నడయాడే శ్రీ చాగంటి గురువుగారు మొదలైన వారు మాత్రమే, అధ్యాత్మతృష్ణ కలిగిన వారిని భగవద్ మార్గము వైపునడిపిస్తూ ఇహ పరములకు మార్గదర్శిగా ఉంటూ, కలికాలపు ఉధృతినుండి జీవులను ఉద్దరించే జ్ఞ్యానయజ్ఞ్యంలో అహరహం శ్రమిస్తూ, భగవంతుడు ఎక్కడెక్కడో ఉన్నా, తనను నమ్ముకున్న వారి సద్వాక్కులను ఆలకించిన చోట తప్పక ఉండేలాచేస్తూ ఉండడంలో అసలు ఆంతర్యమేమి...?
యుగలక్షణం అనే అంశంపై కాస్త అవగాహన పెంపొందించుకుంటే, ఈ విషయం కొంత సులభమే అని పెద్దల ఉవాచ...
ఎంత తింటే అంత ఆరోగ్యాన్ని హరించే క్రిమిసమ్హారకపూరిత సస్యములు...
ఎంత పీల్చితే అన్ని ఇబ్బందులు కలిగించే కాలుష్యపూరిత ప్రాణవాయువు...
ఎంత తాగితే అంతగా శరీరజలకళను శుష్కింపచేసే గరళజలములు....
ఇక భవబంధాలా మాటున దాగిన అరిషడ్వర్గజనిత కాలుష్యం గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ కలికాలంలో...!
ఎంత పీల్చితే అన్ని ఇబ్బందులు కలిగించే కాలుష్యపూరిత ప్రాణవాయువు...
ఎంత తాగితే అంతగా శరీరజలకళను శుష్కింపచేసే గరళజలములు....
ఇక భవబంధాలా మాటున దాగిన అరిషడ్వర్గజనిత కాలుష్యం గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ కలికాలంలో...!
ఇలా ప్రతిచోటా కల్తీలకు నిలయమైన కలియుగంలో, అసలైన సిసలైన సారవంతమైన సరలమైన సత్యమైన వస్తువు అసలు లేనే లేదా..? అని తరచి చూస్తే, అది కేవలం భగవన్నామము మాత్రమే అని ఒప్పుకోకతప్పదు. కులమతవర్ణవర్గలింగవయోసాంప్రదాయాది భేదములకు అతీతంగా, అందరికీ అన్నికాలాల్లో అశుభములను హరించి శుభములు కలిగించే సాధనం ఎదైనా ఉందా అంటే అది దైవనామమే ..!
అందుకే 6 శతాబ్దాలకు పూర్వమే, సాక్షాత్ శ్రీహరి నందక ఖడ్గాంశ స్వరూపులుగ జన్మించిన అన్నమాచార్యుల వారు, ఎన్ని నీతులు బోధించినా ఎన్ని మార్గాలు ప్రతిపాదించినా ఈ కలియుగమానవులకు అవన్నీ అంతగా ఫలించవనే సత్యద్రష్టులై, కేవలం భగవద్ మధుర నామ గుణ వైభవ గానమే అన్నిటికీ సరైన మార్గోపాయమని అందించిన అమూల్య నిధి అన్నమార్యుల సంకీర్తనా పెన్నిధి...!
" మోక్షసాధనా సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి ", " జ్ఞ్యానాత్ ఏవతు కైవల్యం " అనే ఆర్యోక్తులను సమ్మిళితంగావించి, భక్తి జ్ఞ్యానములనే సరిజోడిగాకూర్చి, భవలంపట స్వప్రక్షాళనకు బాగా అందించినబడినది, శరణాగతులందరి జీవితాలను బాగుగా చేయునది భగవద్ నామము..!!!
అందుకే అన్నమాచర్యులవారు పరవశించి, 'గోవిందాది నామోచ్ఛారణ కొల్లలు దొరకెను మనకిపుడు' అనే సంకీర్తనలో, సత్యము నిత్యము అయినది భగవంతుడు / భగవద్ నామము అని ఎంతో రసరమ్యంగా కృతిపరిచారు... 
" సత్యము సత్యము సకలసురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు
ప్రత్యక్షమిదే ప్రాణులలోపల అత్యంతము శరణనరో యితని..! "
ప్రత్యక్షమిదే ప్రాణులలోపల అత్యంతము శరణనరో యితని..! "
No comments:
Post a Comment