మామూలుగా ఏదైనా ఒక మంచి సినిమా చూసి ఆ.. ఈ కథ బానే ఉందిలే అని అనుకొని ఒక 3 గంటల పాటు హాయిగా అందులో లీనమై కొన్ని పాటలకు పరవశించి, కొన్ని డైలాగులకు విసిల్ వేసి, కొన్ని సందర్భాలకు బాధపడి, బయటికి వచ్చాక ఖాళి పాప్కార్న్ పాకెట్ అలా పక్కకు పడేసి, మళ్ళి యథాతధంగా కొన్ని దశాబ్దాలు ఆడే మన నిజ జీవితపు సినిమాలోకి ప్రవేశించి, అదే విధమైన స్పందన ప్రతిస్పందనల మధ్య బ్రతికే మనకు......
అప్పుడప్పుడు సినిమాల్లో ఒక ' స్పెషల్ రోల్ ' ప్లే చేసే వాళ్ళు , ఆ సినిమాలోని హీరో / హీరోయిన్ ని కలపడమో, లేదా అస్తవ్యస్తమైన వారి కుటుంబాన్ని చక్కదిద్ది వాళ్ళ జీవితాలను సుస్థిరం చేయడమో, శోకం లో ఉన్న వారి జీవితాలకు మరచిపోలేని మేలు చేయడమో, అలా ఒక ' పాసిటివ్ కెటలిస్ట్ ' రోల్ ప్లే చేసి... కేవలం అప్పుడప్పుడు మాత్రమే తెరపై తళుక్కుమని కనిపించి..." అరే ఈ పర్సన్ వల్లే కదా అసలు ఈ సినిమా అంతటికి ఒక మంచి ముగింపు వచ్చింది...నిజంగా ఎంత గొప్ప రోల్ వీరిది...." అని ఫీల్ అవుతూంటాం...
( పవర్ స్టార్ మూవీస్ లో ఇలాంటి స్పెషల్ రోల్స్ బాగా చూడోచ్చు.... ఖుషి, మొదలైన సినిమాల్లో )
( పవర్ స్టార్ మూవీస్ లో ఇలాంటి స్పెషల్ రోల్స్ బాగా చూడోచ్చు.... ఖుషి, మొదలైన సినిమాల్లో )
అలా కొన్ని అడ్వెర్టయిస్మెంట్లు , కొన్ని పద్యాలు, కొన్ని వాక్యాలు / శ్లోకాలు, కొందరు మహాత్ములు....
తళుక్కుమని ప్రవేశించి, మన జీవితానికి కూడా తెరవెనకే ఉండి అలాంటి అమూల్యమైన సహాయం చేస్తూ ఉంటారు...అసలు వాళ్ళ రంగప్రవేశమే జరగనినాడు ఈ జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండిపోయేదేమో అనిపిస్తుంది....
తళుక్కుమని ప్రవేశించి, మన జీవితానికి కూడా తెరవెనకే ఉండి అలాంటి అమూల్యమైన సహాయం చేస్తూ ఉంటారు...అసలు వాళ్ళ రంగప్రవేశమే జరగనినాడు ఈ జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండిపోయేదేమో అనిపిస్తుంది....
"ఉప్పు కప్పురంబునొక్క పోలికనుండు చూడ జూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ... " అని అందుకే అన్నారు అనుకుంటా వేమన మహానుభావుడు... 
శ్రీహరి సంపూర్ణ మొట్టమొదటి మానవావతారమైన శ్రీరాముని అయనంగా సాగే శ్రీమద్రామాయణం లోని పరమ శక్తివంతమైన సుందరకాండలోని మొట్టమొదటి శ్లోకం లోని మొట్టమొదటి అక్షరం ' త ' .... ఒకరి జీవితాన్ని సాఫల్యం చేయాడానికి, హరి కి త కారం జోడించి...మొత్తం జీవితానికే శ్రీ కారం చుట్టి అసలు చివరి శ్వాస వరకు మరచిపోలేని మేలు కూడా చేస్తూంటారు అలాంటి కొందరు మహనీయులు....! 

No comments:
Post a Comment