Tuesday, September 25, 2018

" కోటిం త్యక్త్వా హరింభజేత్...." :)

తిరువేంకటశైల వల్లభుడు... (స్వామి పుష్కరిణి) కోనేటిరాయుడు...వడ్దికాసులవాడు...భాగవతప్రియుడు...అలర్మేల్మంగా ప్రాణేశ్వరుడు... 
మొదలైన గౌణములన్నింటికి మకుటాయమానంగా జగద్విదిత శ్లోకం ఉండనేఉంది...
వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన,
వేంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి....!!
శ్రీ ఆదిశంకర భగవద్ పాదుల వారి ప్రార్థన మేర కలియుగ ప్రత్యక్ష దైవంగా,
ఆచార్య భగవద్ రామానుజులవారిచే పరతత్వ ప్రామాణ్యనిరూపణము గావించబడగా,
రుద్రుడు తన సద్యోజాత, అఘోర, వామదేవ, తత్పురుష, ఈశానాస్యములతో అత్యంత దుర్భేద్యమైన రక్షణావలయం తో తిరుమల ఆలయాన్ని తన అధీనంలోకి తీసుకొని, కాపలా కాస్తూ ఉండగా... మరియు తన శాక్తేయ సామ్యమును కీలకమైన శక్తికేంద్రాలుగా తిరుమలకు ఏడువైపుల భాసిల్లేలా చేసి,
బాహ్యమున, అత్యంత కట్టుదిట్టమైన శ్రీ వైఖానసాగమోక్త క్రియాదులను ఆధారంగా చేసుకొని, తన నిత్యోపచారాలను చేయించుకుంటూ, ఆంతరమున, ( తత్వదార్శనికుల, సద్గురువుల, ఆచార్యుల బోధతో గుర్తించగలిగిన వారికి ) సకలాగమ సంసేవితుడిగా, సకలదేవతా సార్వభౌముడిగా, చతుర్దశభువనాధీశునిగా, సజీవ సాలిగ్రామావేశిత విశ్వసౌందర్యరాశిగా, నిర్మల భక్తి అనే పాశంతో, గోవింద నామం అనే ముడితో, ఇట్టే బంధింపబడే సులభుడిగా, ఎనలేని సౌజన్యమూర్తిగా 7 కొండలపై కొలువైన స్వామి, దీనజనబాంధవునిగా, పిలిచిన పలికే ప్రత్యక్షదైవమై, అన్నమాచార్యుల వాక్కులో చెప్పాలంటే " కొలిచిన వారల కొంగుపైడి ఇతడు....." వలచిన వారికి వరదుండీతడు..కలడు కలడితని కనిమనరో...." అన్న విధంగా, మనసులో ఆర్ద్రతను అరచేతిలోని ధనస్సుగా..., చిత్తములో శుద్ధతను వింటినారిగా..., గురువాక్కుపై ఎనలేని శ్రద్దావిశ్వాసం తో మది నమ్మిన శ్రీహరి నామమే తిరుగులేని శరముగా చేసి, సద్గురువు ప్రసాదించిన సంకల్పమే మంత్రమై సంధించబడిన స్వామి పుష్కరిణీ లోని అర్ఘ్యజలమే ఆగ్నేయాస్త్రమై, సర్వాఘనాశినియై, సర్వేప్సిత ప్రదమై, ధర్మ సంకల్పాలన్ని ఆకాశ గంగా ధారల్లా జీవితపు లోగిలి లోకి జల జలా జాలువారి, జాజుల జాజరగా మన జీవితాన్ని మలచే మంచి మిత్రుడు తిరువేంకటమాధవుడు.....!!! 
రమారమి ~ 5 సంవత్సరాల క్రితం కాకినాడలో జరిగిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవంలో పాల్గొన్నప్పుడు, శ్రీ చాగంటి గురువుగారు చెప్పిన మూడు వాక్యాలు, నా జీవితానికి పెట్టనికోటగా మారి, ఒక రైతు సేద్యానికి పాడియావు, కాడెద్దే ప్రపంచమైనట్టుగా... అహరహం ఆ మాటలే సకల పెన్నిధులకు గంగమ్మ ఊటై ఎదలో మదిలో ఒదిగిపోయింది...

" కోటిం త్యక్త్వా హరింభజేత్...."
" భాగవతుల తోడి సంగము బాగవ్వాడానికి అత్యంత శ్రేయోదాయక సులభోపాయము...."
" మహాపురుషులకు మీరు సమర్పించుకున్న ఫలహారమో / ఫలమో / అక్షయ పాత్రగా మారి మీ యావద్ జీవితాన్నే సుసంపన్నం చేస్తుంది... నను నమ్మండి ఇది నిజం..."
నిజమే... నమ్మేసి ఆచరించి ఫలం పొందడానికి సమయం కొంతైనా ఎంతైనా సరే....అవి ఫలించి తీరుతాయి... సంధించబడిన శ్రీరామ శరము తన గమ్యము ఖచ్చితముగా చేరినట్టుగా...
( గురువు వాక్క్ అనుగ్రహంతో "శ్రీహరి శ్రీహరి శ్రీహరి...అంటూ నిద్రలేవడం అలవాటుగా అయిపోతుందని అనుకున్నా గాని....
హరి హరి హరి అంటూ నిద్రపోవడం కూడా అనుగ్రహంగా అవుతుందని అనుకోలేదు....  )
ANNAMACHARYA-LYRICS.BLOGSPOT.PE
Archive Audio link : G Balakrishnaprasad Ragam : Chakravakam, Composer : Balakrishnaprasad ప|| త్రికరణశుద్ధిగ జేసినపనులకు దేవుడు మెచ్...

No comments:

Post a Comment