Tuesday, September 25, 2018

A dawn for a brighter sunrise ahead....Engaged...! :)

A dawn for a brighter sunrise ahead....Engaged...! 
ఒక జీవితకాలపు శ్రీకార్యానికి గోవిందుడు చుట్టబోతున్న శ్రీకారానికి, ఓంకారం...!
తొలి సంధ్య వేళలో.. తొలి పొద్దు పొడుపులో....తెలవారే తూరుపులో....
( భూపాళానికి బదులుగా, మోహనం...దేవగాంధారం... వినాలేమో...  )
శ్రీ చాగంటి సద్గురువుగారు ఎన్నో ప్రవచనాల్లో చెప్పినట్టుగా,
మురమళ్ళ భద్రకాళి - వీరభద్ర కల్యాణవైభవం / తి.తి.దే శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి కంకణధారన ప్రాశస్త్యం 
శ్రీ వేంకటేశ్వర ప్రొడక్షన్స్ సమర్పించు,
"అమ్మ నాన్న ఒక తెలుగమ్మాయి....."
( వినయంగా నిలుచున్న ఆ రవితేజ ని నేనే )
అనే చిత్ర నిర్మాణం ' క్లాప్ కొట్టి ' , ఇరు కుటుంబ సభ్యుల / పెద్దల / ఆచార్యుల / గురువుల ఆశీర్వాదములతో, హేమలంబ (హేవిళంబి) మార్గశిర శుద్ద ఏకాదశి న ప్రారంభం గావించబడింది...
ఇంకో 3 మాసాల్లో పెళ్ళి లో తెరపై స్వస్తిక్ గుర్తుతో జీవితంలో ఒక నూతన ఒరవడికి స్వాగతం పలకబోతోంది... 
అన్నమాచార్యుల మాటల్లో చెప్పాలంటే, "ఈతడే రఘురాముడీతడేకాంగవీరుడు యీతడు చేసిన చేత లెన్నియైనా కలవు..." అన్నట్టుగా, మనం వెళ్ళి ఆ ఆది దంపతులిద్దరికి
' విన్నపాలు వినవలే వింత వింతలు...' అంటూ "స్వామి దేహి...!" అని అర్ధించినదే తదుపరి, తన సుదర్శన చక్ర, వైకుంఠహస్త వైభవాన్ని ప్రదర్శించడం మొదలుపెడతాడు..
అటు లయకారునిగా ఉండి, కార్యానికి అడ్డు పడుతున్న అఘాన్ని నాశనం చేసి, ఇటు స్థితికారునిగా యోగాన్ని, శుభాన్ని ప్రసాదిస్తాడు 
త్రికరణాత్మకంగా నమ్మిన వారికి గురువాక్కు ఏమైన ఎంతైనా సమకూర్చి పెట్టగలదు...
ఈశ్వరానుగ్రహానికి రాచ బాట సద్గురు మాట...! 

No comments:

Post a Comment