Friday, September 21, 2018

Wishing all my dear fellow Indians a very happy 72nd Independence Day celebrations.....!! :)

Wishing all my dear fellow Indians a very happy 72nd Independence Day celebrations.....!! 
मेरे प्यारे भारत वासियो को 72 वि स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाये...!! 
స్వతంత్ర భారతావని 72వ పడిలోకి అడుగిడుతున్న శుభవేళ...
' దేశభక్తి ' గల ఆత్మీయులందరికి స్వాతంత్ర్య
దినోత్సవ శుభాభినందనలు...! 
అసలు ' స్వతంత్రత ' అంటే ఏంటి...? అది ఒక పదమా ?
ఒక భావన ? ఒక కల్పన ? ఒక హక్కు ? ఒక బాధ్యత ? ఒక సౌకర్యం ? ఒక కర్తవ్యం ? ఒక కల ? లేక అనేక నిజాలు మూర్తిభవించిన ఒక నిలువెత్తు నిండు భావరూపమా ?
ఎన్నో సాయుధ, నిరాయుధ పోరాటాల అనంతరం దేశంలోని ఎందరో మహావీరుల ప్రాణత్యాగాల ఫలితంగా, మహోన్నత మేధావుల కలం యొక్క కదలికలకు భావకందకమై, కఠిన దాస్య శృంఖలాలనుండి విముక్తి పొంది, 7 దశాబ్దాల సుదీర్ఘ చరిత్రను, ఆంతరంగిక ఆటుపోట్లను, సస్య, సాంకేతిక, పాడి, పారిశ్రామిక, ఇత్యాది ఎన్నో రంగాల్లో అధునాతన అభివృద్ది పోకడలను పునికిపుచ్చుకుంటూ, విభిన్న సంస్కృతుల సమాహారమై, బహు వేషభాషల భావావేషాల భూభాగమై, నిత్యనూతనంగా వర్ధిల్లుతున్న భరతభూమి యొక్క సమగ్ర స్వరూపాన్ని ఈ దేశం యొక్క ' స్వతంత్రత ' అని భావించగలిగితే...,
ప్రతి మనిషికి తనదంటూ ఒక శరీరం, ఒక ఇల్లు, ఒక కుటుంబం, ఒక వృత్తి, ఒక ప్రవృతి, ఒక ఆలోచనాసరళి, అన్ని కలగలిపిన ఒక ఉనికి ఉన్నప్పుడు, తనకు ' తనదైన స్వతంత్రత ' అనేది ఎదైనా ఉంటుందా ?
లేక శ్రీ ఆదిశంకరాచార్యులు తమ మోహముద్గరంలో 'పునరపి జననం, పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం..ఇహసంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే...భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే....." అని చెప్పిన్నట్టుగా, ఈ విశాల విశ్వాంతరాలకు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎందుకు మన పయనం అనే విషయంతో ఎదైనా సంబంధం ఉండి, ఆ పయనం నుండి తాత్కాలికమైన లేదా శాశ్వతమైన విశ్రాంతి తీసుకునే ' స్వతంత్రత ' మనిషికి ఉందా / ఇవ్వబడిందా ? అనే ఆలోచన, సువిశాల భావప్రదాయికమైన ఆధ్యాత్మిక భావసారూప్యత కలిగిన కొందరికైనా రావడం కద్దు...!
గంగా గోదావరి తీరాల్లోని ఇసుక రేణువులనైనా లెక్కించ వచ్చేమో కాని, ఒక మనిషి జీవుడిగా ఇతహ్పూర్వం ఎన్ని కోట్ల జన్మలను ఎత్తి, ఎన్ని కోటానుకోట్ల కర్మలను ఆచరించి, ఇప్పుడు తాము ఉన్న స్థితిలో, ఉన్నత స్థితిలో, ఉండగోరే స్థితిలో, ఉండడం జరుగుతుందో గణించశక్యం కాదని మన పెద్దల ఉవాచ...సద్గురువులు బ్రహ్మశ్రీ చాగంటి గారి ' జీవయాత్ర ' ప్రవచనం విన్నవారికి ఇవి సుపరిచితాలే....
అంటే మనిషికి జీవజనితమైన స్వతంత్రం ఉండీలేనట్టా, లేక ఉన్నాకూడా గుర్తించలేక ఉన్నట్టా...? ఒక్కొక్క జీవయాత్రలో ఒక్కొక్క స్వతంత్ర జీవనశైలిని ఆకళింపుచేసుకున్న జీవుడు, ఇప్పుడున్న జీవితానికి అవి ఆపాదించుకుంటూ మరిన్ని సరికొత్తవి నేర్చుకుంటూ, తనదైన శైలిలో ఆ ' శాశ్వత స్వతంత్రత ' కోసం వేతుకులాటలో తనని తానే సమిధగా అర్పించుకుంటూ బండరాయిగా మొదలైన జీవయాత్ర లో తుదిలేని గమ్యంవైపుగా ఇంకొంచెం ముందుకు సాగిపోతున్నాడా...?
లేదా ' సద్గురువు వాక్కు ', అనే దృఢమైన ఆలంబనను గ్రహించి, కంటికి కనిపించని కనిపించనవసరంలేని సత్యమైన, నిత్యమైన, దైవం అనే ఒక మహా వెలుగువైపు తన జీవ ప్రస్థానాన్ని పూర్తి ఎరుకతో విలీనం చేసుకునే దిశగా, ' తాత్కాలిక స్వతంత్రతను ' కోల్పోతు ' శాశ్వత స్వతంత్రతను ' సంతరించుకునే దిశగా తన గమ్యాన్ని తానే పరచుకుంటూ గమనం సాగిస్తున్నాడా....? అనేది కేవలం ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా అంతర్వివేచనతో తర్కించి, లోచూపు సారించి, తమలోతామే లయించి పోయి గ్రహించవలసిన ' స్వతంత్రత ' అనే మధురమైన జీవబ్రహ్మైక్య స్థితిసారూప్య భావమంజరి అనడం సమంజసమేమో...! 
"నీ గమనంలో పటుతర తోడుగా ఉండి, నీ గమ్యాన్ని సుస్పష్టంగా చూపిస్తు, నీ గతిని చక్కదిద్దే ఘనమైన దైవాన్ని నేను...." అంటూ చిరునవ్వులు ఒలికిస్తూ వరద కటిహస్త విరాజితుడై ఉన్న ఆ మహోజ్వల విశ్వతేజస్సు, మహాసంప్రోక్షణంతో మరిన్ని అధ్యాత్మ వెలుగుజిలుగులు అలదుకొని దేదీప్యమానమైన దివిటీగా మన జీవయాత్రకు ' శాశ్వత స్వతంత్రత ' ను సదా చూపేందుకు సన్నద్ధం అవుతున్నాడు 7 కొండల శ్రీనివాసుడు...! 
అందుకే అన్నమాచార్యుల వారు పరవశించి, తమ " ఊరకే దొరకునా వున్నతోన్నతసుఖము సారంబు తెలిసికా జయము చేకొనుట " అనే కీర్తనలో,
" తనశాంతమాత్మలో తగిలినప్పుడు గదా పనిగొన్నతనచదువు ఫలియించుట,
యెనలేని శ్రీవేంకటేశ్వరుని దాస్యంబు తనకు నబ్బినగదా దరిచేరిమనుట...." అని కృతిపరిచారు... 
ఒక సూచిక అయిన త్రివర్ణపతాకం ఈదేశం యొక్క సార్వభౌమత్వానికి సర్వస్వమై, ఉన్నతమైన ఉనికికి చిహ్నమై భాసించి, ఎక్కడున్నాసరే అందరిచే నమస్కారంపొంది వారికి దేశభక్తిని కటాక్షించ గలిగే సాధనమైనప్పుడు,
ఒక సూచిక అయిన దేవుని మూర్తి, ఒక మనిషి యొక్క మనుగడకిి సర్వస్వమై, వారి ఉన్నతమైన ఉనికికి చిహ్నమై, వారికి సకల యోగక్షేమములు కటాక్షించ గలిగే సాధనమై ఒప్పడం అంతే ఖచ్చితం కదా...! 


https://www.facebook.com/Vinay.Aitha/posts/10215115134605101

No comments:

Post a Comment